పరిచర్యలో సర్వతోముఖ ప్రతిభను కనపర్చుము
1 వైవిధ్యం జీవితానికి పరిమళ ద్రవ్యం అని చెప్పబడింది. తరచు ఒక అంశాన్ని విభిన్నరీతిలో వివరించుట ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మన పరిచర్య విషయములోను వాస్తవము. మనము జాగ్రత్తవహించకపోతే మన ఇంటింటి సంభాషణా ప్రసంగములు పలికినదాన్నే పదే పదే పలికేమాదిరి కాగలవు. అవే ఉపోద్ఘాతములను పదేపదే చెబుతుండటం మనకు ఇంటివారికి విసుగు పుట్టించగలవు. అందువలన మీరు మీ పరిచర్యలో సర్వతోముఖ ప్రతిభను ప్రదర్శించాలి. మరి దీనిని నీవు ఎలా చేయగలవు?
2 ‘గుడ్ మార్నింగ్, మేము మా పొరుగువారితో రాజ్య సువార్త చెప్పడానికి కలుస్తున్నాము’ అనే దాన్నే చెప్పేబదులు మీ ప్రారంభ మాటలను మరోరీతిగా మార్చడానికి ఎందుకు ఆలోచించకూడదు? ఈ పరిచయ వాక్యముల విషయంలో రీజనింగ్ పుస్తకము విస్తారమైన సమాచారాన్ని అందిస్తుంది. 9-15 పేజీలలో 18 విభిన్న అంశాలమీద ఉపోద్ఘాతపు మాటలున్నవి. అనేక అంశాలకు రెండు, మూడు లేక ఎక్కువ ఉపోద్ఘాతములు ఉన్నవి.
3 మీరు ఒకవేళ “మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?” అను బ్రోషర్ను ఉపయోగిస్తున్నట్లయితే 13వ పేజీలోని “లైఫ్/హాపినెస్” అనే భాగము క్రింది ఉపోద్ఘాతము సహాయపడగలదు:
◼ “ఈరోజు మేము జీవిత విధానముపై నిజంగా శ్రద్ధగల వ్యక్తులతో మాట్లాడుతున్నాము. నిజమైన సంతోషము, సమస్యలులేని జీవితం సాధ్యమా? అని అనేకమంది ఆశ్చర్యపోతుంటారు. ఈ బ్రోషర్ ప్రోత్సాహకరమైన ఆలోచనను రేకెత్తించే దృక్పథమును అందిస్తుంది.” బ్రోషర్ను 18వ పేజీవైపు త్రిప్పి “ఒక నూతన లోకము—ఎంత వ్యత్యాసము?” అను భాగము క్రింద ఒకటి లేక రెండు ఉన్నతాంశములను చదువుము.
4 కొంతమంది రాజ్యప్రచారకులు—యౌవనులు, ప్రత్యేకంగా క్రొత్తవారు, చివరకు పెద్దవారు సహితం—కరపత్రములను ఉపయోగించుటద్వారా ఆసక్తికల్గించేరీతిలో ఇంటివారిని సమీపించవచ్చని కనుగొన్నారు.
ఒక బాలప్రచారకుడు “లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూవరల్డ్” అను కరపత్రాన్ని ఉపయోగించి ఇలా చెప్పవచ్చును:
◼ “దేవుడు ఈ భూమికి సంతోష సమాధానములను ఎలా తెస్తాడనే విషయంలో మీతో క్లుప్తంగా మాట్లాడాలనుకొంటున్నాను. లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూవరల్డ్ అనే ఈ కరపత్రాన్ని మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను.” అప్పుడు బాల ప్రచారకునితో పనిచేస్తున్న పెద్దవారు ఇంటివారు ప్రతిస్పందించే దాన్నిబట్టి ఇంకేమైనా తలంపులు అందించాలా లేక వ్యాఖ్యానం చేస్తే బాగుంటుందా నిర్ణయించవచ్చును.
5 ఇంటివారు ఆసక్తి కనపరిస్తే, పెద్దవారైన ప్రచారకులు ఇలా చెప్పవచ్చు:
◼ “భూమియంతట శాంతి నెలకొల్పబడునని చూపుతూ, భవిష్యత్తుకొరకు బైబిలొక అద్భుతమైన నిరీక్షణనందిస్తుంది. ఈ విశ్వమునకు అందులోని సమస్తమునకు దేవుడే సృష్టికర్తయైయున్నందున, నేడు మనము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విషయములో ఆయన తగిన శ్రద్ధవహించాలను అభిప్రాయంతో మీరు ఏకీభవించరా? భవిష్యత్తునుగూర్చి బైబిలుచేసే వాగ్దానముపై మీ అభిప్రాయమేమిటో చెప్పవచ్చు.” ఆపై కీర్తన 37:9-11, 29 చదవండి.
6 మీరు నిరంతరము జీవించగలరు పుస్తకమును అందిస్తుంటే, ఆ పుస్తకములోని 156 నుండి 162 పేజీలలో వర్ణించబడిన భవిష్యత్తునుగూర్చి అనుకూల దృక్పథంను ఉన్నతపరచవచ్చును. అక్కడి చిత్రములకు ప్రక్కన ఇవ్వబడిన బైబిలు వాక్యములపై అవధానాన్ని మళ్లించుము. దేవుడు ఈ ప్రవచనములను నెరవేరుస్తాడని నమ్మడం వాస్తవికంగా ఉంటుందేమో ఇంటివారిని అడగండి. ఇప్పటికే నెరవేరివున్న బైబిలు ప్రవచనముల క్లుప్తమైన చర్చ మానవజాతిని ఆశీర్వదించు దేవుని సామర్థ్యముపై ఇంటివారి నమ్మకాన్ని బలపర్చాలి.
7 రాజ్య ప్రచారకులందరు దైవపరిపాలనకు సంబంధించిన వాటిని విస్తరింపజేయుటలో సత్య విత్తనములను నాటుటలో, ఆసక్తి కనబడినచోట దానిని పెంపొందింపజేయటంలో శ్రద్ధవహిస్తారు. మనవంతు మనంచేసి దానిని వృద్ధిచేయవలసిన భవిష్యత్ పనిని సంతోషంగా దేవునికి విడిచిపెట్టవచ్చు. మనం మన పొరుగువారికి అందించుటకు శ్రేష్టమైన వార్తను కలిగివున్నాము. ఎప్పుడూ సిద్ధపడివుండటం ద్వారా రాజ్యవర్తమానమును అందించుటలోను, ఏ ప్రచురణను అందించాలో వివేచించుటలోను మనము సర్వతోముఖ ప్రతిభను కనపర్చగలము.