సువార్తనందించుట—యౌవనులకు
1 సాధారణముగా ఈ ఆధునిక యుగము యౌవనస్థులకు చాలా కష్టతరమైన కాలముగా తయారైనది. అయినను శతాబ్దముల క్రితము దేవునిచే ప్రేరేపింపబడిన ఒక వ్యక్తి ఈ విధంగా వ్రాశాడు: “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ది చేసికొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?” (కీర్తన 119:9) నిజముగా, యెహోవా వాక్యముపైన ఆధారపడిన నడిపింపు ఈనాడు వేలకొలది యౌవనులకు ప్రయోజనము కలుగజేయుచున్నది.
2 అవేక్!లోని “యంగ్ పీపుల్ ఆస్క్ . . . ” శీర్షికలలో ఒకదానిని చదివిన తరువాత ఒక యౌవనుడు యిలా చెప్పాడు: “కేవలము చేయదగినది అదే అనుకొనినందున క్రమముగా నేను డేటింగ్ (స్త్రీ, పురుషులు ఒంటరిగా కలసి తిరుగుట) నందు పాల్గొనుచుంటిని. వివాహమునుగూర్చి ఎంత మాత్రము తలంచలేదు. తరువాత మీ అవేక్ పత్రికను చదివాను. అది నా విలువలను శ్రేష్టతను మార్చి వేసినది. వివాహమునకు సిద్ధమయ్యేంతవరకు నేను డేటింగ్‌ను మానివేశాను.” నిశ్చయముగా ఇవ్వబడిన ఆచరణాత్మక సలహా నుండి తాను ప్రయోజనము పొందాడు. ప్రస్తుతము యౌవనస్థులు కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అను నూతన పుస్తక రూపములో ప్రచురింపబడిన లేఖన సమాచారపు విలువగలిగిన మూలమును పొందుటకు మంచి అనుకూలతను కల్గియున్నారు. మీ ప్రాంతములోని యౌవనులకు లేక పాఠశాలలోని యువకులకు దానిని అందించుటకు నీవేమి చేయుదువు?
యౌవనుల యెడల శ్రద్ధ తీసుకొనుము
3 యెహోవా వాక్యపు విలువను గుణగ్రహించునట్లు యౌవనులను వెంటాడుట సవాలు పూర్వకమైనది. (సామెతలు 22:15ను చూడుము.) ఏమైనను అపొస్తలుడైన పౌలు “యూదులను సంపాదించుకొనుటకు, యూదునివలె ఉంటిని,” అని చెప్పెను. (1 కొరిం. 9:20) అలాగే యువకులు యోగ్యదాయకమైన ఆత్మీయ నడిపింపును కనుగొని దానిని గుణగ్రహించునట్లు సహాయపడుటకు మీరు యౌవనులను వారి సమస్యలను అర్థము చేసికొనవలెను. పాఠశాలయందు, వారి జీవించుచోట లేక పనియందు యౌవనులకు ఏది ఆసక్తిదాయకమైనదో అను దానినిబట్టి మీరు తలంచవలెను. యువకులకు సాక్ష్యమిచ్చునప్పుడు ఈ గ్రహింపు నీ ఉపోద్ఘాతములందును, నీ వ్యాఖ్యానములందును, మరియు మీ ప్రశ్నలందును ప్రతిబింబించవలెను. క్రొత్త పుస్తకమైన యంగ్ పీపుల్ ఆస్క్‌లోని విషయసూచిక దేనినిగూర్చి మాట్లాడవలెనను తలంపులనిచ్చుటకు శ్రేష్టమైన మూలమైయున్నది. ఈ అంశములతో పరిచయము కలిగియుండుటద్వారా ఈనాడు అనేకమంది యౌవనులు దేనిని తలస్తున్నారను దానియెడల నీవు వివేకమును కలిగియుండగలవు.
నీవేమి చెప్పవచ్చును
4 ఇంటింటికి వెళ్లునప్పుడు పిల్లలున్న చోటును గమనించుము. ప్రతిదిన సమస్యలను ఎదుర్కొనుటయందు ప్రజలకు సహాయపడుటకై నీవు ప్రజాసేవ చేయుచున్నావని వివరించుము. ఈ గృహములలో నీవు పిల్లలతోనే మాట్లాడగలగవచ్చును. బైబిలులో కనుగొనబడు ఆచరణాత్మక సలహాయొక్క ఒక ఉదాహరణను చూపించుము. కీర్తన 119:9 యొక్క సత్యత్వమును వారు చూచునట్లు సహాయపడుట నీ గురియని మనస్సునందుంచుకొనుము.
5 ఒక యౌవనస్థునితో నీవు మాట్లాడునప్పుడు, స్నేహపూర్వకంగాయుండి ఆయనను ఘనముగా చూడుము. ముందు అభినందించిన తరువాత నీవిట్లనవచ్చును: “ఈ ప్రాంతములో నీలాంటి యౌవనస్థులు ఎదుర్కొంటున్న సమస్యల విషయములో సహాయపడుటకు ఒక ప్రజాసేవలో నేను పాల్గొంటున్నాను. నీవు నిజముగా చేయగోరనిదానిని చేయుటకు ఒత్తిడి చేయబడుటను నీమట్టుకు నీవు కనుగొన్నావా? కొన్నిసార్లు నీకై నీవు కాకుండా ఇతరులు చేయుచున్నందున చేయగోరుతున్నావా? అట్టి సమకాలికుల వత్తిడినెట్లు ఎదుర్కొనవలెనని ఎప్పుడైన ఆశ్చర్యపడినావా?” ఆయన సమాధానము తరువాత, పుస్తకమును 9వ అధ్యాయమువైపు త్రిప్పుము. తరువాత ఇట్లనుము: “దయచేసి ఈ నూతన సాహిత్యము పేజి 77నందు ఏమి చెప్పుచున్నదో గుర్తించుము. [తగిన పేరాగ్రాఫ్‌ను చదువుము.] ఈ సమస్యను ఎదుర్కొనుటకు యౌవనులకు బైబిలు పఠనము సహాయపడుతుందని నీవు తలంతువా? [వ్యాఖ్యానించనిమ్ము.] కీర్తన 119:9లో బైబిలు ఏమి చెప్పుచున్నదో గమనించుము. ఈ పుస్తకము విషయసూచికయందు సూచించబడినటువంటి క్లిష్టమైన పరిస్థితులను యౌవనులెట్లు ఎదుర్కొనవలెనో చూపుతున్నది. [పుస్తకము చేతికిమ్ము] 15 రూ.ల చందాకు ఇది మీరు తీసుకొనవచ్చును.”
6 మీరు ఇంకను పాఠశాలకు హాజరగు ప్రచారకులైనట్లయిన, 1989 సెప్టెంబరు మన రాజ్య పరిచర్యలో యివ్వబడిన సూచనలను అనుకరించుము. అట్లు చేయుటద్వారా నీవు అనేక సంతోషదాయక ఫలములను పొందెదవు.
7 “యెహోవా ఎవరును నశించుటకు యిచ్ఛయించుట లేదు.” (2 పేతు. 3:9, NW) ఇందు యౌవనులు కూడా ఉన్నారు. ఏమైనను అనేకమంది యౌవనులు హార్‌మెగిద్దోను నందు రక్షించబడరు. యౌవనులకు ఫలవంతముగా ప్రకటించుటకు మనము చేయు ప్రయత్నములు యెహోవాకు స్తుతి నిమిత్తమై ఎక్కువమంది యవ్వనుల రక్షణకు దోహదపడునుగాక.