కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w02 3/1 పేజీ 30
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మీ తండ్రి కనికరముగలవాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవాను అనుకరించండి—నీతిన్యాయాలను జరిగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మనం ఆరాధించే దేవుడు “అత్యంత కరుణామయుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
w02 3/1 పేజీ 30

పాఠకుల ప్రశ్నలు

యెహోవా కనికరం ఆయన న్యాయం యొక్క తీవ్రతను తగ్గిస్తుందని చెప్పడం సరియేనా?

అలాని మునుపు ప్రచురణల్లో అన్నప్పటికీ, ఇకపై అలా అనకపోవడం మంచిది. ఎందుకంటే అలా అనడంవల్ల, కనికరం అనే లక్షణం కఠిన లక్షణమైన న్యాయంకన్నా ఏదో ఉన్నతమైనదన్నట్లు, యెహోవా కనికరం ఆయన న్యాయాన్ని మెత్తబరుస్తుందన్న భావాన్ని లేదా అడ్డుకుంటుందన్న భావాన్నిస్తున్నట్లు ఉంది. అది సరికాదు.

“న్యాయము” అని అనువదించబడే హీబ్రూ పదం “తీర్పు” అన్న అర్థాన్ని కూడా కలిగివుంది. న్యాయానికి నీతితో దగ్గరి సంబంధం ఉంది. అయితే, న్యాయానికి సాధారణంగా చట్టపరమైన విషయాలతో సంబంధం ఉంటుంది. కానీ నీతికి సాధారణంగా అలాంటి సంబంధం ఉండదు. యెహోవా న్యాయంలో తగిన శిక్షలను విధించడం ఇమిడివుండగలదన్నది నిజమే, కానీ అందులో అర్హులైనవారికి రక్షణను ఇవ్వడం కూడా ఇమిడివుండగలదు. (ఆదికాండము 18:20-32; యెషయా 56:1; మలాకీ 4:2) కాబట్టి యెహోవా న్యాయం కఠినమైనదన్నట్లు, లేదా దాన్ని మెత్తబరచాల్సిన అవసరం ఉందన్నట్లు దృష్టించకూడదు.

“కనికరం” అనే పదానికి హీబ్రూ పదం, తీర్పును అమలుచేయడంలో నిగ్రహం చూపించడాన్ని కూడా సూచించగలదు. అది, దీనులకు దుఃఖోపశమనం కలిగిస్తూ కరుణను క్రియాత్మకంగా వ్యక్తం చేయడాన్ని కూడా సూచించగలదు.—ద్వితీయోపదేశకాండము 10:18; లూకా 10:29-37.

యెహోవా న్యాయం, కనికరం రెండూ ఉన్న దేవుడు. (నిర్గమకాండము 34:6, 7; ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 145:9) ఆయన న్యాయము కనికరము రెండూ పరిపూర్ణమైనవి, రెండూ పొందికగా పనిచేస్తాయి. (కీర్తన 119:156) రెండు లక్షణాలూ ఒకదానినొకటి పరిపూర్ణంగా సమతుల్యపరుస్తాయి లేదా ఒకదానికొకటి పూరకాలుగా ఉంటాయి. కాబట్టి, యెహోవా కనికరము ఆయన న్యాయం యొక్క తీవ్రతను తగ్గించిందని మనం అంటే, ఆయన న్యాయం ఆయన కనికరం యొక్క తీవ్రతను తగ్గించిందని కూడా చెప్పాల్సి ఉంటుంది.

యెషయా ఇలా ప్రవచించాడు: “మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు, యెహోవా న్యాయముతీర్చు దేవుడు.” (యెషయా 30:18) యెహోవా కనికరం ఆయన న్యాయాన్ని మెత్తబరుస్తుందనో లేదా అడ్డుకుంటుందనో అర్థం కాదుగానీ, ఆయన న్యాయం కనికరం చూపించేందుకు ఆయనను పురికొల్పుతుందని యెషయా ఇక్కడ చూపిస్తున్నాడు. యెహోవా న్యాయవంతుడు, అంతేగాక ప్రేమగలవాడు గనుక ఆయన కనికరాన్ని చూపిస్తాడు.

బైబిలు రచయిత అయిన యాకోబు, “కనికరము తీర్పును మించి అతిశయపడును” అని వ్రాశాడన్నది నిజమే. (యాకోబు 2:13బి) అయితే ఈ సందర్భంలో యాకోబు యెహోవా గురించి కాదు గానీ, దుఃఖాల్లోను కడుబీదరికంలోను ఉన్నవారిపట్ల కనికరాన్ని చూపించే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. (యాకోబు 1:27; 2:1-9) అలా కనికరపడేవారికి తీర్పు తీర్చాల్సివచ్చినప్పుడు యెహోవా వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటాడు, తన కుమారుని బలి ఆధారంగా కనికరంతో వారిని క్షమిస్తాడు. ఆ విధంగా కనికరంతో కూడిన వారి ప్రవర్తన వారికి లభించి ఉండగల ఎలాంటి ప్రతికూల తీర్పునైనా మించి అతిశయపడుతుంది.—సామెతలు 14:21; మత్తయి 5:7; 6:12; 7:2.

కాబట్టి, యెహోవా న్యాయం కనికరంచేత మెత్తబరచబడాల్సిన అవసరం ఉందన్నట్లుగా, యెహోవా తీర్పు యొక్క తీవ్రతను ఆయన కనికరం తగ్గిస్తుందనడం సరికాదు. యెహోవాలో ఆ రెండు లక్షణాలూ పరిపూర్ణ సమతుల్యతతో ఉన్నాయి. అవి ప్రేమ, జ్ఞానము వంటి యెహోవా ఇతర లక్షణాలను సమతుల్యపరచి వాటిచే సమతుల్యపరచబడినట్లే ఇవి రెండూ ఒక దానినొకటి సమతుల్యపరచుకుంటాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి