సువార్తనందించుట—ఆనందముతో
1 యేసుక్రీస్తు తన పరిచర్యయందు గొప్ప ఆనందమును కనుగొనెను. ఆయనకు తన తండ్రి చిత్తమును చేయుటయే ఆహారమైయుండెను. (యోహా. 4:34) అలాగే పౌలు పరిచర్యలోని తన పనినుండి గొప్ప ఆనందమును పొందెను. వారు అనుభవించవలసి వచ్చిన అనేక కష్టములు మరియు హింసలు ఉన్నను, వారు ఆనందమును అనుభవించుటలోని రహస్యమేమి? యెహోవాకు వారు చేయు సేవ పూర్ణాత్మతో కూడినదైయుండెను. దేవునిచే తమకు నియమించబడిన పనియందు వారు కష్టించి పనిచేసిరి. తత్ఫలితముగా వారి శ్రమను బట్టి వారికి ఆనందము లభించెను. (యోహా. 13:17; ప్రక. 14:13) యెహోవాను సేవించుకొలది పరిచర్యలో మీ ఆనందమును మీరెట్లు విస్తరింపజేసుకొనగలరు?
ప్రజలకు సహాయముచేయు ధోరణిలో తలంచుము
2 యేసుక్రీస్తు మరియు పౌలు శ్రేష్టమైన బోధకులై యుండిరి. వినువారి హృదయమును చేరుటకు వారు ఉద్దేశించియున్నారు. అనేకులు ప్రతిస్పందించలేదు. అయితే ప్రతిస్పందించినవారు ఆనందమునకు నిజమైన కారణమైరి. (ఫిలి. 4:1; లూకా 15:7 ను పోల్చుము.) ఔను యెహోవాను గూర్చి నేర్చుకొనుటకు ప్రజలకు సహాయము చేయుట మరియు సత్యము విషయమై వారు స్థానమును తీసుకొనుటను చూచుట మనకు సంతోషమును కలిగించును. మొదటి శతాబ్దములో “అన్యజనులు దేవునివైపు తిరుగుట” “సహోదరులందరికిని మహా సంతోషమును కలుగజేసినది.”—అ. కార్య. 15:3.
3 మీకు తెలిసినదానిని ఇతరులతో నైపుణ్యంగా పంచుకొనుటద్వారా మీరును ఈ ఆనందమును అనుభవించవచ్చును. మనము ఇతరులకు సత్యమును బోధించుకొలది యెహోవా సంస్థ మనకు అత్యంత శ్రేష్టమైన సాధనములను దయచేసియున్నది. ఉదాహరణకు మనకు మన రాజ్య పరిచర్యలో కనుగొనబడు సంభాషణ అంశము ఉన్నది. రీజనింగ్ పుస్తకము కూడా ఉన్నది. దానిలో ప్రజలు అడుగు ప్రాముఖ్యమై ప్రశ్నలకు సమాధానములు మరియు ప్రీతికరమగు ఉపోద్ఘాతములు కూడా ఉన్నవి. మీరు పరిచర్యకు సిద్ధపడునప్పుడు మీ ప్రాంతములో ఉన్నవారికి సహాయపడులాగున మన రాజ్య పరిచర్య మరియు రీజనింగ్ పుస్తకములో ఇవ్వబడిన సూచనలను మీరెట్లు ఉపయోగించగలరను ధోరణిలో తలంచుము. మంచి సంభాషణలను ప్రారంభించుటకు బాగుగా సిద్ధపడియుండుట ద్వారా ప్రజలు రక్షణ మార్గములోకి వచ్చునట్లు సహాయపడుటకై కష్టించి పనిచేయును. అటువంటివి ఫలవంతమైన బైబిలు పఠనములకు నడిపి మనసేవలో గొప్ప ఆనందమును కలుగజేయును.—యాకో. 1:25.
ఒక అనుకూల దృక్పథము
4 మీరు ప్రచారకునిగా సేవచేయుచున్నను లేక పయినీరుగా చేయుచున్నను పరిచర్యయొక్క ఉద్దేశ్యమును మనస్సునందుంచుకొనుము. (మత్త. 24:14; 28:19, 20) సాక్ష్యార్థమై సువార్తను ప్రకటించుట దేవునిచే నియమింపబడిన పనియైయున్నది. అది ఒక ఆధిక్యత, మరియు యెహోవా తన సేవకులనుండి అడుగునది భారమైనది కాదని మనము గుణగ్రహించవలెను. (1 యోహా. 5:3) తన ప్రజలు ఆయన సేవను ఆనందించవలెనని ఆయన కోరుచున్నాడు. కాబట్టి ప్రకటన పనికి కొందరు అనుకూలముగా ప్రతిస్పదించకపోయినను, మీరు ఇంకను పరిచర్యలో ఎక్కువ సంతోషమును కలిగియుండవచ్చును. అలాగున ఎందుకు?
5 యేసు శిష్యులు వారి పరిచర్యలో గొప్ప ఆనందమును కనుగొనిరి. మరియు ఆనందమునకు వారి ముఖ్యమైన కారణమేమైయుండవలెనను దానిని ఆయన వారికి వివరించెను. (లూకా 10:17-20) భూసంబంధమైన నిరీక్షణ కలిగిన “గొప్ప సమూహము” వారు కూడా ఆనందించుటకు ప్రతికారణమును కలిగియున్నారు. (ప్రక. 7:9,10) మీ నిరీక్షణ పరలోకపుదైనను లేక భూసంబంధమైనదైనను వారు దేవుని చిత్తమును చేయుచున్నారను వాస్తవమే మీకు గొప్ప ఆనందమును కలుగజేయవలెను. ఎందుకనగా “ప్రభువునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదు.” (1 కొరిం. 15:58) “మీ కార్యమును ఆయన నామముయెడల మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీ. 6:10) యెహోవాను పూర్ణాత్మతో సేవించుట ఆయనను ప్రేమించువారికి ఆనందమునకు మూలము.—కీర్త. 40:8.
6 ఒక క్రైస్తవుడు తాను దేవునికి చేయుసేవను ఆనందించవలెను. నిజమైన భక్తితో చేయు అతి చిన్న కార్యమునైనను యెహోవా మెచ్చుకొనునను నిశ్చయతగలవారై పరిచర్యలో ఆనందమును కనుగొనుటయందు కొనసాగుము. (మార్కు 12:41-44 ను పోల్చుము.) మనమందరము ‘మన పరిచర్యను ఘనపరుచుట’ అది తెచ్చు ఆనందమును అనుభవించుదుము గాక.—రోమీ. 11:13.