ఆత్మీయ గమ్యముల దిశగా మీరు ఒక కుటుంబముగా పనిచేయుచున్నారా?
1 సమర్పిత ప్రజలుగా మనము యెహోవాను నమ్మకముగా సేవించు గమ్యమును కలిగియున్నాము. అంతేకాకుండ మనము నిత్యజీవమను బహుమతిని పొందుటకు ఆసక్తితో ఎదురుచూచుచున్నాము. మనము కేవలము మన స్వంత యథార్థత మరియు రక్షణయందు మాత్రమే శ్రద్ధను కలిగిలేమనుకోండి. ఇతరులును ఈ గమ్యములను చేరుటకు సహాయము చేయవలెనని కోరుదుము. ప్రత్యేకముగా మన స్వంత కుటుంబమునకు సహాయము చేయవలెనని కోరుకొందుము.—యోహా. 1:40, 41; 1 తిమో. 5:8.
2 ఒక్కొక్క మెట్టుగా పర్వతమును ఎట్లు ఎక్కుదుమో, అదే విధముగా మన క్రైస్తవ విధానమందును ఒక్కొక్క మెట్టు అభివృద్ధి సాధించగలము. దీనికొరకు మనము ఆత్మీయ గమ్యములను ఏర్పాటుచేసికొందుము. ఇది కేవలము ఆయా వ్యక్తులకు మాత్రమే పరిమితము కాదు. కూటములు, ప్రాంతీయ సేవ, కుటుంబ పఠనము సంబంధముగా కుటుంబములుకూడ గమ్యములను కలిగియుండవచ్చును. అభివృద్ధి పరచవలసినవి ఏమైనా కలవా? కుటుంబములోని కొందరు సభ్యులు పూర్తికాల సేవకు చేరుకొనునట్లు సహాయపడగలమా? తీర్మానించుకొనిన గమ్యములను చేరుకొనుటకు కుటుంబ చర్చ సహాయపడగలదు. వీటిని చేరుకొనినప్పుడు, వేరే దైవపరిపాలనా గమ్యములను ఏర్పాటుచేసికొనవచ్చును. ఆ విధముగా ఒక్కొక్క మెట్టుగా, ఆత్మీయ అభివృద్ధిని సాధించవచ్చును.
కూటములు
3 కొన్ని కుటుంబములు కూటములకు సరియైన సమయమునకు చేరుకొను గమ్యమును పెట్టుకొను అవసరముండవచ్చును. పెద్ద కుటుంబములు గలవారికి, కష్టమైన పని సమయములుండు వారికి, రవాణా సౌకర్యముయొక్క సమస్య ఉన్నవారికి ఇది ఒక నిజమైన సవాలు కాగలదు. సహకారము మరియు మంచి వ్యవస్థీకరణ అవసరము.
4 కుటుంబము ఆలోచించవలసిన మరొక అభ్యాససిద్ధమైన గమ్యమేమనగా కూటములలో వ్యాఖ్యానించుట. కుటుంబములోని కొందరు సభ్యులు చిన్న వ్యాఖ్యానమును చదువుటకు ఇష్టపడవచ్చును. అయితే, స్వంతమాటలలో క్లుప్తముగా సూటిగా సమాధానము చెప్పుట వారి ఆత్మీయ అభివృద్ధిని సూచించును మరియు అది ఫలదాయకము. తమ వ్యాఖ్యానములను తయారుచేసికొనుటలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయము చేసికొనవచ్చును. దైవపరిపాలనా పాఠశాలలో అభివృద్ధిని సాధించుటకుకూడ వారు ఒకరికొకరు సహాయపడవచ్చును. దీనియందు కుటుంబ సభ్యులలోని చిన్నవారిని వినుట, వారికివ్వబడిన ప్రసంగములను అభ్యాసము చేయించుట, అవుట్లైన్ను ఎలా ఉపయోగించాలో చూపించుట, వారి ఉచ్ఛారణను సరిచేయుట వగైరాలు చేరియుండును. మంచి బోధకునిగా లేక అందరిలోను చక్కగా చదువువానిగా (పబ్లిక్ రీడర్) తయారు కావలెనను గమ్యము పట్టుదలతో చేయగల మిగుల విలువైన సంగతియై యున్నది.
ప్రాంతీయ సేవ
5 కొన్ని కుటుంబములు ప్రాంతీయ సేవలో క్రమమును సాధించవలసిన అవసరముండును. మీ కుటుంబమంతయు ప్రతినెల ప్రాంతీయసేవలో పాలుపంచుకొనుచున్నదా? కుటుంబ సభ్యులు ప్రస్తుత సంభాషణ అంశమును లేక క్రొత్త పత్రిక అందింపుగా చేయుటకు నేర్చుకొనునట్లు సహాయపడు గమ్యము విషయమేమి? గృహబైబిలు పఠనమును ప్రారంభించు గమ్యము కూడ కలదు లేక ఇదివరకే స్థాపించబడిన బైబిలు పఠనమును మరింత క్రమముగా నిర్వహించు గమ్యమును కలిగియుండవచ్చును.
కుటుంబ పఠనము
6 కొన్ని కుటుంబములకు కుటుంబ పఠన నియమిత ఏర్పాటుకు నమ్మకముగా హత్తుకొనియుండుట ఒక నిజమైన సవాలుగా యుండవచ్చును. కొన్ని సందర్భములలో పఠనమును తిరిగి ఏర్పాటు చేసికొనుట అవసరమైయుండును. అయితే ఇది ఎప్పుడో ఒకసారి చేయవలసియుండును. క్రమముగా ప్రతివారము ఏర్పాటు చేయబడిన బైబిలు అధ్యాయములను చదువుట మరొక చక్కని గమ్యము. బహుశ దీనిని కుటుంబ పఠనమందును చేర్చవచ్చును. అనేకమందికి వారముకొరకు ఏర్పాటు చేయబడిన అధ్యాయములను చదువుటకు కేవలము 20 నుండి 25 నిమిషములు మాత్రమే పట్టును. ఇది ఒకని లేఖన పరిజ్ఞానమును ఇనుమడింపజేయును మరియు ప్రతివారము జరుగు బైబిలు ఉన్నతాంశముల పునఃసమీక్ష మరింత ఆసక్తిదాయకము చేయును.
7 ఆయా వ్యక్తులు మరియు కుటుంబములు ఉంచుకొనవలసిన ఇతర గమ్యములు ఇంకను అనేకములు కలవు. ఉదాహరణకు, త్వరలోనే యావత్ కుటుంబము కలిసి సహాయ పయనీరు సేవ చేయు ప్రయత్నము విషయమేమి? దానికితోడు, మంచి వ్యవస్థ మరియు సహకారములతో కుటుంబములో కనీసము ఒక వ్యక్తి క్రమ పయనీరుగా సేవచేయుటకు మద్దతునివ్వగలమా? పరిచారకునిగా, ఒక పెద్దగా తయారగు గమ్యముకూడ కలదు. యౌవనులైన సహోదరులు బేతేలు సేవను గమ్యముగా కలిగియుండవచ్చును. ఈ గమ్యములను సాధించవచ్చును. అయితే దానికి పట్టుదల మరియు కృషి అవసరము. మన వ్యక్తిగత మరియు కుటుంబ గమ్యములను చేరుకొనుటకు మనము ప్రయత్నించుచుండగా, సమస్త ఘనత మరియు మహిమ యెహోవాకు చెందునట్లు మనము ఆయనకు చేయు సేవా నైపుణ్యము పెరుగును.—కీర్త. 96:7, 8.