1990వ సంవత్సరపు “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు రండి
1 1990 సంవత్సరపు జిల్లా సమావేశములు “స్వచ్ఛమైన భాష” అను ముఖ్యాంశమును కలిగియుండును. వాటికి మీరు ఆహ్వానింపబడుచున్నారు. ఇండియాలో 26 సమావేశములు ఏర్పరచబడియున్నవి. అవి సెప్టెంబరు 27న మొదలై 1991 జనవరి 6 వరకు జరుగుచుండును. ఆ పట్టణముల పేర్లు భాషలు, మరియు తారీఖులు మార్చి 1, 1990నాటి మా సర్క్యులర్ లెటర్లో అందించబడియున్నవి.
2 జెఫన్యా 3:9 NWలో యెహోవా ప్రవచన వాక్యము యిలా చెప్పుచున్నది: “అప్పుడు జనులందరు యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి స్వచ్ఛమైన భాషనిచ్చెదను.” ఈ సంవత్సరపు సమావేశము “స్వచ్ఛమైన భాష”యేమైయున్నదో గుర్తించుటయేగాక దానిని నేర్చుకొనుట మరియు ధారాళముగా మాట్లాడుట ఎందుకు చాలా ప్రాముఖ్యమో, దానిని ఉపయోగించగల శక్తి మన ప్రపంచవ్యాప్త సహోదరత్వపు ఐక్యతను ఎట్లు బలపరచునో గుణగ్రహించుటకు సహాయము చేయును.
3 ముందుగా రమ్ము: యెహోవా సంస్థ ఆయన ఆత్మీయ బల్లయొద్ద భుజించుటకు మనలనాహ్వానించుచున్నది. సరైన సమయమునకు వచ్చుట గౌరవము మరియు మెప్పును సూచనయైయున్నది. అనగా ప్రతిదినము కార్యక్రమము ప్రారంభము కాకముందే ముందుగా వచ్చి తమ సీట్లలో కూర్చొనుటయని దీని భావము. ఇందుకు వాహనములను నిలుపుట, కుటుంబమునకు తగిన సీట్లను కనుగొనుట మొదలగు అవధానమివ్వవలసిన విషయములకై చాలనంత సమయమును కలిగియుండునట్లు చూచుకొనుట అవసరము.—1 కొరిం. 14:40.
4 గత సంవత్సరము పోలెండ్ సమావేశమునకు వచ్చినవారు వారి సహోదరుల దైవభక్తి, ప్రేమ, ఐక్యతలను చూచి ముగ్ధులైరి. సమావేశము తెచ్చు ఆత్మీయ ఏర్పాటుల యెడల లోతైన గుణగ్రహణ స్పష్టమైనది. సహోదరులు ప్రతి ఉదయము సమావేశ స్థలమునకు ముందుగా వచ్చి కూర్చొని ప్రారంభ పాట మరియు ప్రార్థనకు సిద్ధముగాయున్నారు. ముగింపు పాట మరియు ప్రార్థన వరకు యుండి కార్యక్రమము అయిపోయిన తరువాతను తమ సహోదరులతో కలియుటకు వేచియుండిరి.
5 సహోదరుల క్రమము మాదిరికరముగా యున్నది. వారు వినుటకు నేర్చుకొనుటకు వచ్చియున్నారు. పొజ్నాన్ మరియు కొర్జొ ఓపెన్ స్టేడియంలలో కురుస్తున్న వర్షము సహితము వారి అవధానమును కార్యక్రమమునుండి మరల్చలేక పోయినది. పసిపిల్లలతో సహా హాజరైన పిల్లలు మంచి క్రమశిక్షణ, నెమ్మదితో, కార్యక్రమమును శ్రద్ధతో వినుచుండిరి. కుటుంబములు కలసి కూర్చొన్నవి. యెహోవా బల్లయెడల మిక్కుటమైన గౌరవము చూపు విషయములో మాదిరికరముగా యున్నారు. వారి మాదిరినుండి మనమెట్లు ప్రయోజనము పొందగలము?
6 ఇతరులయొక్క మంచి మాదిరిననుసరించుట లేఖనానుసారమైనది. (2 థెస్స. 3:7) మన వ్యక్తిగత పరిస్థితులు భిన్నముగా యున్నను, మన సమావేశములనుండి మనమును ఎక్కువను పొందగోరుదుము. అసెంబ్లీ స్థలమునకు ఆలస్యముగా బయలుదేరుట వలన కలుగు చికాకు, చింతను తొలగించుకొనుటకు కొన్ని కుటుంబములు తగినంత సమయమును విశ్రాంతికై గడుపుటను ప్రయోజనకరముగా కనుగొనినవి. ఖచ్చితముగా కార్యనిర్ణయ పట్టికకు హత్తుకొనియుండుటవలన రాత్రి మంచి నిద్రను పొంది మరుసటి దినమున పెందలకడనే బయలుదేరుటకు సిద్ధముగా యుందురు. ఇది కార్యక్రమము జరుగునప్పుడు వచ్చి అప్పటికే కూర్చొన్నవారి అవధానమును మరల్చి, చికాకు కలిగించుటను లేకుండా చేయును. ఈ విషయములో మన మంచి యోచన యెహోవా యెడలగల మన గౌరవమును, ఘనతను సహోదరుల యెడలగల ప్రేమ మరియు శ్రద్ధను ప్రతిబింబించును.
7 నాలుగు దినముల సమావేశము: “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశము నాలుగు దినములుండును. గురువారము మధ్యాహ్నము 1:30 గం.లకు ప్రారంభమై గురువారము, శుక్రవారము మరియు శనివారము దాదాపు సాయంకాలము 5:10 గం.లకు, ఆదివారము వరకు, కార్యక్రమము ఉదయం 9 గం.లకు ప్రారంభమగును. ప్రతిదినము స్వచ్ఛమైన భాషను మాట్లాడుటకు సంబంధించిన ప్రాముఖ్యమగు సమాచారముతో నిండియుండును. అందు ప్రసంగములు, ప్రదర్శనలు, అనుభవములు, సింపోజియంలు, రెండు బైబిలు డ్రామాలు యుండును.
8 కార్యక్రమపు ఒక్క భాగమును కూడా తప్పిపోకుండుటను మీ నిర్ణయముగా చేసికొనుము. దీనికి మీ కార్యనిర్ణయ పట్టికలో త్యాగములు మరియు సవరణలు అవసరము కావచ్చును. కొందరు తమ యజమానితో ప్రత్యేక ఏర్పాటులు చేసికొనుట అవసరముగా కనుగొనవచ్చును. అన్ని భాగములకు హాజరగుటకై కొందరు ఆర్థికపరమైన అవకాశములను కూడా వదలివేయవచ్చును. ఏమైనను గత సంవత్సరము పోలెండ్‌లో సమావేశమునకు హాజరగుటకు మన సహోదరులు ఏమేమిటిని త్యాగము చేసి వేటిని దాటి రావలసియుండెనో ఆలోచించుడి. దానినిబట్టి ఏమైనను మీ సమావేశపు అన్ని భాగములకు హాజరుకావలెనని అది నిన్ను పురికొల్పదా? ఆ విషయమును తమ యథార్థమైన ప్రార్థనా అంశముగా చేసి హాజరగుటకు హృదయపూర్వక ప్రయత్నము చేయువారిని యెహోవా ఆశీర్వదించును.—హెబ్రీ. 10:24, 25.
9 పశ్చిమ మధ్య ప్రాంతమునుండి వచ్చిన ఒక కుటుంబము సమావేశమునకు హాజరైన తరువాత వ్యక్తపరచిన సంతోషమును గమనించుము. వారు యిలా చెప్పిరి: “అది మేమందరము మెచ్చుకొనిన అద్భుతకర ఉపదేశ కార్యక్రమము. మా హృదయములను తాకిన ఒక ఉన్నతమైన అంశమేమనగా మీరు క్రొత్త సాహిత్యములను విడుదల చేసిన పద్ధతి. ఎన్నో సంవత్సములనుండి మేము సహవసించిన ఏ సమావేశము కంటెను ఎక్కువగా యిచ్చుటకు నేను నా భార్య “నిజముగా తెరబడితిమి.” మేమొక్కరమే కాదు. సాధారణమైన దానికన్నా ఎక్కువగా చేయుటకు మమ్మును పురికొల్పుటకు క్రొత్త ఏర్పాటులో కొంతయున్నది. అయినను యెహోవా మనకు చేసిన దానికంతటికిని చేయుచున్నదానికిని మనలో ఎవరమును ఆయనకు చాలినంత యివ్వలేము.
10 శ్రద్ధతో వినుము: కీర్తన 50:7లో “నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి,” అని యెహోవా చెప్పుచున్నాడు. కావున సమావేశ కార్యక్రమము జరుగునప్పుడు ప్లాట్‌ఫారమ్ నుండి వచ్చు సమాచారమునకు సంబంధించని దృశ్యములు, శబ్దములవలన మళ్లించబడకుము. స్వచ్ఛమైన భాషను ధారాళముగా మాట్లాడవలెనను మన కోరిక యెషయా 55:2లో “నా మాట జాగ్రత్తగా ఆలకించుడి” అని యెహోవా కోరుదానికి కట్టుబడుటకు మనలను ప్రేరేపింపవలెను.
11 ఈ సమావేశములో అందించబడనైయున్న సమాచారమంతయు మన ఆత్మీయ క్షేమముకొరకై యెహోవాసేవలోను మన సహోదరులతో ఐక్యతయందును స్థిరముగా నిలబడు మన తీర్మానమును బలపరచుకొనుటకు పనిచేయును. ఈ సమావేశము సరిక్రొత్త అవసరములకు తగినట్లుగా మనలను తీర్చిదిద్ది యెహోవా సంస్థతో కలసి వెళ్లునట్లుగా మనకు సహాయము చేయును. అవధానమివ్వకుండుట మనలను వెనుకబడునట్లు చేయును. దానినుండి పూర్తి ప్రయోజనము పొంది ఆ తదుపరి నేర్చుకొనిన దానిననుసరించుటకు కార్యక్రమములో మనము పూర్తిగా నిమఘ్నమై యుండవలసియున్నాము.—యాకో. 1:25.
12 సమాచారము యెడల మంచి అవధానమును నిలిపి అందించబడిన సమాచారమును జ్ఞాపకముంచుకొనుటకు మనము చేయవలసిన దేమైనకలదా? అవును, ఉన్నది. సమావేశమునకొచ్చు అనేకమంది అభ్యర్ధులు కార్యక్రమ సమయములో నోట్స్ రాసుకొను ప్రయోజనకరమైన అలవాటును వృద్ది చేసికొనియున్నారు. సమావేశమునకు హాజరగునప్పుడు బైబిళ్లు. పాటల పుస్తకములతోపాటు తగిన నోట్స్‌ను వ్రాసుకొను వస్తువులను కూడా ఎప్పుడు దగ్గరుండవలసిన వాటిగా చూచుకొనవలెను. నోట్స్ వ్రాసుకొనుటను నీవు సందేహభావముతో దృష్టించియుండినట్లయిన “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునందు ఎందుకు దానిని ప్రయత్నించకూడదు? చెప్పబడుదానిపై నీ అవధానమును నిలుపుకొనుటకు అది మంచి మార్గమైయుండి నీ మనస్సునటు యిటు తిరగకుండునట్లు అది నిన్ను కాపాడును.
13 తీసుకొను నోట్స్ పెద్దగాను విశదంగాను ఉండవసరములేదు. ఒక కీలకాంశమునకు ఒకటి లేక రెండు వాక్యములు సరిపోవును. శుభ్రముగా తయారుచేసుకొనిన నోట్స్‌ను సేవాకూటములో సమావేశ కార్యక్రమమును రివ్యూ చేయునప్పుడు ఎంతో ప్రయోజనకరముగా పెద్దలు కనుగొనగలరు. వారి బోధనాపనిలోను కాపరి పనిలోను అందలి అనేక అంశములను చేర్చుటకు వారు యిష్టపడవచ్చును.
14 పాట మరియు ప్రార్థన: ఆయనకు స్తుతులను పాడుటద్వారా మనము యెహోవాను ఘనపరచుదుము. అది మన ఆరాధనలో ఒక భాగము. మనఃపూర్వకమైన ప్రార్థనలో తన ప్రజలు ఆయనను సమీపించినప్పుడు యెహోవాయును ఆనందించును. (సామె. 15:8బి) ప్రార్థన మరియు పాటలో వేలకొలది సహోదర సహోదరీలతో కలసి యెహోవాను స్తుతించుటకు జిల్లా సమావేశములు బహు ఉన్నతమైన అవకాశమునిచ్చును. ఏమైనను ఆరాధనలోని ఈ ప్రాముఖ్య భాగములయెడల కొందరు అగౌరవమును ప్రదర్శించియున్నారు. ఎట్లు? ఎట్లనగా అనవసరముగా ప్రారంభపాట మరియు ప్రార్థనా సమయములోనో లేక అవి అయిన తరువాతనో వచ్చుటద్వారా, లేక కార్యక్రమ ముగింపునందు ప్రార్థన కాకముందే పాట సమయములో కొందరు తమ సీట్లను వదలివెళ్లుటవలన. ఎందుకు? ఏదో అరుదైన పరిస్థితులలో ఇలా చేయుటలో ఒక మంచి ఉద్దేశ్యము యుండవచ్చును. ఏమైనను, కొందరు కేవలము తమ కారులను ముందుగా తీసుకొనవచ్చునని, బస్‌స్టాప్ దగ్గరకు లేక తినుటకు ముందు వెళ్లవచ్చునని పాడుట మరియు ప్రార్థనలో కలియుట వంటి అధిక్యతను త్రోసిపుచ్చిన యెహోవా బల్లయెడల తగు గౌరవము చూపబడుతుందా?—మత్త. 6:33.
15 వ్యక్తిగత సౌఖ్యత కొరకు లోకసంబంధమైన నేను ముందు అను స్వభావము, పేరాశ, స్వార్థత్వము మొదలగు భక్తిహీనమైన లక్షణాలు మన ఆత్మీయ అభివృద్ధిని అణచివేయకూడదు. గత సంవత్సరము పోలెండ్ సమావేశములలో మన సహోదరులు పరిశుద్ధమైన వాటి యెడల చూపిన మెప్పువంటి ఆత్మను చూపుదముగాక! మన ఆరాధనలో ఉన్నతమైన భాగములగు ప్రార్థన యెహోవాకు స్తుతులను పాడుటలో తగు గౌరవమును చూపుతూ, మన సహోదరులతో భుజములు కలిపి నడచుదము గాక!—కీర్త. 69:30.
16 మన క్రైస్తవ మర్యాదలు: సమావేశములలో మన క్రైస్తవ మర్యాదలు మరియు కనపడు తీరు యెహోవాసాక్షులుగా మనకు మంచి పేరుతెచ్చినవి. ఇందుకు కారణమేమనగా యెహోవాయొక్క మన ఆరాధనను మనము గంభీరముగా తీసుకొని సమావేశమునకు హాజరగుటను ఏదో సామాజిక కూటముగా భావించము. అట్టి ప్రత్యేక సమయములకు హాజరగునప్పుడు యెల్లవేళల పరిచారకులుగా మన క్రైస్తవ హోదాను, మరియు ఆత్మసంబంధమైన మనస్సును కాపాడుకొనవలెను.—1 కొరిం. 10:31-33.
17 ఏమైనను, సమావేశమునకు హాజరగు కొందరు మరీ సాధారణమైన దృక్పథమును, దుస్తులను, భాషను, ప్రవర్తనను కలిగియున్నారు. స్థానిక సంఘములోను లేక సమావేశములోను అట్టి విషయములు కనిపించిన ఏమి చేయవచ్చును? ఆత్మీయ అర్హతలుగలవారు అట్టివారిని సరిదిద్దు ఉద్దేశ్యముతో ప్రేమగల హెచ్చరికను ఇవ్వవలెను. (గల. 6:1; ఎఫె. 4:11, 12) స్వచ్ఛమైన భాషను మాట్లాడుటయనునది మన మంచి పేరును మరియు ఉన్నతమైన ప్రవర్తనా ప్రమాణములను నిలబెట్టుటకును మనలను ప్రేరేపించవలెను.
18 ఒక సమావేశమును దర్శించిన వ్యక్తి ఈ క్రింది విషయమును వ్రాసి చందా పెట్టెలో వేసి వెళ్లెను: “మీ కార్యక్రమమును నేను ఎంతో బాగా ఆనందించాను. సహోదరులలో ఒకరితో నేను బైబిలును పఠిస్తాను. మీ సమావేశములకు హాజరు కావటం నాకు ఇదే మొదటిసారి. ఆదివారము నాకు చర్చియుండును గనుక కేవలము శనివారము మాత్రమే హాజరగుటకు పథకము వేసుకొన్నాను. కాని నేను ఎంతో ముగ్ధుడనై ఈ దినమున నా కుటుంబాన్నంతటిని తీసుకొచ్చాను. కాని ప్రసంగీకుడు ప్రసంగించుచుండగా మాట్లాడుకొనుచున్న పెద్దవారిని చూచి నేనెంతో నిరుత్సాహపడ్డాను.”
19 ఇంకను కొన్ని సమావేశములలో యుక్తవయస్కులు అంతస్తు భాగములలోనో లేక ఆడిటోరియంనకు దూరముగానో కూర్చొని నోట్స్లందించుకొనుట, గుసగుసలాడుట, సాధారణముగా కార్యక్రమమునకు అవధామివ్వకుండుటయు గమనించబడినది. ఇట్టి ప్రవర్తన వారికింకా తల్లిదండ్రుల పరిశీలన అవసరమై కుటుంబములతో వారు కూర్చొనియుండవలెనని సూచించుచున్నది. బాధ్యతగల తల్లిదండ్రులు ఈ విషయములకు అవధానమిచ్చి పిల్లలకవసరమైన నడిపింపునిచ్చెదరు. (ఎఫె. 6:4) సహోదరులు, సహోదరీలు, చిన్నపిల్లలు కార్యక్రమము జరుగుచున్నప్పుడు అది వినుటకే సమయముగాని మాట్లాడుటకు కాదను దానిని గుణగ్రహించవలయును.—ద్వితీ. 31:12.
20 సరైన గ్రహింపు మరియు మర్యాద చూపవలసిన ఇంకొక స్థలము మనము ఉండు లాడ్జింగ్లకు సంబంధించినది. మంచి హోటళ్లను మనము న్యాయమైన ధరలలో పొందుచున్నాము. కావున మనము, మర్యాదపూర్వకంగాను మరియు అతిగా కోరనివారమైయుంటూ, హోటల్ సిబ్బందియెడల మెప్పును మరియు అవగాహనను ప్రదర్శించవలెను. (గల. 6:10) హోటళ్లలో కలిగియుండవలసిన ప్రవర్తనను గురించి మంచి హెచ్చరిక యివ్వబడినది. అందుకు అనేకులు అనుకూలముగా ప్రత్యుత్తరమిచ్చి, హోటల్ సిబ్బందితో సహకరించుటకు యిష్టపూర్వకంగా కృషి చేయుచున్నారు.
21 గత సంవత్సరపు జిల్లా సమావేశమునకు హాజరైన తరువాత తన హోటల్ గదిని శుభ్రము చేసిన పనికత్తెనుండి ఒక సహోదరి పొందిన ఉత్తరము ఇలాగున్నది: “మీరు నాకొరకు వదలివెళ్లిన బుక్లెట్నకు మరియు టిప్‌కు (మనకు చేసిన సేవకై సంతోషముతో పనివారలకు వదలివెళ్లు పైకము) మీకు కృతజ్ఞతలు తెలుపగోరుచున్నాను. . . . మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేను బైబిలు పఠనములను కలిగి మన తండ్రియైన యెహోవాను ఆయన అద్వితీయకుమారుడైన యేసుక్రీస్తును మెచ్చుకొనుటకు నేర్చుకొనుచున్నాను. మా హోటల్లో మీరు సంతోషముగా గడిపినందుకు నేను ఆనందిస్తున్నాను. ఈసారి సమావేశములో మిమ్మును చూచుటకు ఎదురుచూస్తున్నాను.” తన ఉత్తరములో ఆ పని మనిషి “బుక్లెట్” మరియు “టిప్” అను మాటలను అండర్లైన్ చేసినది.
22 సహోదరులలో ఎక్కువమంది యెహోవా నామమునకు ఘనత తెచ్చునప్పటికిని, సమావేశమునకు హాజరగు కొన్ని కుటుంబములు ఫిర్యాదుకు కారణమిచ్చుచున్నవని ఒప్పుకొనక తప్పదు. ఉదాహరణకు పిల్లలతో సహా నలుగురు లేక ఐదుగురు వ్యక్తులకంటె ఎక్కువమంది ఉండకూడదను మాటమీద రూమును అద్దెకు తీసుకొన్న తరువాత కొందరు దాదాపు పదిమందిని తీసుకొచ్చారు. అది నిజాయితీ కాదు వారికి వసతి కల్పించుటకై మంచములపైనున్న పడకలను తీసి క్రింద వేసుకొని కొందరు నేలమీదను మరికొందరు మంచములమీదను పడుకొనునట్లు చేసిరి. తరువాత మేనేజ్మెంట్నుండి అదనముగా దుప్పట్లు అడగబడినవి.
23 కొందరు వంట చేయవద్దను నియమములను ఉల్లంఘించినందువలన యెహోవాసాక్షులకు అద్దెకిచ్చుటకు వెనుకాడిన కొన్ని హోటళ్లు కలవు. ఇంకొక ఫిర్యాదుయేమనగా ఖాళీ చేయునప్పుడు సహోదరులు తమ రూములను అశుభ్రముగా వదలి వెళ్లిరి. శుభ్రత మరియు ఇతరులయెడల శ్రద్ధ కేవలము మన దుస్తులయందేగాక, ఇతరుల ఆస్తియెడలను చూపవలెను. అద్దెకు తీసుకొనిన రూమును చక్కగాను శుభ్రముగాను ఉంచకూడని కారణమేమైన కలదా? ఆలోచన లేని ప్రవర్తన మన మంచి పేరును పాడుచేయును. రానైయున్న జిల్లా సమావేశములలో “అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు” ప్రవర్తించులాగున మనమట్టుకు మనము పోరాడుదము.—తీతు 2:10.
24 తల్లిదండ్రుల కొరకు: “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు ఆహ్వానించబడువారిలో చిన్న పిల్లలు, యుక్తవయస్కులు ఉన్నారు. వారును స్వచ్ఛమైన భాషను ధారాళముగా మాట్లాడవలయును. క్రైస్తవ కూటములన్నిటిలోను జాగ్రత్తగా అవధానమును నిలుప నేర్చుకొని సమావేశ కార్యక్రమమును జాగ్రత్తగా విను ఆసక్తిగల చిన్నపిల్లలను చూచుట ఎంత శ్రేష్టమైన విషయము! (కీర్త. 148:12, 13) అయితే చాలా మట్టుకు అది తలిదండ్రుల మాదిరి, వారి పరిశీలనపై ఆధారపడియుంటుంది. చాలామంది చిన్నపిల్లలు నోట్స్ వ్రాసుకొనుటకు చాలా బాగా తర్ఫీదు పొందియున్నారు. ఒక తండ్రి లేక తల్లిగా మీ పిల్లలకు నోట్స్ వ్రాసుకొనుటను యింకను బోధించకపోయినట్లయిన సమావేశమునకు ముందు మిగిలియున్న సమయమును అట్లు చేయుటకు ఎందుకు ఉపయోగించకూడదు? చాలా చిన్న పిల్లలును చెప్పబడిన లేఖనములను, అందుకు సంబంధించి ప్రసంగీకుడు వ్యక్తపరచు కీలక పదములను వ్రాసుకొనుటకు ప్రోత్సహించబడవచ్చును. కొంతమంది తల్లిదండ్రులు దిన కార్యక్రమం అయిపోయిన తరువాత, తాము ఉండే లాడ్జికి తిరిగి వచ్చిన తరువాత లేక యింటికి తిరిగివచ్చు ప్రయాణములోను ముఖ్యాంశములను తిరిగి పునఃసమీక్షించుటకు ఏర్పాటు చేసుకొందురు.
25 అయినను, చాలామంది తల్లిదండ్రులు పిల్లల సహజ స్వభావము ఆటలాడునదిగా యుండునని గుణగ్రహింతురు. వారికి జీవితములో అనుభవము లేదు. వారింకా పరిపక్వతకు రాలేదు. కాబట్టి ఎప్పుడు అవధానమును నిలుపవలెనో కూటములందు తమ్ముతాము ఎట్లు ప్రవర్తించువారిగా చూచుకొనవలెనో బోధించబడవలెను. ఇందుకు తల్లిదండ్రుల సరైన పరిశీలన అవసరము. కొందరు తల్లిదండ్రులు ఈ విషయములో శ్రద్ధలేని వారిగా యుందురు. తల్లిదండ్రులు కొన్నిసార్లు ప్రార్థనా సమయములో యెహోవాకు తగు ఘనతను చూపుతున్నను, పిల్లలు మాత్రము ఆడుకొంటు ఇతరుల అవధానమును ప్రక్కకు లాగుచున్నారు. ప్రార్థనా సమయములోను తమ పిల్లలు ఏమి చేయుచున్నది తల్లిదండ్రులు తెలుసుకొనవలెను. కార్యక్రమ సమయములో వారు తమ సీట్లను వదలి వెళ్లునప్పుడు వారేమి చేయుదురు? కార్యక్రమ సమయములో లేక అయిపోయిన తరువాత పిల్లలు గమనించబడకుండా వదలి వేయబడుచున్నారా?—సామె. 29:15.
26 కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు రూములోనున్నప్పుడు, భోజనము చేయునప్పుడు, లేక ఇతర పనిలో నిమఘ్నమైయున్నప్పుడు, పిల్లలు హోటలు లాబీలో లేక ఆ పరిసర ప్రాంతములో గమనింపబడకుండా వదలి వేయబడుచున్నారు. ఇది సరైనది కాదు. కొంతమంది పిల్లలు పెద్దవారైన సహోదరులు లేక సహోదరీలు దయాపూర్వకముగా సరిదిద్దబోయినప్పుడు క్రమశిక్షణారహితముగా, అసభ్యముగా చివరకు అగౌరవముగా ప్రవర్తించారు. అట్టి అసభ్యత, క్రైస్తవత్వమునకు తగని ప్రవర్తనకు కారణము. తరచు యింటిలోని విచ్చలివిడితనము, క్రమశిక్షణారాహిత్యపు పరిస్థితియే. అది తప్పక సరిదిద్దబడవలెను. కాబట్టి వారిని “యెహోవా యొక్క శిక్షలోను మరియు బోధలోనూ పెంచుకొలది” క్రైస్తవ తల్లిదండ్రులందరు తమ పిల్లలను చాలా సూక్ష్మముగా పరిశీలించవలెను.—ఎఫె. 6:4.
27 మీ పూర్తి సహకారము మెచ్చుకొనబడుతుంది: “సమావేశమునకు ప్రతివారికి సరిపోవునట్లుగా కూర్చొను విషయమందును, సాహిత్యము, ఆహార విషయములలోను చాలావరకు తగు మాత్రపు పథకము మరియు పని చేయబడుట జరిగినది. ఈ ఏర్పాటులు మంచి ఫలకరముగా నుండునట్లు కొన్నికొన్ని సంఘములు ప్రత్యేకముగా ఒక్కొక్క సమావేశమునకు నియమించబడియున్నవి. ఎక్కువగా గుంపు అగుటను నిరోధించుటకు మీ పూర్తి సహకారము అవసరము. అయినను, కొంతమందికి ఇంకొక ప్రాంతపు సమావేశమునకు హాజరగు అవసరతను కలిగించు పరిస్థితులు ఉండవచ్చును. ఏమైనను, ఎక్కువమంది తమకు నియమించబడిన ప్రాంతపు సమావేశమునకు హాజరుకావలెను.—1 కొరిం. 13:5; ఫిలి. 2:4.
28 సీట్లను నిలుపుకొనుటలో మీ పూర్తి సహకారము కోరబడుచున్నది. మీ స్వంత కుటుంబ సభ్యులకు లేక మీతో ప్రయాణించు వారికొరకు మాత్రము సీట్లను నిలుపుకొనవచ్చునను విషయమును దయచేసి మనస్సునందుంచుకొనవలెను. దయచేసి ఇతరుల కొరకు సీట్లను నిలిపియుంచవద్దు. కొన్నిసార్లు ప్రత్యేకంగా ఎవరికొరకు కాకుండా సీట్లను అదనంగా నిలిపియుంచటం జరిగినది. ఇది ప్రేమలేని విషయమైన, లభ్యముగానున్న సీట్ల కొరకు చూచు ఇతరులను, అటెండెంట్లను తప్పు దారి పట్టించునదైయుండును. బైబిలు ఉపదేశమునకు అనుగుణ్యముగా సహోదరి ప్రేమను కనపరచుటకును, సీట్లను నిలుపుకొను విషయములో అంగీకారమైన ఏర్పాటులతో సహకరించుటకు మనము పోరాడవలెను.—2 పేతు. 1:5-8.
29 వ్యక్తిగత వస్తువులను సమావేశస్థలమునకు తెచ్చుటలో మంచి వివేచనను ఉపయోగించమని సలహా యివ్వబడుచున్నది. గతములో కొందరు పెద్దకూలర్లు. తమ సీట్ల క్రింద పెట్టలేని పెద్ద వస్తువులు తీసుకొచ్చారు. ఇవి సీట్లకు వెళ్లు మార్గమందును లేక సీట్లపైనను పెట్టబడినవి. ఇవి ఇతరులకు సీట్లు లేకుండ చేసి, కొన్నిసార్లు అగ్ని లేక భద్రతా సూచనలను భంగపరచినవి. ఇట్టి విషయములలో మనము ఇతర విషయములను గూర్చిన శ్రద్ధను ప్రదర్శించవలసియున్నాము.
30 వీడియో కెమెరాలను లేక ఆడియో రికార్డింగ్‌ను సమావేశ స్థలమందు ఉపయోగించుటకు అనుమతించబడినది. వాటిని ఉపయోగించువారు ఇతరులకు ఆటంకము మరియు అవధానము మళ్లించుట మొదలగు వాటిని చేయకుండా జాగ్రత్తపడవలెను. అట్టి సామాను సీట్లకు వెళ్లు మార్గమందును లేక బయటకు వెళ్లు మార్గమందును పెట్టబడకూడదు. అటువంటి ఏ సామానునైనను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌కు లేదా ఎలక్ట్రికల్ కనెక్షన్లకు కనెక్టు చేయబడకూడదు. ఫ్లడ్ లైట్లు అనుమతించబడవు. అవధానము మళ్లించుటను లేక పై మార్గదర్శకములను అలక్ష్యపరచువారు ఆ విషయము వారి దృష్టికి తెచ్చిన వెంటనే సరిచేసుకొనవలెను. అటెండెంట్స్ మరియు పనికి బాధ్యులైన వారెవరైనను అట్టివాటిని ఉపయోగించువారినుండి పూర్తిగా సహకారమును పొందవలెను.
31 ఆహారసేవ: సొసైటి ఆహార ఏర్పాట్లను సరిదిద్ది, సులభతరము చేయును. అందరి ప్రయోజనార్థమై పనిని సులభము మరియు త్వరితము చేయు ఈ ఏర్పాటు ఎంత మంచిది! దేవుని సంస్థయొక్క అట్టి ఉదారభావము. కృతజ్ఞతతో అభ్యాసయుక్తమైన అనేక మార్గాలలో మన మెప్పును చూపుటకు మనలను నడుపవలెను.—సామె. 11:25.
32 సిద్ధపరచబడిన ఆత్మీయ కార్యక్రమమునుండి ప్రయోజనము పొందుటకు అటువంటి మంచి సౌకర్యములందు ప్రతి సంవత్సరము కూడుకొనగలుగుటను యెహోవా ప్రజలు మెచ్చుకొందురు. ఆ కూటములయందు అందించబడునట్టి సేవలను, అనుకూలతలను మేమును మెచ్చుకొందుము. సమావేశమునకు హాజరగుటను సంతోషదాయకమైనదిగాను, ఆత్మీయముగా సేదతీర్చునదిగాను చేయుటకు చాలినన్ని సీట్లు, ఖరీదైన సౌండ్సిస్టమ్, మంచి ఆహారసేవ ఏర్పాట్లు ఎంతో జాగ్రత్త మరియు సొసైటియొక్క ఖర్చుతో ఏర్పాటు చేయబడుచున్నవి.
33 ఈ ఖర్చులు సొసైటియొక్క ప్రపంచవ్యాప్తమైన పనికి మద్దతుగా మీరు అందించు యిష్టపూర్వక చందాలవలననే భరించబడుచున్నవి. మీ అనుకూలతకొరకు స్పష్టముగా గుర్తించబడిన చందా పెట్టెలు సమావేశ స్థలమంతట ఉంచబడినవి. చందాలన్నియు మెచ్చుకొనబడును. మరియు రాజ్యాసక్తులకై మీరు ఈ విధముగా అందించు ఉదారమైన మరియు ఐక్యమైన మద్దతుకు సొసైటి ముందుగానే కృతజ్ఞతలు తెలుప యిష్టపడుచున్నది. ఇచ్చట చూపబడిన వాటి విషయములలో అందరు తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి తమ పరిస్థితులు అనుమతించు వరకు వీటిలో పాల్గొనుట ద్వారా పూర్తిగా సహకరిస్తారని మేము నమ్మకమును కలిగియున్నాము.—లూకా 6:38.
34 “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు రండి: “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు హాజరై కార్యక్రమమునకు శ్రద్ధగల అవధానమిచ్చుట ద్వారా యెహోవా ఎందుకు మనకు స్వచ్ఛమైన భాషనిచ్చాడు మరియు ఎందుకు సహోదరులతో ఐక్యతగానుండు విషయములో జోక్యము కలిగించుకొను స్వార్థపర అభిప్రాయములయెడల జాగ్రత్త కలిగియుండవలెనో ఎక్కువగా గుణగ్రహింతువు. ప్రారంభపాట మరియు ఆదివారము మధ్యాహ్నము ప్రార్థనతో సహా అన్ని భాగములకును హాజరగుటకు మీ పథకములను వేసుకొనుము.
[6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశపు జ్ఞాపికలు
రూమింగ్: సమావేశము ద్వారా అందించబడిన వసతి విషయములో మీ సహకారము ఎంతో మెచ్చుకొనబడుతుంది. మీ రిజర్వేషన్‌ను కేన్సిల్ చేసుకొనుట అవసరమైన నేరుగా హోటల్‌కు మీరు ఫోన్ చేయుటగాని లేక వ్రాయుటను గాని చేయవచ్చును. ఆ రూమ్ ఇంకొకరికి యివ్వబడులాగున సాధ్యమైనంత ముందుగా అట్లు చేయుము.
బాప్తిస్మము: బాప్తిస్మము తీసుకొనువారు శనివారపు ఉదయ కార్యక్రమమునకు ముందే తమకు సూచింపబడిన సీట్లలో కూర్చొనుటకు ప్రయత్నించవలెను. బాప్తిస్మము పొందుటకు వచ్చు ప్రతి వ్యక్తి తగినట్లుగా యుండు స్నానపు దుస్తులను, తువ్వాలును తెచ్చుకొనవలెను. ప్రసంగీకునివలన బాప్తిస్మపు ప్రసంగము మరియు ప్రార్థన అయిపోయిన తరువాత సెషమ్ ఛైర్మన్ బాప్తిస్మపు అభ్యర్థులకు క్లుప్తమైన ఉపదేశములనిచ్చి పాట పాడుటకు పిలుచును. ఆఖరు వచన ప్రారంభములో అటెండెంట్స్ బాప్తిస్మపు అభ్యర్థులను బాప్తిస్మపు స్థలమునకు లేదా అచ్చటికి తీసుకెళ్లు వాహనముల యొద్దకు నడుపుదురు. మిగిలిన ప్రేక్షకులు పాట పాడుటను పూర్తి చేయుదురు. బాప్తిస్మము వ్యక్తికి మరియు యెహోవాకు మధ్య నుండు సన్నిహితమైన వ్యక్తిగత విషయము గనుక తోటి—బాప్తిస్మపు అభ్యర్థులుగా నామకార్థముగా పిలువబడు వారు ఒకరు లేక యిద్దరు బాప్తిస్మమప్పుడు బాప్తిస్మ అభ్యర్థి చేతులు పట్టుకొనియుండుటకును, లేక కౌగలించుకొనియుండుటకును ఏర్పాటు లేదు.
పయినీరు గుర్తింపు: ప్రతి రెగ్యులర్ మరియు స్పెషల్ పయినీర్లు, ప్రయాణాకాపరులు వారి వాచ్‌టవర్ ఐడెంటిఫికేషన్ అండ్ అసైన్మెంట్ కార్డును (S-202) సమావేశమునకు తేవలెను. వారు హాజరగు జిల్లా సమావేశమునకు కనీసము ఆరునెలలకు ముందు పయినీరు లిస్టులోయున్నవారు తమ వాచ్‌టవర్ ఐడి కార్డును చూపించినప్పుడు 60 రూ.ల విలువగల ఆహార టికెట్లను పొందుదురు. ఇది ఒక్క సమావేశమునకు మాత్రమే. కాబట్టి ఈ కార్డును డబ్బుగా భావించి జాగ్రత్తగా చూచుకొనుము. దానికి బదులు ఇంకొక దానిని సమావేశములో పొందలేవు. బుక్రూమ్లోని పుస్తకములు వారు తమ వాచ్‌టవర్ ఐడి కార్డును చూపినప్పుడు మాత్రమే పయినీరు రేట్లకు యివ్వబడును. బేతేలు సేవలోయున్న వారు తమ బేతేలు ఐడి కార్డును చూపి ఈ అనుకూలతలను పొందవచ్చును.
స్వచ్ఛందసేవ: జిల్లా సమావేశము మృదువుగా సాగుటకు స్వచ్ఛంద సేవ అవసరము. నీవు సమావేశపు ఒక భాగమున మాత్రమే పనిచేయగలిగినను అదియు మెచ్చుకొనబడును. నీవు సహాయ పడగలిగినట్లయిన సమావేశమునకు వచ్చిన దినమున స్వచ్ఛందసేవా డిపార్టుమెంటునకు రిపోర్టు చేయుము. 16 సంవత్సరముల వయస్సులోపు పిల్లలును సమావేశ విజయమునకు దోహదపడవచ్చును. అయితే వారు తల్లి లేక తండ్రితో లేదా ఒక బాధ్యతగల పెద్ద వ్యక్తితో పనిచేయవలెను.
లేపల్ కార్డులు: దయచేసి ప్రత్యేకముగా తయారుచేయబడిన లేపల్ కార్డును సమావేశమందును సమావేశమునకు వచ్చిపోవునప్పుడు ప్రయాణమందును ధరించుకొనుము. తరచు ఇది మన ప్రయాణమందు మంచి సాక్ష్యమిచ్చుటకు సాధ్యపరచును. ఆ లేపల్ కార్డులు సమావేశమునందు లభ్యము కావు కాబట్టి మీ సంఘము ద్వారా వాటిని పొందవలయును. లేపల్ బ్యాడ్జ్ హోల్డరులను సంఘములు ఆర్డరు వేయవలెను. అయితే లేపల్కార్డులు సంఘములకు సొసైటిచే పంపబడును. హోల్డరు విలువ 1.00 రూ. కార్డు విలువ 0.20 పైసలు.
హెచ్చరిక మాటలు: మీ వాహనమును ఎక్కడ నిలిపినను అన్ని సమయములందు మీరు తాళము వేయవలెను. బయటకు కనిపిస్తూయుండు దేనిని ఎప్పుడును లోపల వదలివుంచకుము. సాధ్యమైన మీ సామానును ట్రంక్లోపల పెట్టి తాళము వేయుము. పెద్ద కూటములను చూచి ఆకర్షింపబడు దొంగలు, జేబుదొంగలను గూర్చి జాగ్రత్తపడుము. విలువైన వాటిని గమనించకుండా సీట్లపై వదలి వెళ్లకుండుటయు ఇందు యిమిడి యున్నది. దయచేసి జాగ్రత్తగా యుండుము.
కొన్ని హోటళ్లు అవినీతికరమైన లేక లైంగిక సంబంధమైన టెలివిజన్ సినిమాలకు సులభముగా వీలు కల్పించునని రిపోర్టు చేయబడినది. కాబట్టి పిల్లలు లాడ్జింగ్ స్థలములలో వెళ్లి టి.వి. చూచుటను పరిశీలించకుండా వుండకూడదను దానిని ఇది ఉన్నతపరచుచున్నది.
[6వ పేజీలోని బాక్సు]
మీరు పాడుటకను ప్రాక్టీసు చేయుటకై సమావేశపు పాట సంఖ్యలు
ఉదయము మధ్యాహ్నము
గురువారము 148 (74)a
78 (104)
217 (119)
శుక్రవారము 160 (88) 69 (9)
191 (18) 164 (73)
211 (68) 111 (91)
శనివారము 91 (31) 33 (13)
144 (78) 200 (108)
202 (82) 79 (59)
ఆదివారము 155 (23) 42 (85)
61 (90) 161 (87)
31 (11) 45 (110)
a బ్రాకెట్లలో చూపబడిన పాటసంఖ్యలు 1966 సం.పు పాటల పుస్తకమునుపయోగించు కేరళ కొరకు మాత్రమే. యితర పాటలు 1984 సం.పు పాటల పుస్తకమునుండి తీసుకొనబడినవి.