మీరు బైబిలు పఠనములుచేయుటకు ఆహ్వానమిస్తున్నారా?
1 బైబిలును పఠించు అవకాశమును ప్రజల కిచ్చుటయందు, సూటిగా సమీపించు పద్ధతిద్వారా అనేకులు బైబిలు పఠనములను ప్రారంభించుటలో మంచి విజయాలను పొందారు. అనేకసార్లు సాహిత్యములను నిరాకరించిన ఒకవ్యక్తి బైబిలు పఠనమునకు ఆహ్వానమివ్వగా వెంటనే ప్రతిస్పందించెను. అతడిలా సమాధానమిచ్చాడు: “నాకు బైబిలును పఠించాలనే కోరిక ఎల్లప్పుడు ఉండేది.” బైబిలు పఠనము ప్రారంభమైంది, కుటుంబమంతా త్వరితగతిని అభివృద్ధిచెందారు.
2 బైబిలు పఠనములను ప్రారంభించుటలో అందరూ శ్రద్ధకల్గియుండాలి. క్రీస్తు శిష్యులగుటకు అభివృద్ధి సాధించబోవు వారికి బోధించవలసియున్నది. (మత్త. 28:19, 20) బోధించాలంటే, వారితో బైబిలు పఠనముచేయాలి. బైబిలునుగూర్చి దేవుని సంకల్పాలనుగూర్చి గృహస్థులు ఎలా ఎక్కువగా నేర్చుకొనగలరో ప్రదర్శించి చూపితే తరచు పఠనములను ప్రారంభించవచ్చును. ఒక సహోదరుడు లైఫ్ యిన్ పీస్ఫుల్ న్యూ వరల్డ్ అను కరపత్రమునుండి ఐదు పఠనములు ప్రారంభించగల్గెను. అలాంటి అనేక బైబిలు పఠనములను తాను క్రమంగా చేయలేక పోవుచున్నందున ఆయన ఆ బైబిలు పఠనాలను యితర ప్రచారకులకు యివ్వటం మొదలుపెట్టాడు.
3 పఠనములు ప్రారంభించుట మనకు సులభంగా ఉంటే, యితర ప్రచారకులను మనతోపాటు తీసుకువెళ్ళి, వారుకూడ పఠనములను సంపాదించులాగున వారికి సహాయపడవచ్చును. లేదా మనము ప్రారంభించిన కొన్ని పఠనాలను సంఘములోని యితరులకు యివ్వవచ్చును. మీరు బైబిలు పఠనాలను చేయ్యాలని యిష్టపడుచున్న యెడల మీరు యింటింటి పరిచర్యలో కలుసుకొనే వారికి బైబిలు పఠనమునకు ఆహ్వానమిచ్చి ఎందుకు ప్రయత్నించకూడదు? ఒక సందర్భంలో ఒక ప్రచారకుడు అంతగా ఆసక్తిచూపని ఒక యౌవన బాలికను తిరిగి సందర్శించెను. ఏది ఏమైనను, అతడు బైబిలు పఠించుమని ఆమెను ఆహ్వానించెను. దానికి ఆమె అంగీకరించింది. ఆమె యిప్పుడు బాప్తిస్మము తీసుకొన్నది. ఆమె అక్క బావ కూడా కూటములకు హాజరగుచున్నారు.—గల. 6:6.
4 మనము పఠనము ప్రారంభించిన ప్రతి ఒక్కరు పఠనాన్ని కొనసాగించరు. పఠనముచేసే వారందరు సత్యములోనికి రారు. కాని కొందరు వస్తారు. మనము ఎక్కువ పఠనములు ప్రారంభిస్తే, యితరులు యెహోవాను స్తుతించే వారగునట్లు మనము వారికి సహాయముచేసే అవకాశము ఎక్కువ ఉంటుంది.