వృద్ధియైన పత్రికా అందింపుల ద్వారా ఆనందమును పొందుట
1 యెహోవా యొక్క గొప్ప విశ్వసంస్థ దాని ఉత్పత్తికి పేరుగాంచినది. యిష్టపూర్వకమైన మరియు ఫలభరితులైన పనివారలతోనే నిండిన ఒక భూసంస్థను కూడా యేసుక్రీస్తుద్వారా, యెహోవా వృద్ధిచేశాడు. (కీర్తన. 110:3; మత్తయి 9:37,38) మన పరిచర్యయొక్క, ప్రమాణానికి మరియు పరిమాణానికి మనము శ్రద్ధ నిచ్చినప్పుడు తప్పక మన ఆనందము వృద్ధికాగలదు. (లూకా 10:17) అయితే వాచ్‌టవర్ మరియు ఆవేక్! పత్రికల అందింపులో మనం వ్యక్తిగతంగా వృద్ధిని చూపాలని మనస్సులో నిర్ణయించుకొనిన అది ప్రత్యేకంగా నిజము కాగలదు.
2 దూర ప్రాంతాలకు కూడా రాజ్యవర్తమానమును వ్యాపింపచేసిన ముఖ్యమైన మార్గములలో పత్రికలను పంచుట ఒకటైయుంది. ప్రకటన పని విస్తరించుకొలది అది యిప్పటికిని నిజమే అవుచున్నను, కొన్ని ప్రాంతములలో పత్రికల అందింపు తక్కువ అవుతున్నట్లు గుర్తించబడియున్నది. ఈ పరిస్థితి ఎట్లు పరిష్కరించబడగలదు? వ్యక్తిగతంగా ఎక్కువ పత్రికలను అందించులాగున మన మనస్సునందుంచుకొనవలసిన కొన్ని ముఖ్య విషయాలేమి?
అనుకూల దృష్టితో సమీపించుట
3 వృద్ధికాగల అందింపుకు ప్రధమమెట్టు ఏమనగా: పత్రికా మనస్సు గలవారైయుండుట. అయితే మనకై మనము వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలను క్రమముగా చదువువారమైనప్పుడు ఈ గురిని చాలా సులభంగా చేరవచ్చును. ఒకసారి అందలి విషయాలతో పరిచయస్థులమైనప్పుడు వాటిని ప్రజలకు అందించుటకు తగిన ప్రతి అవకాశమును ఉపయోగించ మనము యిష్టపడతాము. యింటింటికి పత్రికలను పంచుటకు మనలో ఎక్కువమందికి ప్రతి శనివారము ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది. ప్రాంతీయసేవలో శనివారం పనిచేయుటకు వీలులేని ప్రచారకుల కొరకై అనేక సంఘాలు వారము మధ్యలో ఈ మాగజైన్ పనికొరకు సమయమును కేటాయించుచున్నవి. యింటింటికి మాగజైన్లను అందించుటకు సాయంకాల సాక్ష్యము చాలా శ్రేష్టమైన అవకాశంగా అనేకులు కనుగొనవచ్చును. వీధిపని, దుకాణము నుండి దుకాణమునకు వెళ్తూ చేయుపని, యాధృచ్చికమైన సాక్ష్యము, మరియు మాగజైన్ రూట్లన్నియు మనము పత్రికలను అందించుటకు శ్రేష్టమైన మార్గములైయున్నవి. క్రమమైన యింటింటి పనిలో ఆ నెల అందింపును తిరస్కరించినట్లయిన అతి క్రొత్త పత్రికలను అందించవచ్చును. అలా చేయుటలో మెలకువను కలిగియుండుట మనకు సంతోషమును తెచ్చును.
4 మన పత్రికా అందింపును వృద్ధి చేయుటకు రెండవ సలహా ఏమనగా: “దానిని చాలా సామాన్యమైన దానిగా చేయుము.” కొందరు ప్రచారకులు చాలా దీర్ఘమైన ప్రసంగమును యిచ్చుట ద్వారా అసలు మాగజైను అందింపు ఉద్దేశ్యమును దాటి వెళ్లుదురు. మాగజైను పనిలో పాల్గొనునప్పుడు కొందరు ప్రచారకులు సంభాషణా అంశమును ఉపయోగించారు. ఏమైనను, ఇది సిఫారసు చేయబడుటలేదు. విస్తారమైన మాగజైన్ అందింపును ప్రోత్సహించునప్పుడు 1956 డిశంబరు 1, వాచ్‌టవర్ ఇలా చెప్పినది: “పత్రికలను అందించునప్పుడు చాలా చిన్నదైన మరియు సూటిగా అంశమును తెల్పు ప్రసంగము అత్యంత శ్రేష్టము. గురి ఏమనగా ఎక్కువ కాపీలను అందించుట. వాటికై అవే ‘మాట్లాడుతాయి.’ సొసైటీ సలహా యిచ్చునదేమనగా అర్ధ నిముషమునుండి ఒక్క నిముషపు లోపు ప్రసంగము అందించు మాగజైనులో చర్చించబడిన ఒక అంశమును గూర్చిన మంచి మాటలతో నిండిన ఒక వాక్యము.”
5 తరువాత: అనేక అంశములను గూర్చి సులభముగా చెప్పగలుగుటకు సిద్ధముగా యుండుము. ఒకటి కన్న ఎక్కువ ప్రసంగములను సిద్ధపడియుండుము. అన్ని రకముల ప్రజలతో నీవు మాట్లాడగలిగి, వారి ఆసక్తికి తగినట్లు ప్రసంగమును అందించగలవు. ఇలాంటి ముందు సిద్ధపాటు వృద్ధియైన పత్రికా అందింపునకు, మరియు మిక్కిలి సంతోషమునకు నడుపగలదు.
6 ఒక చివరి సలహా: ఒక వ్యక్తిగత గురిని పెట్టుకొనుము. ఈ విషయము 1984 ఏప్రిల్ నెల మన రాజ్య పరిచర్యలోని “పత్రికలు జీవ మార్గమును సూచించును” అను ఇన్సర్ట్లో నొక్కి చెప్పబడినట్లు నీవు జ్ఞప్తికి తెచ్చుకొనవచ్చును. నెలలో సేవలోయున్న ప్రతి గంటకు సగటున ఒక పత్రికను అందించునట్లు నీవు పోరాడవచ్చును. నీ పరిస్థితులనుబట్టి ప్రాంతీయ సేవలో నీవు గడుపగల సమయమునుబట్టి నీ వ్యక్తిగత గురి కారణ సహితముగా వుండవలెను.
7 పరిచర్యలో మన భాగమును వృద్ధి చేసుకొనునట్లు మనకు అవసరమైన దానిని యెహోవా తన దృశ్యమైన సంస్థద్వారా అందిస్తూ యున్నాడు. పనిచేయుటకు ఉల్లాసభరితమైన పత్రికలను మనము కల్గియున్నాము. అయితే పత్రికలను పంచుటకు సంఘము చేయు ఏర్పాటులతో సహకరించుటకు మన వ్యక్తిగత ప్రయత్నం యిప్పుడు దృశ్యములోనికి వస్తుంది. అట్టి కార్యము యెహోవాను మహిమ పరచును గనుక పరిచర్యలో పత్రికలతో మనము వహించు అభివృద్ధికర భాగముచే వచ్చు మిక్కిలి లోతైన సంతోషమును మనము అనుభవించగలము.—యోహాను 15:8.