ప్రాంతీయ సేవలో పూర్ణహృదయులై యుండుడి
భాగము 2: ఉత్సాహమును పెంపొందించుట
1 మనము ఆనందించు ఒకానొక కార్యమునుగూర్చి ఉత్సాహపూరితముగా ఉండుట సులభము. అంతేకాకుండ ఒక వ్యక్తి తాను సిద్ధపడిన పనిని చేయుటకు ఆనందించునను విషయము సాధారణముగా సత్యమైయున్నది. మన పరిచర్యను సంపూర్ణముగా నెరవేర్చుటలో అది నిశ్చయముగా సత్యమైయున్నది.—2 తిమో. 4:5.
సిద్ధపాటు ఆవశ్యకము
2 ప్రాంతీయ పరిచర్యలో మన ఉత్సాహము మనము ఎంత చక్కగా సిద్ధపడుచున్నాము మరియు ఎంత తరచుగా మనము సేవకు వెళ్లుచున్నాము అనుదానిపై సూటిగా ఆధారపడియున్నది. ఉదాహరణకు, ఇంటింటి సేవలో మనము కలిసికొను వ్యక్తి తనను ఒక ముస్లీముగా గుర్తించుకొనినట్లయిన, మనమేమి చెప్పగలము? చక్కగా సిద్ధపడిన ప్రచారకుడు ఇట్లు ప్రత్యుత్తరమివ్వవచ్చును: “సంతోషమండి, నేను చాలామంది ముస్లీములతో మాట్లాడును. ఈ పుస్తకములో మీ మతము యొక్క బోధలను కొన్నింటిని నేను ఈ మధ్యనే చదివాను. [రీజనింగ్ పుస్తకములోని 23వ పుటకు త్రిప్పి] మీరు యేసును ఒక ప్రవక్తగా అయితే మహమ్మదును చివరి మరియు అతి ప్రాముఖ్యమైన ప్రవక్తగా నమ్ముదురని ఇది చెప్పుచున్నది. అది నిజము కాదా? [ప్రత్యుత్తరమివ్వనిమ్ము.] మీరు కూడా మోషేను నిజమైన ప్రవక్తగా నమ్ముచున్నారా? [ప్రత్యుత్తరమివ్వనిమ్ము. బహుశ అవునన్నట్లు.] దేవుని వ్యక్తిగత నామమును గూర్చి మోషే దేవుని నుండి ఏమి తెలిసికొనెనో పరిశుద్ధ లేఖనములనుండి నేను మీకు చూపించవచ్చునా?“ అప్పుడు మీరు నిర్గమకాండము 6:3 చదువవచ్చును. ఈ విధముగా, మీరు ఆసక్తిదాయకమైన సంభాషణను ప్రారంభించవచ్చును.
3 మనలో అనేకులకు ప్రత్యేకమైన పేజి సంఖ్యలను గుర్తించుకొనుట కష్టము. అయితే కొద్దిపాటి సిద్ధపాటు మరియు అభ్యాసముతో మనము రీజనింగ్ పుస్తకారంభములోనే ఉన్న “కన్వర్సేషన్ స్టాపర్స్” (సంభాషణను ఆపుజేయువారు) అని పిలువబడు భాగమును ఉపయోగించవచ్చును. ఒక ప్రత్యేకమైన మతమునకు చెందినవారమని తమను గుర్తించుకొను ప్రజలకు ప్రత్యుత్తరమిచ్చుటకు మనకు సహాయము చేయు అనేక పుటల సమాచారము ఈ భాగమందు చేర్చబడినది.
4 రీజనింగ్ పుస్తకములో ఉపోద్ఘాతముల విషయములో కూడ శ్రేష్టమైన భాగము కలదు. వీటికనుగుణ్యముగా మీ ఉపోద్ఘాతములను ఎందుకు తీర్చిదిద్దుకొనకూడదు? పరిస్థితులకనుగుణ్యముగా మన ప్రసంగములను మార్చవలసి యుండును. రీజనింగ్ పుస్తకమందు చాలా అంశముల చివరన, “ఇఫ్ సమ్వన్ సేస్” (ఎవరైనా ఇలా అన్నట్లయితే) అను భాగము కలదు. ఇక్కడ అంశానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రశ్నలకు లేక అభ్యంతరములకు జవాబుగా సూటియైన సమాచారము సమకూర్చబడినది. అయితే ఈ శ్రేష్టమైన సమాచారముయొక్క విలువ, కేవలము మన సిద్ధపాటులో మనమెంతగా దానిని ఉపయోగిస్తే అంతే ఉండును.
ఎట్లు సిద్ధపడవలెను
5 చర్చించునప్పుడు మరియు ప్రదర్శనలప్పుడు, సేవా కూటములో చర్చించబడు ఏ సాహిత్యమునైనను మీతో తీసికొని, దానిని తెరచి చూచుటలో మెలకువగా ఉండవలెను. ఈ విధముగా, ఇతరుల సిద్ధపాటునుండి మీరు మరియెక్కువగా ప్రయోజనము పొందగలరు.
6 సేవకొరకు సిద్ధపడుటలో కొంత సమయమును గడుపుట ప్రయోజనకరము. మీకు అవసరమగు ప్రచురణలను మీరు కలిగియుండునట్లు చూచుకొనవలెను. సంభాషణ అంశమును చూచుటకు కొన్ని నిమిషములను తీసికొనుము. ఇవ్వబడిన లేఖనములను పునఃసమీక్షించుము. మరియు అందింపబడు ప్రచురణలయందు మాట్లాడదగు ప్రత్యేక అంశములను ఒకసారి చూసికొనుము. దీనిని కుటుంబమంతా కలిసిచేయుట మరింత సహాయకరము కాగలదు.
7 అభ్యాస సమయములను కలిగియుండుము. వివిధ సమయములలో—సంఘ పుస్తక పఠనము అయిపోయిన తదుపరి, ఒకానొక సాంఘిక కార్యక్రమమందు, కార్లదగ్గర గుమికూడినప్పుడు, ఇంటింటికి మధ్య మీరు అభ్యాసము చేయవచ్చును. ప్రసంగములనిచ్చుట, అభ్యంతరములను ఎట్లు ఎదుర్కొనవలెనో చర్చించుట మరియు ప్రదర్శించుట ఆనందదాయకముగా ఉండును మరియు మన నైపుణ్యములను మరింత మెరుగుపరచుకొనుటకు శ్రేష్టమైన అవకాశములను సమకూర్చును.
8 మనము నైపుణ్యముగల పనివారిగా తయారై సంతోషదాయకమైన తృప్తిననుభవించునట్లు, పట్టుదలతో సిద్ధపడుట పరిచర్య కొరకైన మన ఉత్సాహమును పెంపొందించును.—యోహాను 2:17.