కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/1 పేజీలు 9-13
  • ఎవరికి సమర్పించుకున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవరికి సమర్పించుకున్నారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక సమర్పిత జనాంగం
  • మెప్పుదల సమర్పణకు నడిపిస్తుంది
  • మీ సమర్పణను బహిరంగంగా వెల్లడి చేయండి
  • “ప్రతిదినము” మన సమర్పణకు తగినట్లు జీవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి రెడీనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/1 పేజీలు 9-13

ఎవరికి సమర్పించుకున్నారు?

“యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము.”—నిర్గమకాండము 24:7.

1, 2. (ఎ) కొంతమంది ప్రజలు దేనియందు భక్తి కలిగివున్నారు? (బి) మత సంబంధమైన వాటికే సమర్పణ పరిమితమై ఉందా?

జపాను యాటాబె వైమానిక దళం యొక్క జీరో ఫైటర్‌ పైలట్లు 1945 ఫిబ్రవరిలో ఒక ప్రేక్షకశాలలో (ఆడిటోరియం) సమావేశమయ్యారు. కామికాజె దాడిదళంలో తాను స్వచ్ఛంద సభ్యునిగా ఉంటాడో లేదో అనేది వ్రాయడానికి ప్రతి ఒక్కరికి ఒక చిన్న కాగితం ముక్క ఇవ్వబడింది. ఆ సమయంలో అక్కడున్న ఒక అధికారి ఇలా చెబుతున్నాడు: “జాతీయ సంక్షోభ సమయంలో నన్ను నేను అర్పించుకోడానికి నాకు వచ్చిన ఆహ్వానమని నేను భావించాను. నన్ను నేను లభ్యమయ్యేలా చేసుకోడానికి మానసికంగా ప్రేరేపించబడి, ఆ పని కొరకు నన్ను నేను అర్పించుకున్నాను.” ఓక్కాను (ఒక ఆత్మాహుతి రాకెట్‌ విమానం) ఆపరేట్‌ చేయడానికి, నడిపించడానికి, శత్రువుల యుద్ధనౌకతోపాటు విధ్వంసమయ్యేందుకు అతడు తర్ఫీదు పొందాడు. అయితే, అలా చేసి తన దేశం కొరకు, తన చక్రవర్తి కొరకు మరణించే అవకాశం అతనికి లభించక ముందే యుద్ధం ముగిసింది. జపాను యుద్ధంలో ఓడిపోవడంతో చక్రవర్తి యెడల అతనికున్న విశ్వాసం చెల్లాచెదరై పోయింది.

2 ఒకానొక సమయంలో జపానునందు, సజీవ దైవంగా తాము విశ్వసించే చక్రవర్తి యెడల అనేకులు భక్తి కలిగివుండేవారు. ఇతర దేశాల్లో, ఇతర ఆరాధనా లక్ష్యాలు (ఆబ్జెక్ట్స్‌ ఆఫ్‌ డివోషన్‌) ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. లక్షలాది మంది తరచూ విగ్రహాలచే ప్రాతినిధ్యం వహించబడే మరియ, బుద్ధుడు లేక ఇతర దేవతల యెడల భక్తి కలిగివుంటారు. కష్టపడి సంపాదించిన తమ డబ్బును కొందరు, ఉత్తేజకరమైన వాక్చాతుర్యంచే ప్రభావితమై ఆరాధనకు సమానమైన హృదయపూర్వక మద్దతుతో టి.వి. సువార్తికుల జేబుల్లో పోస్తారు. యుద్ధం తర్వాత, నిరాశ చెందిన జపానీయులు తమ జీవితాలను సమర్పించుకోడానికి మరో క్రొత్త లక్ష్యాన్ని కనుగొన్నారు. కొందరికి పని ఆ లక్ష్యమయ్యింది. తూర్పు దేశాల్లో లేక పశ్చిమ దేశాల్లోనైనా, అనేకులు ధనాన్ని సమకూర్చుకోడానికి తమను తాము సమర్పించుకున్నారు. యౌవనులు సంగీతకారుల చుట్టూ తమ జీవితాలను అల్లుకుని, వారి జీవన విధానాలను అనుకరిస్తారు. నేడు అనేకులు, తమ స్వంత కోరికలను తమ ఆరాధనా లక్ష్యాలుగా చేసుకుంటూ, తమను తాము ఆరాధించుకునే వారయ్యారు. (ఫిలిప్పీయులు 3:19; 2 తిమోతి 3:2) కాని, అలాంటి లక్ష్యాలు లేక ప్రజలు ఒక వ్యక్తి యొక్క పూర్ణాత్మతో కూడిన ఆరాధనను పొందడానికి నిజంగా తగినవా లేక తగినవారా?

3. కొన్ని ఆరాధనా లక్ష్యాలు వ్యర్థమైనవని ఎలా నిరూపించబడ్డాయి?

3 వాస్తవాన్ని ఎదుర్కొన్నప్పుడు, విగ్రహారాధికులు తరచూ నిరుత్సాహపడతారు. తమ విగ్రహాలు “మనుష్యుల చేతిపనులు” మాత్రమేనని ఆరాధికులు తెలుసుకున్నప్పుడు విగ్రహాలకు చేసే ఆరాధన ఆశాభంగానికి కారణమౌతుంది. (కీర్తన 115:4) ప్రముఖ సువార్తికులు ఇమిడివున్న కుంభకోణాలు బయల్పర్చబడినప్పుడు, యథార్థవంతులైన ప్రజలు నిర్వీర్యులౌతారు. “బూటకపు” ఆర్థిక వ్యవస్థ ముగిసాక, పనినుండి తొలగింపబడినవారి జాబితాలో తమను తాము కనుగొన్నప్పుడు కార్మికులు మానసిక అస్వస్థతలను అనుభవించారు. ఇటీవలి క్షీణించిన ఆర్థిక వ్యవస్థలు ధనారాధికులకు తీవ్రమైన దెబ్బను కలిగించాయి. ఎక్కువ సొమ్ము చేసుకోవాలనే ఆశతో చేయబడిన అప్పులు, తిరిగి కట్టే ఉత్తరాపేక్ష లేక భారంగా తయారయ్యాయి. (మత్తయి 6:24, (NW) అథఃస్సూచి) దైవసమానంగా ఆరాధింపబడుతున్న రాక్‌ తారలు, వినోదాన్నందించే ఇతరులు మరణించినప్పుడు లేక వారి పేరుప్రతిష్ఠలు తగ్గిపోయినప్పుడు, వారి ఆరాధికులు విడిచిపెట్టబడినట్టు భావిస్తారు. స్వయం సంతృప్తి జీవన విధానాన్ని అవలంభించిన వారందరు తరచూ చేదు ఫలితాలను పొందుతారు.—గలతీయులు 6:7.

4. వ్యర్థమైన వాటికి తమ జీవితాలను సమర్పించుకోడానికి ప్రజలను ఏది ప్రేరేపిస్తుంది?

4 అలాంటి వ్యర్థతకు తమను తాము సమర్పించుకోడానికి ప్రజలను ఏది ప్రేరేపిస్తుంది? చాలా వరకు అది, అపవాదియగు సాతాను క్రిందనున్న లోకాత్మ. (ఎఫెసీయులు 2:2, 3) ఈ ఆత్మ ప్రభావాన్ని వివిధ మార్గాలలో చూడవచ్చు. తన పూర్వీకుల నుండి సంక్రమించిన కుటుంబ సాంప్రదాయంచే ఒక వ్యక్తి అదుపు చేయబడవచ్చు. విద్య మరియు పెంచబడిన విధానం ఆలోచనా సరళిపై బలమైన ప్రభావాన్ని చూపగలవు. పనిచేసే స్థలమందలి వాతావరణం “సంఘటిత యోధులను” జీవానికి ప్రమాదం కలిగించే పని-నిమగ్నతలో పడవేయగలదు. లోకం యొక్క వస్తుదాయక దృక్పథం, ఇంకా కావాలనే కోరికకు కారణం కాగలదు. తమ స్వంత స్వార్థపూరిత కోరికల కొరకు తమను తాము సమర్పించుకొనేందుకు పురికొల్పుతూ, అనేకుల హృదయాలు కలుషితం చేయబడ్డాయి. ఈ ప్రయాసలు అలాంటి ఆరాధనను పొందడానికి అర్హమైనవేనా అని పరీక్షించుకోవడంలో వారు విఫలమౌతారు.

ఒక సమర్పిత జనాంగం

5. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం యెహోవాకు ఏ సమర్పణ చేసుకోవడం జరిగింది?

5 దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, ఒక జనాంగం ఆరాధన కొరకు ఎంతో శ్రేష్ఠమైన ఒక లక్ష్యాన్ని కనుగొన్నారు. వాళ్లు సర్వోన్నత దేవుడైన యెహోవాకు తమను తాము సమర్పించుకున్నారు. ఒక గుంపుగా, ఇశ్రాయేలు జనాంగం సీనాయి అరణ్యంలో దేవునికి తమ సమర్పణను తెలియజేసుకున్నారు.

6. ఇశ్రాయేలీయులకు దేవుని నామ ప్రాముఖ్యత ఏమైయుండ వలసి ఉండెను?

6 ఈ విధంగా చేయడానికి ఇశ్రాయేలీయులను ఏది ప్రేరేపించింది? వారు ఐగుప్తునందు బానిసత్వం క్రింద ఉన్నప్పుడు, వారిని స్వతంత్రులను చేసేందుకు నడిపింపునిచ్చే బాధ్యతను యెహోవా మోషేకు అప్పగించాడు. తనను పంపిన దేవున్ని ఎలా వర్ణించాలని మోషే అడిగినప్పుడు, దేవుడు తనను తాను ఇలా బయల్పర్చుకున్నాడు: “నేను ఉన్నవాడను అను వాడనై” యున్నాను. “ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని” ఇశ్రాయేలీయులకు చెప్పమని ఆయన మోషేకు తెలియజేశాడు. (నిర్గమకాండము 3:13, 14) యెహోవా తన సంకల్పాలను నెరవేర్చడానికి అనుగుణ్యంగా అవసరమైనట్టు మారతాడని ఈ పదం సూచించింది. ఇశ్రాయేలీయుల పూర్వీకులకు తెలియని రీతిలో ఆయన తనను తాను, వాగ్దానాలను నెరవేర్చేవానిగా బయల్పర్చుకుంటాడు.—నిర్గమకాండము 6:2, 3.

7, 8. యెహోవా తమ సమర్పణకు తగిన దేవుడనడానికి ఇశ్రాయేలీయులకు ఏ సాక్ష్యాధారాలున్నాయి?

7 ఐగుప్తు మరియు దాని ప్రజలు పది తెగుళ్ల చేత వేదన ననుభవించడాన్ని ఇశ్రాయేలీయులు చూశారు. (కీర్తన 78:44-51) తర్వాత, స్త్రీలు పిల్లలతో సహా మూడుకోట్ల కంటే ఎక్కువమంది గోషేను దేశం నుండి ఒక్క రాత్రిలోనే అన్నీ సర్దుకుని ప్రయాణమై బయలుదేరారు, అది దానంతటదే ఒక విశేషమైన కార్యం. (నిర్గమకాండము 12:37, 38) తర్వాత, ఎర్ర సముద్రం వద్ద, ఇశ్రాయేలీయులు వెళ్లడానికి సముద్రాన్ని పాయలుగా చీల్చి, వెంట తరుముతున్న ఐగుప్తీయులు మునిగిపోయేలా చేయడానికి మరల వాటిని దగ్గరికి చేర్చడం ద్వారా ఫరో సైనిక శక్తుల నుండి తన ప్రజలను కాపాడినప్పుడు యెహోవా తనను తాను “యుద్ధశూరునిగా” తెలియజేసుకున్నాడు. ఫలితంగా, “యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు . . . నమ్మకముంచిరి.”—నిర్గమకాండము 14:31; 15:3; కీర్తన 136:10-15.

8 దేవుని నామ భావమేమిటో ఇంకా ఎరుగనివారిలా ఇశ్రాయేలీయులు ఆహారం మరియు నీటి కొరతల గురించి యెహోవాకు, ఆయన ప్రతినిధియైన మోషేకు వ్యతిరేకంగా సణిగారు. యెహోవా పూరేడులు పంపించాడు, మన్నా కురిపించాడు, మెరీబా వద్ద కొండ నుండి నీళ్లు ఉబికేలా చేశాడు. (నిర్గమకాండము 16:2-5, 12-15, 31; 17:2-7) అమాలేకీయుల దాడి నుండి కూడా యెహోవా ఇశ్రాయేలీయులను కాపాడాడు. (నిర్గమకాండము 17:8-13) “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును” అని యెహోవా మోషేకు ప్రకటించినదాన్ని ఇశ్రాయేలీయులు ఏ విధంగాను నిరసించలేరు. (నిర్గమకాండము 34:6, 7) వాస్తవానికి, వారి ఆరాధనకు తగిన లక్ష్యంగా యెహోవా తనను తాను నిరూపించుకున్నాడు.

9. యెహోవాను సేవిస్తామనే తమ సమర్పణను వ్యక్తపర్చుకునే అవకాశాన్ని ఆయన ఇశ్రాయేలీయులకు ఎందుకిచ్చాడు, వారు దానికెలా ప్రతిస్పందించారు?

9 యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాడు గనుక వారిని స్వంతం చేసుకునే హక్కు ఆయనకు ఉన్నప్పటికీ, ఆయన, దయా కనికరములు గల దేవునిగా, తనను సేవించాలనే కోరికను వ్యక్తపర్చే అవకాశాన్ని వారికి స్వచ్ఛందంగా ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 7:7, 8; 30:15-20) ఇశ్రాయేలీయులకు, తనకు మధ్య నుండే నిబంధన కొరకు ఆయన కట్టడలను కూడా తెలియజేశాడు. (నిర్గమకాండము 19:3-8; 20:1–23:33) ఈ కట్టడలను మోషే వివరించినప్పుడు, ఇశ్రాయేలీయులు ఇలా ప్రకటించారు: “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము.” (నిర్గమకాండము 24:3-7) తమ స్వంత నిర్ణయం చొప్పున, వారు సర్వోన్నత ప్రభువగు యెహోవాకు సమర్పిత జనాంగమయ్యారు.

మెప్పుదల సమర్పణకు నడిపిస్తుంది

10. యెహోవాకు మన సమర్పణ దేనిపై ఆధారపడినదై ఉండాలి?

10 సృష్టికర్తయైన యెహోవా మన పూర్ణాత్మతో కూడిన భక్తిని పొందడానికి అర్హుడే. (మలాకీ 3:6; మత్తయి 22:37; ప్రకటన 4:11) అయితే, మన సమర్పణ అవిశ్వాసం, క్షణికమైన భావోద్వేగాలు, లేక ఇతరుల నుండి, చివరికి తల్లిదండ్రుల నుండి వచ్చే ఒత్తిడి వంటి వాటిపై ఆధారపడినదై ఉండకూడదు. అది, యెహోవాను గూర్చిన సత్యం యొక్క కచ్చితమైన జ్ఞానంపై మరియు యెహోవా మన కొరకు చేసిన వాటియెడల మెప్పుదలపై ఆధారపడినదై ఉండాలి. (రోమీయులు 10:2; కొలొస్సయులు 1:9, 10; 1 తిమోతి 2:4) తమ సమర్పణను వ్యక్తపర్చుకొనే అవకాశాన్ని యెహోవా ఇశ్రాయేలీయులకు స్వచ్ఛందంగా ఎలా ఇచ్చాడో అలాగే, మనం కూడా మనల్ని మనం సమర్పించుకొని, ఆ సమర్పణను బహిరంగంగా తెలియజేసుకొనే అవకాశాన్ని ఆయన స్వచ్ఛందంగా మనకిస్తాడు.—1 పేతురు 3:21.

11. మన బైబిలు పఠనం యెహోవా గురించి ఏమి తెలియపర్చింది?

11 బైబిలును పఠించడం ద్వారా, మనం దేవున్ని వ్యక్తిగా తెలుసుకోగలుగుతాము. సృష్టిలో ప్రతిబింబింపబడినట్లుగా ఆయన లక్షణాలను తెలుసుకోడానికి ఆయన వాక్యం మనకు సహాయం చేస్తుంది. (కీర్తన 19:1-4) ఆయన అర్థం చేసుకొనబడలేని మర్మమైన త్రిత్వం కాదని మనం ఆయన వాక్యం ద్వారా గ్రహించగలము. ఆయన యుద్ధాలలో ఓడిపోడు, గనుక ఆయన తన దైవత్వాన్ని కోల్పోనవసరం లేదు. (నిర్గమకాండము 15:11; 1 కొరింథీయులు 8:5, 6; ప్రకటన 11:17, 18) ఆయన తన వాగ్దానాలను నెరవేర్చాడు గనుక, యెహోవా అనే ఆయన సుందరమైన నామం దేనికి చిహ్నమో మనకు జ్ఞాపకం చేయబడింది. ఆయన గొప్ప సంకల్పం గలవాడు. (ఆదికాండము 2:4, (NW) అథఃస్సూచి; కీర్తన 83:18; యెషయా 46:9-11) బైబిలును పఠించడం ద్వారా, ఆయన ఎంత యథార్థవంతుడో, ఎంత నమ్ముకొనదగిన వాడో మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాము.—ద్వితీయోపదేశకాండము 7:9; కీర్తన 19:7, 9; 111:7.

12. (ఎ) ఏది మనల్ని యెహోవావైపు ఆకర్షిస్తుంది? (బి) బైబిలునందు వ్రాయబడివున్న నిజజీవిత అనుభవాలు యెహోవాను సేవించాలనే కోరిక కలిగేలా ఒకరినెలా కదిలిస్తాయి? (సి) యెహోవాను సేవించడాన్ని గూర్చి మీరెలా భావిస్తారు?

12 ప్రాముఖ్యంగా యెహోవా యొద్దకు మనల్ని ఆకర్షించేదేమిటంటే, ఆయన ప్రేమపూర్వకమైన వ్యక్తిత్వం. మానవులతో వ్యవహరించడంలో ఆయన ఎంత ప్రేమ, క్షమ, దయ కలిగివుంటాడో బైబిలు చూపిస్తుంది. యోబు తన యథార్థతను నమ్మకంగా కాపాడుకున్న తర్వాత ఆయన యోబును ఎలా ఆశీర్వదించాడనే దాన్ని గూర్చి ఆలోచించండి. “యెహోవా ఎంతో దయ కనికరము గలవాడని” యోబు అనుభవం ఉన్నతపరుస్తుంది. (యాకోబు 5:11, (NW); యోబు 42:12-16) దావీదు వ్యభిచారం మరియు హత్య చేసినప్పుడు యెహోవా అతనితో ఎలా వ్యవహరించాడనే దాన్ని గూర్చి తలంచండి. అవును, పాపం చేసిన వ్యక్తి “విరిగి నలిగిన హృదయము”తో యెహోవాను సమీపించినప్పుడు గంభీరమైన పాపాలను కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. (కీర్తన 51:3-11, 17) మునుపు దేవుని ప్రజలను హింసించడానికి నిశ్చయించుకున్న తార్సువాడైన సౌలుతో యెహోవా వ్యవహరించిన విధానాన్ని గూర్చి తలంచండి. ఈ ఉదాహరణలు దేవుని దయను, పశ్చాత్తాపపడిన వారిని ఉపయోగించుకోవడంలో ఆయన ఉదారమైన సుముఖతను ఉన్నత పరుస్తాయి. (1 కొరింథీయులు 15:9; 1 తిమోతి 1:15, 16) ఈ ప్రేమగల దేవున్ని సేవించడంలో తాను తన జీవితాన్ని కూడా పణంగా పెట్టగలనని పౌలు భావించాడు. (రోమీయులు 14:8) మీరు కూడా అలాగే భావిస్తారా?

13. యెహోవా వైపునుండి ప్రేమను గూర్చిన ఏ గొప్ప వ్యక్తీకరణ యథార్థహృదయులు తమ్మును తాము యెహోవాకు సమర్పించుకొనేందుకు పురికొల్పుతుంది?

13 యెహోవా ఇశ్రాయేలీయులకు ఐగుప్తు బానిసత్వం నుండి రక్షణ కలిగించాడు, యేసుక్రీస్తు విమోచనా క్రయధనం ద్వారా పాపమరణాల బానిసత్వం నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పర్చాడు. (యోహాను 3:16) పౌలు ఇలా చెబుతున్నాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:8) యథార్థహృదయులు యేసుక్రీస్తు ద్వారా యెహోవాకు తమను తాము సమర్పించుకొనేందుకు ఈ ప్రేమపూర్వక ఏర్పాటు పురికొల్పుతుంది. “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.”—2 కొరింథీయులు 5:14, 15; రోమీయులు 8:35-39.

14. యెహోవా వ్యవహారాలను గూర్చిన జ్ఞానం మాత్రమే మనం మన జీవితాలను ఆయనకు సమర్పించుకొనేలా పురికొల్పడానికి సరిపోతుందా? వివరించండి.

14 అయినప్పటికీ, యెహోవా వ్యక్తిత్వాన్ని గూర్చిన జ్ఞానం మరియు మానవజాతితో ఆయన వ్యవహారాలను గూర్చిన జ్ఞానం కలిగివుండడం మాత్రమే సరిపోదు. యెహోవా యెడల వ్యక్తిగత మెప్పుదలను పెంపొందింపజేసుకోవాలి. దాన్నెలా చేయవచ్చు? దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా, దానిలో కనుగొనబడే సూత్రాలు నిజంగా పనిచేస్తాయని గుణగ్రహించడం ద్వారా మనమది చేయవచ్చు. (యెషయా 48:17) సాతాను పరిపాలన క్రిందనున్న ఈ దుష్ట లోకం యొక్క ఊబిలో నుండి యెహోవా మనల్ని రక్షించాడని మనం భావించాలి. (1 కొరింథీయులు 6:11 పోల్చండి.) సరైనది చేయాలనే మన పోరాటంలో, మనం యెహోవాపై ఆధారపడడానికి నేర్చుకుంటాము, యెహోవా సజీవుడైన దేవుడని, “ప్రార్థన ఆలకించు” వాడని మనంతట మనం అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాము. (కీర్తన 62:8; 65:2) త్వరలోనే మనం ఆయనకు ఎంతో సన్నిహితమైనట్లుగా భావిస్తూ, మన అంతరంగ భావాలను ఆయనకు చెప్పుకోగలుగుతాము. యెహోవా యెడల ప్రేమపూర్వక భావం మనలో పెంపొందుతుంది. నిస్సందేహంగా అది మనం మన జీవితాలను ఆయనకు సమర్పించుకోడానికి మనల్ని నడిపిస్తుంది.

15. గతంలో పనికి సమర్పించుకున్న ఒక వ్యక్తి, యెహోవాను సేవించడానికి ఏది అతన్ని పురికొల్పింది?

15 అనేకులు ఈ ప్రేమగల దేవుడైన యెహోవాను తెలుసుకుని, ఆయనను సేవించడానికి తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఉదాహరణకు, వృద్ధి చెందుతున్న వ్యాపారమున్న ఒక ఎలక్ట్రిషియన్‌ను పరిశీలించండి. ఆయన ఉదయం పని ప్రారంభించి, దినమంతా పనిచేసి, రాత్రంతా పనిచేసి, మర్నాటి ఉదయం ఐదు గంటలకు ఇంటికి తిరిగివచ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఒక గంటసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన మరో పనిమీద వెళ్లిపోయేవాడు. “నేను నా పనికి సమర్పించుకున్నాను” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన భార్య బైబిలు పఠనం చేయడం ప్రారంభించినప్పుడు, ఆయన కూడా ఆమెతో కలిసి పఠించాడు. ఆయనిలా చెబుతాడు: “నాకు అంతవరకు తెలిసిన దేవుళ్లందరూ మనకు ప్రయోజనకరమైనదేది చేయకుండా కేవలం సేవింపబడాలని ఎదురు చూస్తున్న వాళ్లే. కాని యెహోవా మాత్రం చొరవ తీసుకుని, గొప్ప వ్యక్తిగత త్యాగంచేసి తన ఏకైక కుమారున్ని భూమిపైకి పంపించాడు.” (1 యోహాను 4:10, 19) పది నెలలలోనే, ఈ వ్యక్తి యెహోవాకు సమర్పించుకున్నాడు. దాని తర్వాత, ఆయన జీవంగల దేవున్ని సేవించడంపై కేంద్రీకరించాడు. ఆయన పూర్తికాల పరిచర్యను చేపట్టి, అవసరత ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడికి వెళ్లాడు. అతడు అపొస్తలులవలె, ‘సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు.’ (మత్తయి 19:27) రెండు నెలల తర్వాత, వారు నివసిస్తున్న దేశంలోని వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ బ్రాంచినందు విద్యుత్‌ పనిలో సహాయం చేయడానికి ఆయన, ఆయన భార్య ఆహ్వానింపబడ్డారు. బ్రాంచినందు, ఇరవై సంవత్సరాలపైగా తాను ప్రేమించే పనిని తన కొరకు కాదుగాని, యెహోవా కొరకు ఆయన చేస్తున్నాడు.

మీ సమర్పణను బహిరంగంగా వెల్లడి చేయండి

16. యెహోవాకు సమర్పించుకునే విషయంలో ఒకరు తీసుకోవలసిన కొన్ని చర్యలేమిటి?

16 కొంతకాలం బైబిలు పఠించిన తర్వాత, పెద్దలు పిన్నలు ఒకేలా యెహోవాను, ఆయన వారి కొరకు చేసినదాన్ని మెచ్చుకుంటారు. దేవునికి తమ్మును తాము సమర్పించుకోడానికి ఇది వారిని కదిలించాలి. మీరు వీరిలో ఒకరై ఉండవచ్చు. యెహోవాకు మిమ్మల్ని మీరెలా సమర్పించుకోవచ్చు? బైబిలు నుండి కచ్చితమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఆ జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, మీరు యెహోవా యందు యేసుక్రీస్తు యందు విశ్వాసముంచాలి. (యోహాను 17:3) మునుపటి పాపపు విధానం నుండి మరలి, పశ్చాత్తాప పడండి. (అపొస్తలుల కార్యములు 3:20) అప్పుడు మీరు దాన్ని గంభీరమైన మాటల్లో యెహోవాకు ప్రార్థనయందు తెలియజేస్తూ, సమర్పించుకునే స్థాయికి వస్తారు. యెహోవాతో ఒక క్రొత్త సంబంధానికది ప్రారంభం గనుక, ఈ ప్రార్థన మీ మనస్సుపై నిస్సందేహంగా చెరగని ముద్ర వేస్తుంది.

17. (ఎ) క్రొత్తగా సమర్పించుకున్నవారితో పెద్దలు, ముందుగా సిద్ధంచేయబడిన ప్రశ్నలను ఎందుకు పునఃసమీక్షిస్తారు? (బి) ఒకరి సమర్పణ తర్వాత, వెంటనే ఏ ప్రాముఖ్యమైన చర్య గైకొనాలి, ఏ సంకల్పంతో?

17 యెహోవాతో నిబంధనా సంబంధంలోకి ప్రవేశించేందుకు మోషే ఇశ్రాయేలీయులకు కట్టడలను వివరించినట్లుగానే, యెహోవాసాక్షుల సంఘ పెద్దలు ఇటీవలనే సమర్పించుకున్న వారికి అందులో కచ్చితంగా ఏమి ఇమిడి ఉందో పరీక్షించడానికి సహాయం చేస్తారు. ప్రాథమిక బైబిలు బోధలను ప్రతి ఒక్కరు పూర్తిగా అర్థం చేసుకొన్నారని ధృవపర్చడానికి, యెహోవాకు సాక్షియై ఉండడంలో ఏమి ఇమిడి ఉందో తెలియజేయడానికి, వారు సిద్ధం చేయబడిన ప్రశ్నలను ఉపయోగిస్తారు. తర్వాత, సమర్పణను బహిరంగంగా వెల్లడి చేయడానికి ఒక వేడుక ఉండడం ఎంతో తగినది. సహజంగా, క్రొత్తగా సమర్పించుకున్న వ్యక్తి తాను యెహోవాతో ఈ ఆధిక్యతా సంబంధంలోకి ప్రవేశించానని ఇతరులు తెలుసుకోవాలని ఆతురత కలిగివుంటాడు. (యిర్మీయా 9:24 పోల్చండి.) సమర్పణకు సూచనగా నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఇది సరైన విధంగా చేయబడుతుంది. నీటిలో ముంచబడి, తిరిగి లేపబడడం అతడు తన మునుపటి స్వయంతృప్తి జీవన విధానం విషయంలో మరణించి, దేవుని చిత్తం చేయడమనే క్రొత్త జీవిత విధానానికి లేపబడతాడని సూచిస్తుంది. అది ఒక ఆచారం కాదు, లేక ఒక వ్యక్తి నీటి ద్వారా శుభ్రం చేయబడతాడని ఆచరించే షింటో ఆచారమైన మిసోగి వంటి మతాచారం కాదు.a బదులుగా, ప్రార్థనలో అప్పటికే చేయబడిన సమర్పణను బహిరంగంగా వ్యక్తపర్చడమే బాప్తిస్మం.

18. మన సమర్పణ వ్యర్థం కాదని మనం ఎందుకు నమ్మకం కల్గివుండవచ్చు?

18 యెహోవాతో ఇప్పుడు తాను కలిగివున్న నిత్య సంబంధాన్ని దేవుని క్రొత్త సేవకునికి గుర్తుచేసే ఈ గంభీరమైన సందర్భం ఒక మరచిపోలేని అనుభవం. కామికాజి పైలట్‌ తన దేశం కొరకు, చక్రవర్తి కొరకు చేసుకున్న సమర్పణలా, యెహోవాకు చేసుకున్న ఈ సమర్పణ వ్యర్థమైంది కాదు, ఎందుకంటే ఆయన తాను అనుకున్నది సాధించే నిత్యుడగు సర్వోన్నత దేవుడు. ఆయన, ఆయన మాత్రమే, మన పూర్ణాత్మతో కూడిన ఆరాధనను పొందడానికి అర్హుడు.—యెషయా 55:9-11.

19. తరువాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?

19 అయితే, సమర్పణలో మరెంతో ఇమిడి ఉంది. ఉదాహరణకు, సమర్పణ మన ప్రతిదిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది తరువాతి శీర్షికలో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ ప్రచురించిన దేవుని కొరకు మానవజాతి అన్వేషణ (ఆంగ్లం)నందలి 194-5 పేజీలను చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ లోకంలో జరిగే సమర్పణ ఎందుకు ఆశాభంగంతో ముగిసింది?

◻ తమను తాము యెహోవాకు సమర్పించుకోడానికి ఇశ్రాయేలీయులను ఏది కదిలించింది?

◻ నేడు యెహోవాకు మనల్ని మనం సమర్పించుకోడానికి ఏది మనల్ని ప్రేరేపిస్తుంది?

◻ దేవునికి మనల్ని మనం ఎలా సమర్పించుకుంటాము?

◻ నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

[10వ పేజీలోని చిత్రం]

సీనాయినొద్ద ఇశ్రాయేలీయులు యెహోవాకు తమను తాము సమర్పించుకున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి