దైవభక్తి మీ గురిగా మిమ్ముల మీరు తర్ఫీదుచేసుకొనుడి
1 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మనకు క్రమముగా ‘దేవుని వాక్యమును సరిగా ఉపయోగించుటకు’ తర్ఫీదునిస్తుంది. (2 తిమో. 2:15) దానిలో మీరు చేరారా? చేరనట్లయితే, మీరు అర్హులైయుంటే దానిలో ఇప్పుడే చేరుటద్వారా ఈ మంచి ఏర్పాటునుండి ఎందుకు ప్రయోజనము పొందకూడదు?
2 పాఠశాలలో ఒక ప్రాముఖ్యమైన భాగమేమనగా వారపు బైబిలు పఠన కార్యక్రమము. మీ వ్యక్తిగత పఠన కార్యక్రమ పట్టికలో నియమించబడిన బైబిలు అధ్యాయములను కూడా చేర్చుకోవాలి. తద్వారా తగిన సమయంలో మీరు పూర్తి బైబిలును చదివినవారవుతారు.
3 పాఠశాల కార్యక్రమ పట్టికలో 1993 ఆరంభమునుండి రెండవ ప్రసంగములోని బైబిలు పఠన భాగము మధ్యలో ఆపకుండా పూర్తిగా ఒకేసారి చదవవలెను. అంటే ఈ ప్రసంగమును నిర్వహించే విద్యార్థి వివరణాత్మకమైన సమాచారమును ఉపోద్ఘాతములోనైనా లేక ముగింపులోనైనా మాత్రమే చేర్చాలి. బైబిలు ఉన్నతాంశములకు నియమించబడిన సహోదరుడు రెండవ ప్రసంగానికి కేటాయించబడిన వచనములపై తన వ్యాఖ్యానమును పరిమితముచేయాలి. తద్వారా ఆ ప్రసంగాన్ని చేసే వ్యక్తి బైబిలు పఠన సమాచారమును పూర్తిగా వివరించుటకు అవకాశముంటుంది.
4 పాఠశాల అధ్యక్షుడు 2, 3 మరియు 4 ప్రసంగాలను ఇచ్చేవారి స్పీచ్ కౌన్సిల్ స్లిప్పై గుర్తులను చూపును. ఆయన కౌన్సిల్ స్లిప్‌లో ఉండే క్రమాన్నిబట్టే ఉపదేశాన్నివ్వాలని లేదు. విద్యార్థి అభివృద్ధి చేసుకోవలసిన అంశాలపై ఆయన నిర్దిష్టమైన సలహాను ఇవ్వవచ్చును. ఒకటవ ప్రసంగమును ఇచ్చే ప్రసంగీకుని స్పీచ్ కౌన్సిల్ స్లిప్పై గుర్తు పెట్టనవసరం లేదు. అయినా, అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా ఉపదేశాన్నివ్వ వచ్చును.
5 అర్హులైన వారందరు, యెహోవా ఏర్పాటుచేసిన ఆత్మీయ ఏర్పాట్లనుండి ప్రయోజనము పొందుతుండాలి. ఇందులో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఇవ్వబడే తర్ఫీదుకూడా ఇమిడి ఉంది. అటువంటి శిక్షణ ఎక్కువ ఫలవంతమైన పరిచర్యకు నడపగలదు.—1 తిమో. 4:7.