కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 1 పేజీ 15
  • మనస్ఫూర్తిగా క్షమించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనస్ఫూర్తిగా క్షమించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • క్షమించడం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 1 పేజీ 15

ఇప్పటికీ ఉపయోగపడే అప్పటి మాటలు

మనస్ఫూర్తిగా క్షమించండి

అప్పటి మాట: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ... ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.”—కొలొస్సయులు 3:13.

వద్దు అన్నట్లు కోపగా చెయ్యి చూపిస్తూ ఒకామె మరో ఆమె దగ్గరనుడి వెళ్లిపోతుది

అంటే ఏంటి? బైబిల్లో పాపాన్ని అప్పు తీసుకోవడంతో, క్షమించడాన్ని అప్పును వదులుకోవడంతో పోల్చారు. (లూకా 11:4) లేఖనాల్లో “క్షమించడం” అని అనువదించిన గ్రీకు పదానికి “అప్పు తీర్చమని బలవంతం చేయకుండా వదిలేయడం” అనే అర్థం ఉందని ఓ పుస్తకం చెప్తుంది. కాబట్టి ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు వాళ్లను క్షమించాలనుకుంటే వాళ్లు చేసినదాన్ని పూర్తిగా వదిలేస్తాం. తిరిగి మన కోసం వాళ్లు ఏదైన చేయాలి అని అసలు కోరుకోం. అంటే దానర్థం వాళ్లు చేసింది తప్పు కాదనో లేక దానివల్ల మనకు బాధ కలుగలేదనో కాదు. బదులుగా, మనకు “హాని” కలిగినా మన కోపాన్ని వదిలేస్తున్నామని అర్థం.

ఇప్పటికీ ఉపయోగపడుతుందా? మనుషులుగా మనందరం పాపం చేస్తాం. (రోమీయులు 3:23) ఈ రోజు కాకపోయినా రేపు మనం కూడా ఏదోక తప్పు చేస్తాం అప్పుడు మనకూ క్షమాపణ అవసరం కాబట్టి మనం వేరేవాళ్లను క్షమించడానికి ముందుండడం తెలివైన పని. పైగా క్షమించేస్తే మనకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఎలా?

ఇద్దరు స్త్రీలు కౌగిలిచుకుటున్నారు

పగని, కోపాన్ని పెంచుకుని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటాం. ఎందుకంటే వీటన్నిటి వల్ల మనకున్న సంతోషం దెబ్బతింటుంది, మనం స్వేచ్ఛగా ఉండలేం, కృంగిపోతాం. ఆరోగ్యం కూడా పాడైపోవచ్చు. జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ అనే పత్రికలో డాక్టర్‌ యోయీచీ చీడా, సైకాలజీ ప్రొఫెసర్‌ ఆండ్రూ స్టెప్‌టో కలిసి రాసిన రిపోర్ట్‌లో ఇలా ఉంది: “కోపానికి, ద్వేషానికి గుండె జబ్బుతో చాలా ప్రమాదకరమైన సంబంధం ఉందని పరిశోధనలు చూపిస్తున్నాయి.”

క్షమిస్తే వచ్చే ప్రయోజనాలు చూడండి. మనం క్షమిస్తూ ఉంటే ఐక్యతను, శాంతిని కాపాడతాం, అప్పుడు మన మధ్య ఉన్న బంధాలను కూడా కాపాడుకుంటాం. తప్పులు ఒప్పుకుని క్షమాపణ కోరినవాళ్లను దేవుడు క్షమిస్తాడు. మనం కూడా అలానే క్షమించాలని కోరుకుంటున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అలా చేసినప్పుడు మనం దేవుని అడుగుజాడల్లో నడిచిన వాళ్లం అవుతాం.—మార్కు 11:25; ఎఫెసీయులు 4:32; 5:1. ▪ (w15-E 10/01)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి