ప్రశ్నా భాగము
◼ బైబిలు ప్రశ్నలకు సమాధానం పొందుటకు, లేక వ్యక్తిగత సలహాకొరకు సొసైటికి టెలిఫోను చేయవచ్చునా?
పనులను తొందరగా చేసుకోడానికి చాలామంది ప్రజలు టెలిఫోనును ఉపయోగిస్తారు. అయితే ఇచ్చట తొందరకంటే ఎక్కువగా ఇమిడి ఉంది. లోకంలో వ్యక్తిగత సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కష్టించి పనిచేయుటకు తప్పించుకుంటారు.
అయితే దేవుని సలహా దానికి ఎంత భిన్నంగా ఉంది! దాచబడిన నిధి వెదకునట్లు జ్ఞానమును వెదకుమని ఆయన మనలను కోరుతున్నాడు. అనగా అందులో మనము కష్టించి పనిచేయడం ఇమిడివుంది. అనుభవము చూపేదేమనగా మనము అలా చేసినట్లయితే తద్వారా శాశ్వత సంతృప్తి కలుగును.—సామెతలు 2:1-4.
మనము వ్యక్తిగత సమస్యను ఎదుర్కొన్నప్పుడు లేక కూటములకు సిద్ధపడుతుండగా ఏదైనా ప్రశ్న రేకెత్తినట్లయిన అటువంటి ప్రయత్నము యుక్తమైనది. ఊరకనే సొసైటికి టెలిఫోను చేయటంకన్నా, బైబిలులో లేక మన ప్రచురణలలో ప్రత్యేకముగా వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్, దాని విలువైన లేఖన మరియు విషయ సూచికలనుబట్టి వ్యక్తిగత పరిశోధనచేయుట మూలంగా మనము ప్రయోజనము పొందెదము.
ఆవిధంగా మనము ‘దాచబడిన నిధిని’ వెదకినట్లు వెదకిన తరువాత, మనకు ఇంకా సహాయమవసరమైతే స్థానిక పెద్దలలో ఒకరిని సంప్రదించవచ్చును. సమాచారమును వెదకుటలో పెద్దలకు ఎంతో అనుభవము మరియు బైబిలు జ్ఞానము ఉంటుంది. వ్యక్తిగత సమస్యేగాని, లేక నిర్ణయంగాని అవసరమైతే వారి సమతుల్యమైన సహాయము ప్రత్యేకంగా తగినదై ఉంటుంది. ఎందుకంటే మన పరిస్థితికి, మనకు వారు సమీపముగా ఉన్నారు.—అపొ. కార్యములు 8:30, 31 పోల్చుము.
అయినా నేరుగా సొసైటినుండే ఎక్కువ సమాచారము అవసరమైనట్లు కనిపిస్తే, సాధారణంగా ఉత్తరం పంపడం మంచిది. దీనిని తయారుచేయడంలో పెద్దలు మీకు సహాయపడవచ్చును. అటువంటి ఉత్తరం తగినంతగా పరిశోధనచేయడానికి ఆలోచించడానికి సమయాన్నిస్తుంది. అలా చేయటం టెలిఫోను ద్వారా సాధ్యం కాదు.