ఇంటింటి సేవలో సమర్థవంతముగా పనిచేయుట
1 నేడు “సువార్త” భూమియంతట ప్రకటించబడుతుంది. (మత్త. 24:14) ఇది ప్రముఖంగా ఇంటింటి పరిచర్య ద్వారానే నెరవేర్చబడుతుంది.—అపొ. 20:20, 21.
2 మన పరిచయ ప్రసంగములు మనము కలుసుకునే ప్రజలకు నిజమైన అర్థమునిచ్చేవిగా ఉండాలి. పురుషులు, స్త్రీలు, యౌవనులు విభిన్న రంగాల్లో ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి, మన ప్రాంతములోని ప్రజలకు ప్రీతికరంగా ఉండే వివిధ లేఖనాంశములను సిద్ధపడియుండుట మంచిది.
3 సాహిత్యములను బాగా ఉపయోగించండి: నిరంతరము జీవించుము అను పుస్తకములో అన్ని ప్రాంతాలలో నున్న అనేకమంది ప్రజలకు ఇష్టమయ్యేంతటి విస్తృతమైన అంశాలు ఉన్నవి. చిత్రములు మరియు వ్రాతపూర్వకమైన దృష్టాంతములు ఎంతో ప్రభావవంతమైన ఉపకరణములు. ఈ పుస్తకము హృదయమును ఆకట్టుకొని, ప్రజలు తమ నమ్మకాలను, ప్రవర్తనను, మనోభావాలను, జీవిత విధానమును మార్చుకొనుటకై తగిన నిర్ణయాలు చేసికొనేందుకు సహాయము చేస్తుంది. మనము నిరంతరము జీవించుము అను పుస్తకములోని విషయాలతో బాగా పరిచయము కలిగియుండుట ద్వారా ప్రజలతో అనేక రకములైన అంశములపై సమర్ధవంతముగా ముచ్చటించగలము. తద్వారా ఇంటివారికి ఎంతవరకు ఆసక్తివుందో గ్రహించుటకు ఇది మనకు సహాయము చేస్తుంది.
4 పరిచర్యలో సమర్ధవంతముగా ఉండుటకు, మనము నిజమైన వ్యక్తిగత శ్రద్ధను చూపవలసియున్నాము. (ఫిలి. 2:4) ఆ వ్యక్తిని, ఆయన అవసరతలను ఇముడ్చునట్టి రాజ్యాంశముపైన సంభాషణను కేంద్రీకరించుము. మాట్లాడే అంశానికి సంబంధంగా యుక్తమైన ప్రశ్నలనువేసి, ఆయన భావములను రాబట్టుటద్వారా, ఆ వ్యక్తి ఆలోచనను అర్థం చేసికొనుటకు ప్రయత్నించండి. ఆయన చెప్పే సమాధానములను శ్రద్ధతో వినండి. ఆయనకు ఏ అంశముపై ఆసక్తివుందో గ్రహించుకొనుటకు ఆయన వ్యాఖ్యానములు మీకు సహాయపడవచ్చును. రాజ్యవర్తమానపు విలువను చూడగలుగునట్లు ప్రజలకు సహాయము చేయుటకు మనము ఇష్టపడుతూ, వారు దాన్నిగూర్చి ఇంకా ఎక్కువ ఎలా తెలుసుకోవాలో చూపాలనుకుంటున్నాము. ఒక దంపతులు వారిని సందర్శించిన సహోదరుడు వారిపై యథార్థమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించినందున తాము బైబిలు పఠనమును అంగీకరించామని తెలియజేశారు.
5 తరచుగా పనిచేసిన ప్రాంతంలో: తరచుగా పనిచేసిన ప్రాంతంలో సమర్ధతను పెంపొందించుకొనుట ప్రత్యేకముగా ప్రాముఖ్యము. ఎక్కువ సమర్ధవంతమైన పరిచర్య మనప్రాంతమును విస్తృతపరచుకొనుటకు సహాయము చేస్తుంది. (w88 7/15 పుట 15-20) మనము వారిని గతంలో ఎన్నడూ సందర్శించలేదన్నట్లు ప్రవర్తించే దానికంటే, ఇంటివారు గతములో వ్యక్తం చేసిన మనోభావాన్ని తెలియజేస్తూ, దాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించు కొనవచ్చును. మన గత సందర్శనమును ప్రస్తావిస్తూ, అప్పుడు చెప్పిన దానిని ఆధారంగా తీసికొని మనము మాట్లాడుట ప్రారంభించ వచ్చును. మన రాజ్య పరిచర్య గత సంచికలలో మరియు రీజనింగ్ పుస్తకములో సూచించబడిన పరిచయ ప్రసంగాలను ప్రాంతీయ అవసరతలకు తగినట్లు మనము ఉపయోగించు కొనవచ్చును.
6 ఇంకా అనేకమంది రాజ్య ఆశీర్వాదముల నుండి ప్రయోజనము పొందాలని యెహోవా ఓపికతో ద్వారము తెరచియున్నాడు. యేసు పరిచర్య తాను ప్రజల యెడల కలిగియున్న ప్రేమనుబట్టి ఎంతో ఫలవంతమైనది. (మార్కు 6:34) మనము ఆయన మాదిరిని అనుసరించుటకు చేయగలిగిన దానినంతటిని చేయుచున్నామా? (1 పేతు. 2:21) ఇంటింటి పరిచర్యలో పూర్ణముగాను, సమర్థవంతముగాను పాల్గొనుటలో వెనుకంజ వేయకుండా ఉందాము.—2 తిమో. 4:5.