కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 3/1 పేజీ 7
  • వాళ్ళెందుకలా చేస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్ళెందుకలా చేస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దైవిక జీవిత మార్గము” 1998 యెహోవాసాక్షుల జిల్లాసమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1998
  • 1999 “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1999
  • సమావేశాలు—మన సౌభ్రాతృత్వాన్ని ధ్రువీకరించే ఆనందభరిత సందర్భాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • 1990వ సంవత్సరపు “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు రండి
    మన రాజ్య పరిచర్య—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 3/1 పేజీ 7

వాళ్ళెందుకలా చేస్తారు?

ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా, వేలాది మంది యెహోవాసాక్షులు సమావేశాలకు సమకూడుతారు. అక్కడ వాళ్ళు సహవాసాన్ని ఆస్వాదిస్తారు. బైబిలు నిర్దేశాలను గూర్చిన శ్రేష్ఠమైన కార్యక్రమాన్ని వింటారు. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు కొందరు గొప్ప ప్రయత్నాలను చేస్తారు. ఉదాహరణకు, గత సంవత్సరం, మలావీలోని తమ 60వ పడి మధ్యభాగంలో ఉన్న దంపతులిరువురూ, వారితోపాటు, వాళ్ల కొడుకూ, కోడలూ, వాళ్ళ బిడ్డా సమావేశానికి హాజరయ్యేందుకు 80 కిలో మీటర్లు సైకిళ్ళ మీద ప్రయాణం చేశారు. వాళ్ళు ఉదయం ఆరు గంటలకు తమ గ్రామం నుండి బయలుదేరి 15 గంటల తర్వాత సమావేశ స్థలానికి చేరుకున్నారు.

మొజాంబిక్‌లోని ఒక గుంపు సమావేశానికి చేరుకునేందుకు సైకిళ్ళ మీద మూడు రోజులు ప్రయాణం చేసింది. ఒక రాత్రి, వాళ్ళు ఒక బహిరంగస్థలంలో విడిది చేస్తుండగా, సమీపంలో ఉన్న సింహాల గర్జనలను విన్నారు. పొయ్యిలో వాడే కర్రలను వాళ్ళు ఆ మృగాలవైపు విసిరారు గానీ, ఆ సింహాలు తెల్లవారే వరకు ఆ చుట్టుప్రక్కలే ఉండిపోయాయి. ఆ సమావేశం కోసమే ప్రయాణం చేస్తున్న మరో సాక్షికి రోడ్డు మీద సింహం ఎదురయ్యింది. ఆ సింహం అక్కడి నుండి వెళ్ళిపోయేంత వరకు, ఆయన అక్కడే నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలబడ్డాడు. ఈ సాక్షులు సమావేశ స్థలానికి చేరుకున్నాక తాము “సింహము నోటనుండి” ఎలా “తప్పింప”బడ్డారో ఆనందంగా చెప్పారు.—2 తిమోతి 4:17.

చాలా మంది యెహోవాసాక్షులు ఆరాధించేందుకుగాను సమావేశాలకు లేదా వారపు సంఘ కూటాలకు కూడా హాజరయ్యేందుకు గొప్ప ప్రయత్నాలనే చేస్తారు. ఎందుకని? సమాజముగా కూడుకోవడం ఎందుకంత ప్రాముఖ్యమో తెలుసుకునేందుకు తరువాతి శీర్షికలు సహాయపడతాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి