ప్రాంతీయ కాపరి సందర్శనమునకు మద్దతునిమ్ము
1 అక్టోబర్ 15, 1946 నుండి సంఘములు సర్కిట్ (ప్రాంతము)లుగా ఏర్పరచబడి, అవి పూర్తికాల ప్రయాణకాపరులచే సేవించబడేవి. ఈ దైవపరిపాలనా ఏర్పాటునుబట్టి వ్యక్తులు మరియు సంఘములు షుమారు 43 సంవత్సరములనుండి ప్రయోజనములను పొందుచున్నారు. (యెష. 1:26) ఈ ఏర్పాటునకు మద్దతును కొనసాగించుట ద్వారా అనేక ఆశీర్వాదములను పొందగలము.—ఎఫె. 4:7, 8, 11.
ఆ సందర్శనమునకై సిద్ధపాటు
2 ప్రాంతీయకాపరి సందర్శనము ప్రకటించిన వెంటనే దానికి సిద్ధపడుటకు ఆరంభించవచ్చు. ప్రత్యేక కార్యక్రమములతో కూడిన ఆ వారమంతా పూర్తి మద్దతునిచ్చుటకు తగినట్లు మన క్రమమైన జీవన పట్టికను సవరించుటకై పథకమును వేసికొనవచ్చు. కొందరు సువార్తికులు ఆక్సిలరీ పయినీర్ చేయుటచే సేవలో ఎక్కువ కాలము గడిపెదరు. ఇతరుల ఒకటి లేక రెండు రోజులు శెలవులు పెట్టి సేవలో పాల్గొనెదరు. సేవకు సంబంధించిన ఆయా విషయములలో ప్రయాణ కాపరులతోబాటు పనిచేయుటకు అనేకమంది ప్రత్యేక సమయమును ఏర్పాటు చేసికొందురు. ఈ సందర్భములో ప్రాంతీయసేవకు హృదయపూర్వకముగా మద్దతునిచ్చుట అనేక బహుమానములను తెచ్చును.
3 సాయంత్రం, పునర్దర్శనములకు, బైబిల్ పఠనములకు గడుపవచ్చునని ప్రాంతీయకాపరి రిపోర్టులు తెలియజేయుచున్నవి. ఆ వారములో సాయంత్రం పునర్దర్శనములకు లేక ఒక బైబిల్ పఠనమునకు వెళ్లుటకు ఏర్పాటు చేసికొనగలవా? నీతో వచ్చుటకు ప్రాంతీయకాపరి సంతోషముతో అంగీకరించును, నీవు ఇష్టపడితే నీ పఠనమును జరిగించుటకు కూడ సంతోషించును.
వ్యక్తిగత సహాయము
4 ప్రాంతీయకాపరి వద్దనుండు ప్రాధాన్యతనిచ్చు అంశముల లిస్టులోని పైని ఉండునది, అధిక బాధ్యతలతో కూడిన సేవలకు సమీపించు వానికెవరికైనా అదనపు తర్ఫీదునిచ్చు అవసరత. (1 తిమో. 3:1) నీ యొక్క ప్రత్యేక కర్తవ్యములు లేక బాధ్యతలను గూర్చి నీకు ప్రశ్నలున్నవా? నీ సామర్థ్యము మరియు వ్యక్తిగత నిర్వహణ యందు అభివృద్ధిని కోరుచున్నావా? బేతేలు సేవయందు లేక గిలియడ్ యందు ఆసక్తి కలిగియున్నవా? ఎక్కువ సేవ అవసరమగు ప్రదేశములో, నీ ప్రాంతములో లేక ఇండియాలో ఏ ప్రాంతములోనైనా, సేవచేయుటకు ఇష్టపడు చున్నావా? నీ ఆత్మీయ గమ్యములేవైనా సరే నీతో తర్కించుటకు ప్రాంతీయ కాపరి సంతోషించును.
5 మీ ప్రాంతీయ కాపరి వివాహితుడయనట్లయితే, ఆయన భార్య అతని వలె యెహోవాకు సమర్పించుకొనిన సేవకురాలు. ఆమె తప్పక ఒక పయినీర్ అయి ఉండును. మరియు ప్రాంతీయ సేవా ఏర్పాట్లకు పూర్తి మద్దతునిచ్చును. ఆమె అనుభవమును బట్టి క్రమముగా ప్రాంతీయసేవలో వివిధ ప్రాంతములలో పాల్గొనుటనుబట్టి సువార్త పనిలో మంచి నైపుణ్యమును కలిగియుండును. ఆమె ముఖ్యముగా ఇతర సహోదరీలతో కలిసి పునర్దర్శనములకు మరియు బైబిల్ పఠనములకు వెళ్లుటకు ఇష్టపడును. ఫీబేను గూర్చి పౌలు మెచ్చుకొనినట్లు ఆమె కూడ అట్టి మెప్పుకు అర్హురాలు.—రోమా. 16:1, 2.
6 ప్రాంతీయ కాపరికి మరియు వివాహితుడయితే ఆయన భార్యకు ఆతిథ్యమునిచ్చు ఆధిక్యత నిర్లక్ష్యము చేయకూడనిది. అనేక మంది సహోదరులు తమ గృహములను తెరచి లేక ఈ ప్రయాణకాపరితో కలసి భోజనము చేసి సహవాసమును అనుభవించుట ద్వారా ఆ జ్ఞాపకములను మరియు ప్రోత్సాహమును ప్రయోజనముగా పొందిరి.—3 యోహా. 5-8.
7 ఆత్మీయముగా పరిపక్వము చెందిన ప్రయాణకాపరుల క్రమమైన సందర్శనములు యెహోవా ప్రజలకు ఎంతో సహాయము. ప్రాంతీయకాపరి సందర్శనమునకు మద్దతునిచ్చుటకు మనము ఎంత సిద్ధపడితే ఆ ఏర్పాట్లనుండి వ్యక్తిగతముగా అంత ప్రయోజనము పొందెదము. మన ప్రాంతీయకాపరి యొక్క తదుపరి సందర్శనమునకు మనమందరము పూర్తి మద్దతునిచ్చుటకు నిశ్చయించుకొందము.