కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 11/15 పేజీలు 8-12
  • ‘దేవుని వాక్యమును సరిగా ఉపదేశించండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘దేవుని వాక్యమును సరిగా ఉపదేశించండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు—ఆసక్తిగల రాజ్య ప్రచారకుడు
  • మన పరిచర్య దేవుని వాక్యములో పాతుకొని ఉండాలి
  • మన ప్రవర్తన మెచ్చుకోదగినదిగా ఉండాలి
  • దేవుని వాక్యానికి మార్చే శక్తి ఉంది
  • దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ సరిగా ఉపదేశించండి
  • మీరు దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—1996
  • ‘ఆత్మ ఖడ్గాన్ని’ నైపుణ్యంతో ఉపయోగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లు
    మన రాజ్య పరిచర్య—2015
  • సత్యాన్ని బోధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 11/15 పేజీలు 8-12

‘దేవుని వాక్యమును సరిగా ఉపదేశించండి’

“దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.”—2 తిమోతి 2:15.

1, 2. (ఎ) పనివారికి పనిముట్లు ఎందుకు అవసరం? (బి) క్రైస్తవులు ఏ పనిలో ఉన్నారు, రాజ్యాన్ని మొదట వెదకుతున్నామని వారెలా చూపిస్తారు?

పని పూర్తి చేయడానికి పనివారికి పనిముట్ల సహాయం అవసరం. కానీ ఏదోక పనిముట్టువుంటే మాత్రమే సరిపోదు. పనివానికి సరైన పనిముట్టు ఉండాలి, అతడు దానిని సరిగా ఉపయోగించాలి. ఉదాహరణకు, ఒక పాక నిర్మించేటప్పుడు రెండు కర్రలు కలిపి బిగించాలంటే మీ దగ్గర సుత్తి, మేకులుంటే సరిపోదు. మేకు వంగిపోకుండా దానిని కర్రకు ఎలాకొట్టాలో మీకు తెలిసుండాలి. సుత్తినెలా ఉపయోగించాలో తెలియకుండా కర్రకు మేకు కొట్టడానికి ప్రయత్నించడం చాలాకష్టం, పైగా ఆయాసకరం. అయితే పనిముట్లను సరిగా ఉపయోగించడం సంతృప్తికరంగా పనులు ముగించడానికి మనకు తోడ్పడుతుంది.

2 క్రైస్తవులమైన మనకు చేయడానికి ఒక పనివుంది. అది అతి ప్రాముఖ్యమైన పని. ‘మొదట రాజ్యమును వెదకుడని’ యేసుక్రీస్తు తన శిష్యులకు ఉద్బోధించాడు. (మత్తయి 6:33) దానిని మనమెలా చేయవచ్చు? రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో మనం ఆసక్తితో ఉండడం ఒక మార్గం. మన పరిచర్య పూర్తిగా దేవుని వాక్యంపై ఆధారపడి ఉండేలా చూసుకోవడం రెండవ మార్గం. మంచి ప్రవర్తన మూడవ మార్గం. (మత్తయి 24:14; 28:19, 20; అపొస్తలుల కార్యములు 8:25; 1 పేతురు 2:12) ఈ క్రైస్తవ నియామకంలో ఫలవంతంగా, సంతోషంగా ఉండాలంటే, మనకు తగిన పనిముట్లు, వాటిని సరిగా ఉపయోగించగల పరిజ్ఞానం ఉండాలి. దీనికి సంబంధించి అపొస్తలుడైన పౌలు క్రైస్తవ శ్రామికునిగా గమనార్హమైన మాదిరి ఉంచి, తనను అనుకరించమని తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. (1 కొరింథీయులు 11:1; 15:10) కాబట్టి, మనతోటి పనివాడైన పౌలు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

పౌలు—ఆసక్తిగల రాజ్య ప్రచారకుడు

3. అపొస్తలుడైన పౌలు ఆసక్తిగల రాజ్య పనివాడని ఎందుకు చెప్పవచ్చు?

3 పౌలు ఎటువంటి పనివాడు? ఖచ్చితంగా ఆయన ఆసక్తిగలవాడే. మధ్యధరా చుట్టుప్రక్కల ఉన్న విస్తారమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ పౌలు అవిశ్రాంతంగా కృషిచేశాడు. రాజ్యాన్ని తానంత ఉత్సాహంగా ప్రకటించడానికి కారణమేమిటో చెబుతూ ఈ అవిశ్రాంత అపొస్తలుడు ఇలా అన్నాడు: “నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” (1 కొరింథీయులు 9:16) పౌలుకు కేవలం తన ప్రాణ రక్షణమీదే శ్రద్ధవుందా? కాదు. ఆయన స్వార్థపరుడు కాడు. బదులుగా, సువార్త నుండి ఇతరులు కూడా ప్రయోజనం పొందాలని ఆయన కోరుకున్నాడు. ఆయనిలా రాశాడు: “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.”—1 కొరింథీయులు 9:23.

4. క్రైస్తవ పనివారు ఏ పనిముట్టును అత్యంత విలువైనదిగా పరిగణిస్తారు?

4 అపొస్తలుడైన పౌలు తాను తన వ్యక్తిగత సామర్థ్యాల మీదే పూర్తిగా ఆధారపడలేనని గ్రహించిన నమ్రతగల పనివాడు. వడ్రంగికి సుత్తి ఎలా అవసరమో, అలాగే పౌలుకు తన శ్రోతల హృదయాల్లో దేవుని సత్యాన్ని నాటేందుకు తగిన పనిముట్టు అవసరమైంది. ఆయన ప్రాథమికంగా ఏ పనిముట్టును ఉపయోగించాడు? అది దేవుని వాక్యం, పరిశుద్ధ లేఖనాలు. అదే ప్రకారం, శిష్యులను చేసేందుకు మనకు సహాయపడడానికి ప్రాథమిక పనిముట్టుగా పూర్తి బైబిలును మనం ఉపయోగిస్తాం.

5. ఫలవంతమైన పరిచారకులుగా ఉండడానికి, లేఖనాలను ఎత్తి చెప్పడంతోపాటు మనమేమి చేయడం అవసరం?

5 దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించడంలో దానినుండి ఎత్తిచెప్పడంకంటే మరెంతో ఇమిడివుందని పౌలుకు తెలుసు. ఆయన “ఒప్పించ”గల నేర్పును ప్రయోగించాడు. (అపొస్తలుల కార్యములు 28:23) ఎలా? అనేకులు రాజ్య సత్యాన్ని అంగీకరించేలా వారిని ఒప్పించడానికి పౌలు దేవుని లిఖిత వాక్యమును విజయవంతంగా ఉపయోగించాడు. ఆయన వారితో తర్కించాడు. ఎఫెసులోవున్న సమాజమందిరంలో పౌలు మూడునెలలు ‘ప్రసంగిస్తూ, దేవుని రాజ్యమును గురించి ఒప్పిస్తూ వచ్చాడు.’ ‘కొందరు తమను కఠినపరచుకొని ఒప్పుకోకపోయినా’ ఇతరులు జాగ్రత్తగా విన్నారు. ఎఫెసులో పౌలుచేసిన పరిచర్య ఫలితంగా, “ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపిం[చింది].”—అపొస్తలుల కార్యములు 19:8, 9, 20.

6, 7. పౌలు తన పరిచర్యను ఎలా మహిమపరిచాడు, మనమూ అదే ప్రకారంగా ఎలా చేయగలము?

6 ఆసక్తిగల రాజ్య ప్రచారకునిగా పౌలు తన ‘పరిచర్యను ఘనపరిచాడు.’ (రోమీయులు 11:14) ఎలా? ఆయన స్వీయ ఉన్నతి పట్ల ఆసక్తిచూపలేదు; లేదా దేవుని జతపనివారిలో ఒకనిగా బహిరంగంగా గుర్తింపబడడానికీ సిగ్గుపడలేదు. బదులుగా, ఆయన తన పరిచర్యను మహోన్నత ఘనతగా దృష్టించాడు. పౌలు దేవుని వాక్యమును నేర్పుగా, అమోఘంగా ఉపదేశించాడు. ఇతరులు తమ పరిచర్యను మరింత పూర్తిగా నెరవేర్చేందుకు వారిని పురికొల్పడానికి సహాయపడుతూ ఆయన ఫలవంతమైన కార్యశీలత వారిని ప్రోత్సహించింది. ఈ విధంగా కూడా ఆయన పరిచర్య మహిమపరచబడింది.

7 పౌలు వలెనే మనమూ దేవుని వాక్యాన్ని తరచూ, కార్యసాధకంగా ఉపయోగించడం ద్వారా పరిచారకులుగా మన సేవను మహిమపరచవచ్చు. మన క్షేత్ర పరిచర్యకు సంబంధించిన అన్ని రంగాల్లో సాధ్యమైనంత మందితో లేఖనాల్లోనుండి కొంతైనా పంచుకోవడం మన లక్ష్యంగా ఉండాలి. ఈ ఒప్పింపజేయడాన్ని మనమెలా చేయగలము? ప్రాముఖ్యమైన ఈ మూడు మార్గాలను పరిశీలించండి: (1) దేవుని వాక్యంపట్ల గౌరవం పుట్టించే విధంగా దానివైపు దృష్టి మళ్లించండి. (2) బైబిలు ఏమి చెబుతుందో నేర్పుగా వివరించి, అది చర్చాంశానికి ఎలా మద్దతు ఇస్తుందో చూపించండి. (3) ఒప్పింపజేసే విధంగా లేఖనాలనుండి తర్కించండి.

8. మనకు నేడు ఎలాంటి రాజ్య ప్రకటనా పనిముట్లు అందుబాటులో ఉన్నాయి, మీరు వాటినెలా ఉపయోగించారు?

8 పౌలుకు తన పరిచర్య కాలంలో అందుబాటులోలేని పనిముట్లు నేటి రాజ్య ప్రచారకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పుస్తకాలు, పత్రికలు, బ్రోషుర్లు, హ్యాండ్‌ బిల్లులు, కరపత్రాలు, ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయి. గత శతాబ్దంలో, సాక్ష్యపు కార్డులు, ఫోనోగ్రాఫులు, సౌండు కార్లు, రేడియో ప్రసారాలు కూడా ఉపయోగించబడ్డాయి. అయితే, బైబిలు మన అతి శ్రేష్ఠమైన పనిముట్టు. అందుకని ఈ ప్రాముఖ్యమైన పనిముట్టును మనం సరైన రీతిలో చక్కగా ఉపయోగించాలి.

మన పరిచర్య దేవుని వాక్యములో పాతుకొని ఉండాలి

9, 10. దేవుని వాక్యాన్ని ఉపయోగించడం గురించి, పౌలు తిమోతికిచ్చిన ఉపదేశం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

9 దేవుని వాక్యాన్ని కార్యసాధక పనిముట్టుగా మనమెలా ఉపయోగించవచ్చు? “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని తోటి పనివాడైన తిమోతిని ఉద్దేశించి పౌలు రాసిన ఈ మాటలను లక్ష్యపెట్టడం ద్వారా మనమలా చేయవచ్చు. (2 తిమోతి 2:15) ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడంలో’ ఏమి ఇమిడి ఉంది?

10 “సరిగా ఉపదేశించుట” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “తిన్నగా కోయడం” లేదా “తిన్నగా దారివేయడం” అని అర్థం. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో పౌలు తిమోతికిచ్చిన బోధనలో మాత్రమే ఆ పదం ఉపయోగించబడింది. అదే పదాన్ని పొలంలో నాగలితో తిన్నగా చాలు దున్నడాన్ని వర్ణించేందుకు ఉపయోగించవచ్చు. అనుభవంగల రైతు వంకరటింకరగా చాలు దున్నడం సిగ్గుకరంగా ఉంటుంది. “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” ఉండాలంటే, దేవుని వాక్య నిజ బోధలనుండి వైదొలగడానికి అనుమతిలేదని తిమోతికి గుర్తుచేయబడింది. తిమోతి తన వ్యక్తిగత అభిప్రాయాలు తన బోధను ప్రభావితం చేయడానికి అనుమతించకూడదు. ఆయన ప్రకటించడం, బోధించడం ఖచ్చితంగా లేఖనాల ఆధారంగానే ఉండాలి. (2 తిమోతి 4:2-4) ఆ విధంగా యథార్థ హృదయులు, లోక తత్వాలను ఎంచుకోవడానికి బదులు యెహోవా తలంపులను కలిగివుండడానికి నిర్దేశించబడతారు. (కొలొస్సయులు 2:4, 8) నేడుకూడా అది నిజం.

మన ప్రవర్తన మెచ్చుకోదగినదిగా ఉండాలి

11, 12. దేవుని వాక్యాన్ని మనం సరిగా ఉపదేశించడంపై మన ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుంది?

11 దేవుని వాక్య సత్యాలను బోధిస్తూ దానిని సరిగా ఉపదేశించడంకంటే మనమింకా ఎక్కువే చేయాలి. మన ప్రవర్తన మన ఉపదేశానికి తగ్గట్టుగా ఉండాలి. ‘మనం దేవుని జతపనివారము,’ కాబట్టి మనం వేషధారులమైన పనివారిగా ఉండకూడదు. (1 కొరింథీయులు 3:9) దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?” (రోమీయులు 2:21, 22) అందువల్ల, నేటి దేవుని పనివారిగా దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి ఒక మార్గం ఈ హెచ్చరికను లక్ష్యపెట్టడమే: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6.

12 దేవుని వాక్యమును సరిగా ఉపదేశించడం నుండి మనమెలాంటి ఫలితాలు ఆశించవచ్చు? యథార్థహృదయుల జీవితాలపై దేవుని లిఖిత వాక్యం చూపగల శక్తిని పరిశీలించండి.

దేవుని వాక్యానికి మార్చే శక్తి ఉంది

13. దేవుని వాక్యం చర్చాంశానికి ఎలా మద్దతు ఇస్తుందో చూపించడం ఒక వ్యక్తిలో ఏమి కలిగించగలదు?

13 దేవుని వాక్య సందేశం అధీకృతమని అంగీకరించినప్పుడు, ప్రజలు తమ జీవితాల్లో గమనార్హమైన మార్పులు చేసుకొనేందుకు వారికి సహాయం చేసే బలమైన ప్రభావం అది వారిపై చూపిస్తుంది. పౌలు దేవుని వాక్య క్రియాశీలతను గమనించడంతోపాటు, ప్రాచీన థెస్సలొనీకలో క్రైస్తవులుగా మారిన వారిపై అది చూపిన ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశాడు. అందువల్ల ఆయన వారికిలా చెప్పాడు: “మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.” (1 థెస్సలొనీకయులు 2:13) ఆ క్రైస్తవులకూ, నిజానికి క్రీస్తు నిజ అనుచరులందరికీ అల్ప మానవుల తర్కజ్ఞానం దేవుని మహోన్నత జ్ఞానానికి ఏమాత్రం సాటిరాదు. (యెషయా 55:9) థెస్సలొనీకయులు ‘పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించి’ ఇతర విశ్వాసులకు మాదిరికర్తలయ్యారు.—1 థెస్సలొనీకయులు 1:5-7.

14, 15. దేవుని వాక్య సందేశం ఎంత శక్తిమంతమైనది, ఎందుకు?

14 దేవుని వాక్యానికి మూలాధారమైన యెహోవాలాగే అది కూడా శక్తివంతమైనది. అది తన వాక్కుచేత ‘ఆకాశములు కలుగజేసిన’ “జీవముగల దేవుని” నుండి కలిగినదే కాక, అన్ని సమయాల్లో ఆ వాక్కు ‘అది పంపబడిన కార్యమును సఫలముచేస్తుంది.’ (హెబ్రీయులు 3:12; కీర్తన 33:6; యెషయా 55:11) ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వ్యాఖ్యానించాడు: “దేవుడు తానుగా తన వాక్కు నుండి ఎన్నడూ వేరుపడడు. తనకది పరాయి వస్తువన్నట్టు ఆయన దానిని ఉపేక్షించడు. . . . అందువల్ల ఆ వాక్కు వెడలిన తర్వాత ఏమి జరిగినా పట్టించుకోని మృత పదార్థంగా అదెన్నడూ ఉండదు; ఎందుకంటే అది జీవముగల దేవునితో ఐక్యతాబంధంగా ఉంది.”

15 దేవుని వాక్యం నుండి వెడలే సందేశం ఎంత శక్తిమంతమైనది? దానికి అపారమైన శక్తివుంది. సరైన రీతిలోనే పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”—హెబ్రీయులు 4:12.

16. దేవుని వాక్యం ఒక వ్యక్తిని ఎంత సంపూర్ణంగా మార్చగలదు?

16 దేవుని వాక్య సందేశం “రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా” ఉంటుంది. అందుకే, దానికి దూసుకుపోయే శక్తి ఎంత అపారంగా ఉందంటే, అది మానవుల ఏ సాధనాన్నైనా లేదా పనిముట్టునైనా మించిపోతుంది. దేవుని వాక్యం ఒకరి లోతైన అంతరంగ భాగాల్లోకి దూసుకుపోయి అతని తలంపులను, అతను ప్రేమించేవాటిని ప్రభావితంచేస్తూ మనస్సులో మార్పు తీసుకువచ్చి దైవాంగీకార పనివానిగా తీర్చిదిద్దుతుంది. ఎంత శక్తిమంతమైన పనిముట్టో గదా!

17. దేవుని వాక్యానికున్న మార్చే శక్తిని వివరించండి.

17 ఒక వ్యక్తి తనను గురించి తాను ఏమి అనుకుంటున్నప్పటికీ లేదా ఇతరులకు తానెలా కనబడేలా చేసుకున్నప్పటికీ ఆ వ్యక్తి నిజముగా అంతరంగంలో ఎలాంటివాడో దేవుని వాక్యం బహిర్గతం చేస్తుంది. (1 సమూయేలు 16:7) కొన్నిసార్లు దుష్టుడు కూడా ప్రయోజనకారియనే లేదా భక్తిపరుడనే ముసుగు ధరించి తన అంతరంగ స్వభావాన్ని మరుగుచేయవచ్చు. కీడు చేసేవారు తమ దుష్ట పన్నాగాల కోసం కపట వేషాలు ధరిస్తారు. గర్విష్ఠులు ప్రజల మెప్పుపొందాలని వాంఛిస్తూ నక్కవినయాలు పోతారు. కానీ దేవుని వాక్యం నిజానికి ఒక వ్యక్తి హృదయంలోవున్నదేమిటో బహిర్గతంచేస్తుంది, అయితే అది వినయస్థుడు తన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, ‘నీతియు యథార్థమైన భక్తియుగలవాడై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావం ధరించుకోవడానికి’ అతనిని శక్తిమంతంగా పురికొల్పుతుంది. (ఎఫెసీయులు 4:22-24) దేవుని వాక్య బోధలు పిరికి హృదయులను సహితం ధైర్యవంతులైన యెహోవాసాక్షులుగా, ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా మార్చివేయగలవు.—యిర్మీయా 1:6-9.

18, 19. ఈ పేరాల ఆధారంగా లేదా మీ వ్యక్తిగత క్షేత్రసేవా అనుభవం ఆధారంగా, లేఖన సత్యం ఒక వ్యక్తి దృక్పథాన్ని ఎలా మార్చగలదో చెప్పండి.

18 దేవుని వాక్యానికున్న మార్చే శక్తి ప్రతీచోట ప్రజలపై మంచి ప్రభావం చూపింది. ఉదాహరణకు, కంబోడియాలోవున్న ఫోనామ్‌ ఫెన్‌ నుండి వచ్చిన రాజ్య ప్రచారకులు కామ్‌పొంగ్‌ ఛామ్‌ పాలిత ప్రాంతంలో నెలకు రెండుసార్లు ప్రకటించేవారు. ఓ స్థానిక మహిళా ఫాదిరీ, ఇతర పాస్టర్లు యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా మాట్లాడ్డం విన్న తర్వాత, ఈసారి సాక్షులు మళ్లీ వచ్చినప్పుడు వారిని కలిసే ఏర్పాటు చేసుకుంది. ఆమె సెలవు దినాలను ఆచరించడం విషయంలో వారిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించి, వారు లేఖనాలనుండి తర్కిస్తుండగా శ్రద్ధగా విన్నది. ఆ తర్వాత ఆమె ఇలా అంది: “మీ గురించి నా తోటి ఫాదిరీలు చెప్పింది నిజం కాదని నాకిప్పుడు తెలిసింది. మీరు బైబిలు ఉపయోగించరని వారు వాదించారు, కానీ మీరీ ఉదయం దానినే ఎక్కువగా ఉపయోగించి మాట్లాడారు.”

19 ఫాదిరీ స్థానం నుండి తొలగించబడతావనే బెదిరింపులకు లొంగకుండా ఈ స్త్రీ సాక్షులతో తన బైబిలు చర్చలు కొనసాగించింది. తన ఈ లేఖన చర్చాంశాలను ఒక స్నేహితురాలికి చెప్పగా ఆమె కూడా సాక్షులతో బైబిలు అధ్యయనం ఆరంభించింది. ఈ స్నేహితురాలు తాను నేర్చుకుంటున్న వాటినిబట్టి ఎంత ఉత్సాహం కనబరిచిందంటే, చర్చిలో నిర్వహించబడుతున్న ఒక కార్యక్రమంలో, “రండి, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయండి” అని చెప్పగలిగింది. ఆ తర్వాత కొద్దికాలానికే, మాజీ ఫాదిరీ అలాగే మరితరులు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ఆరంభించారు.

20. ఘానాకు చెందిన ఒక స్త్రీ అనుభవం దేవుని వాక్యానికున్న శక్తిని ఎలా ఉదహరిస్తోంది?

20 ఘానాకు చెందిన పౌలీనా అనే స్త్రీ విషయంలో కూడా దేవుని వాక్యపు శక్తి ఉదహరించబడింది. ఒక పూర్తికాల ప్రచారకురాలు ఆమెతో నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్నుండి బైబిలు అధ్యయనం నిర్వహించింది.a పౌలీనా బహుభార్యత్వపు వివాహబంధంలో ఉన్నందున మార్పులు చేసుకోవలసిన అవసరముందని గ్రహించింది, అయితే ఆమె భర్త, బంధువులందరూ ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్నత నాయస్థాన జడ్జి, చర్చి పెద్ద అయిన ఆమె తాతగారు మత్తయి 19:4-6ను తప్పుగా అన్వయిస్తూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఆ జడ్జి మాటలకు తిరుగులేదని అనిపించినా, ఇది సాతాను యేసును శోధించినప్పుడు లేఖనాలను వక్రీకరించిన విధంగానే ఉందని పౌలీనా వెంటనే గ్రహించింది. (మత్తయి 4:5-7) మానవులను దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీని సృష్టించాడే తప్ప ఒక పురుషునికి ఇద్దరు స్త్రీలను సృష్టించలేదని, వారిద్దరే ఏక శరీరం అవుతారు గాని ముగ్గురు ఏక శరీరులు కాలేరని చెబుతూ వివాహం గురించి యేసు స్పష్టంగా పలికిన మాటలను ఆమె జ్ఞాపకం చేసుకుంది. ఆమె తన నిర్ణయానికి కట్టుబడి చివరకు బహుభార్యత్వపు వివాహంనుండి ఆచారబద్ధంగా విడాకులు పొందింది. త్వరలోనే ఆమె బాప్తిస్మం తీసుకొని సంతోషభరిత రాజ్య ప్రచారకురాలయ్యింది.

దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ సరిగా ఉపదేశించండి

21, 22. (ఎ) రాజ్య ప్రచారకులుగా మనమే తీర్మానం చేసుకోవాలని కోరుకుంటాం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

21 దేవునికి సన్నిహితమయ్యేందుకు తమ జీవితాలను మార్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయడంలో దేవుని లిఖిత వాక్యము మనకు నిజంగా ఒక శక్తిమంతమైన పనిముట్టుగా ఉపయోగపడుతుంది. (యాకోబు 4:8) సత్ఫలితాలు సాధించడానికి నైపుణ్యతగల పనివారు పనిముట్లను ఎలా ఉపయోగిస్తారో, అదే రీతిలో రాజ్య ప్రచారకులుగా మనకు దేవుడిచ్చిన పనిలో దేవుని వాక్యమైన బైబిలును నైపుణ్యంగా ఉపయోగించడానికి మనఃపూర్వక ప్రయత్నం చేయాలనేదే మన తీర్మానమై ఉండును గాక.

22 శిష్యులనుచేసే మన పనిలో లేఖనాలను మనం మరింత ఫలవంతంగా ఎలా ఉపదేశించవచ్చు? దానికి ఒక మార్గం ఒప్పింపజేసే బోధకులుగా మన సామర్థ్యాలను వృద్ధిచేసుకోవడమే. మీరు దయచేసి తర్వాతి ఆర్టికల్‌ వైపు మీ అవధానం మళ్లించండి, ఎందుకంటే అది ఇతరులకు రాజ్య సందేశాన్ని బోధించడానికీ దాన్ని అంగీకరించేందుకు వారికి సహాయం చేయడానికీ మార్గాలను సూచిస్తుంది.

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీకు గుర్తున్నాయా?

• రాజ్య ప్రచారకులకు ఏ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి?

• రాజ్య పనివానిగా పౌలు ఏయే విధాలుగా ఒక మాదిరిగా ఉన్నాడు?

• దేవుని వాక్యమును సరిగా ఉపదేశించడంలో ఏమి ఇమిడివుంది?

• యెహోవా లిఖిత వాక్యము ఎంత శక్తిమంతమైన ఉపకరణం?

[10వ పేజీలోని చిత్రాలు]

రాజ్య ప్రచార పనిలో క్రైస్తవులు ఉపయోగించే కొన్ని పనిముట్లు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి