పునర్దర్శనములను సమర్థవంతముగా నిర్వహించుటద్వారా ఆసక్తిని నిర్మించుము
1 బాగా సిద్ధపడిన ప్రతి ప్రసంగములో ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతము, విలువైన సమాచారముతో నిండిన వివరణ, పురికొల్పే ముగింపు ఉంటాయి. ఉపోద్ఘాతము ప్రేక్షకుల ఆసక్తిని ఆకట్టుకొంటుంది, కానీ మధ్యలో సరియైన సమాచారము, చివర ముగింపు లేకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. ఇదే సూత్రం మన పరిచర్యకు కూడా అన్వయిస్తుంది. మొదటి దర్శనములో ఇంటివారి ఆసక్తిని రేకెత్తించడం మంచి సంగతేకాని, ఆ మొదటి ఆసక్తిపైన నిర్మించుటకు మనము పునర్దర్శనములను సమర్థవంతముగా నిర్వహిస్తూ ఉండాలి.
2 దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? అది ఎంతగా ఆలోచనను రేకెత్తించే ప్రశ్న! ఈ అంశము ప్రస్తుతం అనేకమంది మనస్సులలో ఉందని నీ వంగీకరించవా? అందుకే పైనున్న శీర్షికలో మీరు మరలా పునర్దర్శనము చేసేటప్పుడు సమాధానమిచ్చే దృష్టితో మీ మొదటి సందర్శన ముగింపులో ఈ ప్రశ్నను వేయమని సూచించబడింది.
3 మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “నమస్కారమండీ, పోయినసారి మనము మాట్లాడినప్పుడు, దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడనే విషయం ప్రస్తావనకొచ్చింది. అయితే దాని విషయంలో వివరాలివ్వడానికి నేను మరలా వస్తానని మాట యిచ్చాను. అనేకమంది ప్రజలు దేవునికి ఒకవేళ మనపై నిజంగా శ్రద్ధవున్నట్లయితే ఆయన బాధలను తీసివేసే వాడని భావిస్తుంటారు. బహుశా మీరు కూడా అలాగే అనుకొనియుండవచ్చు. [ఇంటివారిని సమాధానము చెప్పనివ్వండి.] బైబిలు దేవునికి మనపై నిజంగా శ్రద్ధ ఉందని చూపిస్తుంది. [1 యోహాను 4:8 చదువుము.] బాధలు ఇప్పటివరకు ఉండేలా అనుమతించటంలో దేవునికి ఒక సరైన కారణమున్నది. వాటిలో ఒక కారణము 2 పేతురు 3:9లో వివరించబడింది. [చదువుము.] ఇతర కారణాలు ఈ బ్రోషూరులో వివరించబడ్డాయి.” తరువాత మన సమస్యలు— వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? బ్రోషూరులో 10-12 పేజీలకు త్రిప్పండి. తదుపరి అందులో ఆసక్తికరమైన అంశాన్ని చర్చించండి.
4 కొంతమంది గృహస్థులు బహు ఎక్కువ వివరణను కోరవచ్చును. వారు సంతృప్తిపడేలా జవాబు పొందటానికి, అనేక పునర్దర్శనాలు అవసరం కావచ్చును. మనము జనవరిలో అందించే అనేక 192 పేజీల పాత బౌండు పుస్తకములలో ఈ అంశముపై చర్చించుటకు ఆధారాన్నిచ్చే ఒక అధ్యాయం ఉంటుంది.
5 నీవు చర్చను ముగించే సమయంలో మరో ప్రశ్నను లేవదీసి, నీవు మరలా వచ్చినప్పుడు ఈ విషయంలో ఆసక్తికరమైన సమాచారాన్ని వివరించడానికి నీవెంతో ఆనందిస్తావని ఇంటివారితో చెప్పుము. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమౌతాడని తెలుసుకోడానికి ఇష్టపడుతుంటారు. అనుకూలమైన సమయంలో ఆ అంశాన్ని చర్చించడానికి ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు?
6 మూడు ముఖ్యమైన సూత్రాలను మనస్సు నందుంచుకొనుట మీకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. పరిస్థితులకు అనుగుణ్యంగా మలుచుకొనడానికి ఇష్టపడువారిగా ఉండండి. గృహస్థుడు బైబిలు చర్చకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించే అలవాటులేనివాడై యుండవచ్చును. క్లుప్తముగా ఉండుము. మరీ ఎక్కువసేపు ఉండవద్దు. లేదా మొదటిసారే అనేక సంగతులను వివరించవద్దు. మీరు కొద్దిసమయంలో కేవలం కొన్ని అంశాలనే చర్చిస్తుంటే, అనేక సందర్భాలలో మంచి ప్రత్యుత్తరం లభిస్తుంది. ఉత్సాహంగా స్నేహపూర్వకంగా ఉండుము. ఒక మనిషిగా గృహస్థునిపై నీవు వ్యక్తిగత శ్రద్ధకలిగియున్నట్లు చూపుము.
7 మన తక్షణ గమ్యమేమంటే గృహస్థునితో లేఖన సంభాషణలో భాగం వహించడం. ఆ తరువాత నిరంతరము జీవించగలరు మొదలగు అనుకూలమైన ప్రచురణనుండి గృహ బైబిలు పఠనమును ప్రారంభించాలని మన మిష్టపడుదుము. మొదట చూపిన ఆసక్తిని సమర్థవంతమైన పునర్దర్శనాల ద్వారా ఓపికతో నిర్మించిన ఆనందం మీది కాగలదు.