సువార్తనందించుట—టెలిఫోను ద్వారా
1 ప్రజలను ముఖాముఖిగా కలుసుకొని సాక్ష్యమిచ్చుటకు మనము ప్రాధాన్యతనిచ్చుదుము. అయితే పరిస్థితులు టెలిఫోను ద్వారా సాక్ష్యమిచ్చుటను అవసరమైన ప్రత్యామ్నాయముగా చేయవచ్చును. వ్యాధి లేక భౌతిక అసమర్థత వలన తాత్కాలికముగానో లేక శాశ్వతముగానో గృహమునకు నిర్బధించబడియున్న ప్రచారకులు సాక్ష్యమిచ్చుటకై టెలిఫోనును బాగుగా ఉపయోగించవచ్చును. మరియు ఎక్కువగా భద్రత ఏర్పాట్లను కలిగియున్న గృహములలో నివసించువారితో మాట్లాడుటకు లేక ముందు ఆహ్వానము లేకుండా ఒకరు అనుమతించబడని ప్రాంతములకు సాక్ష్యమిచ్చుటకు టెలిఫోను ద్వారా మాట్లాడుట ఎంతో విజయవంతము కాగలదు. టెలిఫోను ద్వారా సాక్ష్యమిచ్చుట కొన్ని సాటిలేని సవాళ్లను ముందుంచును. అయితే జాగ్రత్తతో కూడిన ఆలోచన మరియు పథకముతో వీటిని అధికమించును.
2 కొన్నిసార్లు భవనముల వసారాలయందు ఉంచబడు డైరెక్టరీలనుండి లేక, తపాలా పెట్టెలనుండి పేర్లను పొందవచ్చును. ఈ టెలిఫోను డైరక్టరీల ద్వారా టెలిఫోన్ నెంబర్లను కనుగొనగలము. దీనిని సేవాకాపరి నడిపింపు క్రింద చేయవలెను. ఎందుకనగా ఆ విధముగా ఆయన టెలిఫోను ప్రాంతములను ఏర్పరచుకొని వాటియొక్క సంపూర్ణ రికార్డులను భద్రపరచును.
సిద్ధపడుట ఎట్లు
3 ఫలవంతమైన టెలిఫోను సాక్ష్యమునకు ఉల్లాసవంతమైన, యింపైన స్వరము అవసరము. దినము యొక్క తొలి ప్రారంభములోనో, బాగా రాత్రి అయిన తరువాతనో లేక భోజన సమయాలలోనో కాల్ చేయకుండునట్లు చూచుకొనుము. టెలిఫోనును అనేకసార్లు రింగ్చేయనవసరములేదు. టెలిఫోను మిషన్ద్వారా నీకు జవాబు వచ్చినపుడు నీవు యిలా చెప్పవచ్చును: “నా పేరు ఫలానా . . . భవిష్యత్తును గూర్చి బైబిలులోగల నిరీక్షణను మీతో పంచుకొనుటకు మాట్లాడుచున్నాను. నేను మరలా మీతో మాట్లాడుతాను.” ఈ కాల్‌ను యింటియొద్ద లేనిదానిగా లెక్కించి ఇంకొక సమయములో టెలిఫోను చేయుము.
4 నీ అందింపు చదువుతున్నట్లు అనిపించకుండులాగున దానిని పదే పదే అభ్యాసముచేసి చూచుకొనుము. యింటివారును సంభాషణలో పాల్గొనునట్లు చేయుటద్వారా ఆయన యందు నీవు వ్యక్తిగతముగా శ్రద్ధ కలిగియున్నావని భావించుకొనునట్లు చేయుము. నీ పరిచయములోనే నీ మొదటి మరియు చివరి పేరును తెలియజేసి నిన్ను బాగుగా తెలియపరచుకొనుము. నీ సంభాషణంతటిలో యింటివారి పేరును ఉపయోగించుటకు ప్రయత్నించుము.
5 నిదానముగాను నిండుదనముతోను మాట్లాడుము. నిజముగా ప్రశ్నను అడుగునప్పుడు తప్ప, మధ్యలో ఆగుచున్నట్లు యుండవద్దు. ఎందుకనగా అది నీవు ప్రశ్ననడుగుచున్నావేమోనను భావనను కలుగజేయును. నీవు యిలా చెప్పవచ్చును: “నా పేరు . . . నేను మిమ్ములను వ్యక్తిగతంగా కలువలేను గనుక యిలా మాట్లాడుచున్నాను.” తరువాత ఆగకుండానే, యీ విధముగా నీవు కొనసాగవచ్చును: “నేను పిలుచుటలోగల ఉద్దేశ్యమేమంటే ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న విషయములో మీ అభిప్రాయమును తెలుసుకుందామని మీరెప్పుడైన . . .నుగూర్చి ఆశ్చర్యపడ్డారా?” లేక “అదెప్పుడైనా మీకు సంభవించిందా?” అని అడుగుటద్వారా మీరు ప్రశ్నను మార్చవచ్చును. లేక “దానినిగూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా?” ఈ ప్రశ్నలకు తప్పుగా యిచ్చు సమాధానములు ఉండవు. యింటివారు సంభాషణలోకి దిగుటకు ఇవి సుళువైన మార్గమునేర్పరచును. “నేను మీకు అడ్డొస్తున్నానేమో?” లేక “మీరు బిజీగా లేరనుకొంటాను” అని అంటూ వ్యతిరేకపు సమాధానములు వచ్చులాగున చేసికొనకుము. యింటివారే నీకు వేరుగా చెప్పునంతవరకు అది మంచి సమయమేనని ఊహించుము.
6 ఒకవేళ ఆ వ్యక్తి మీరెవరి తరపున మాట్లాడుతున్నారు అని అడిగినట్లయిన ఏమాత్రము ఆ, ఊః, లనకుండా క్లుప్తముగా “నేను యెహోవాసాక్షిని, ఆసక్తికరమైన ఈ ప్రశ్నపై మీ అభిప్రాయమును ఆహ్వానించుటకు మిమ్ములను పిలుస్తున్నాను. మీరెప్పుడైనా . . . గూర్చి ఆశ్చర్యపడియున్నారా?” అని చెప్పుము. ఒకవేళ యింటివారు “నా టెలిఫోను నెంబరు మీకెలా దొరికిందని అడిగితే, నేను డైరక్టరీనుండి తీసుకున్నాను. ఈ ఆసక్తిదాయకమైన ప్రశ్నపై మీ సమాధానమును ఆహ్వానించుటకు మిమ్మును పిలిస్తున్నాను అది మీకెప్పుడైనా జరిగినదా?” అంటూ జవాబివ్వవచ్చును.
7 కొందరు, కేవలము బైబిలు ప్రశ్నలకు సమాధానమిచ్చు ఒక కార్యక్రమమును మేము కలిగియున్నాము అని లివ్ ఫరెవర్ పుస్తకమునుండి కొన్ని అధ్యాయముల పేర్లు చెప్పుట ద్వారా విజయము సాధించారు. లేక నీవు యిలాగైన చెప్పవచ్చును. “నేరమధికముగా నెలకొని ఉండుటనుబట్టి మీ భవనమునకు అట్టి పెద్దభద్రత ఏర్పరచారు గనుక, మీ అభిప్రాయము ఆహ్వానించుటకు నేను మాట్లాడుచున్నాను. ఈనాడు నేరపు పరిస్థితి ఇంత హెచ్చుగా ఎందుకున్నదని మీరనుకుంటారు?”
8 ఎంతో ఎక్కువ భద్రత కలిగియున్న ఒక భవనములో టెలిఫోను సాక్ష్యమును ప్రారంభించునంతవరకు ఏమంత ఎక్కువ విజయము లభించలేదు. దానివలన 14 క్రొత్త బైబిలు పఠనములు ప్రారంభించబడినవి. కావున, ప్రవేశించుటకు అంతగా వీలులేని భవనములు మంచి అభివృద్ధిని యిచ్చునవై అసలు పనిచేయబడకుండా ఉన్నవైయుండవచ్చును. అనుకూలమైన దృక్పథముతో, మనకు యెహోవా సహాయమున్నదని ఎరిగి సువార్తనందించుటకు టెలిఫోను సాక్ష్యమును మరొక ఫలవంతమైన మార్గముగా కనుగొందుముగాక.—2 తిమో. 4:5.