కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/93 పేజీలు 1-2
  • కావలికోట మరియు అవేక్‌!లను సరిగా ఉపయోగించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కావలికోట మరియు అవేక్‌!లను సరిగా ఉపయోగించుట
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • సువార్తనందించుట—పత్రికలతో
    మన రాజ్య పరిచర్య—1989
  • పత్రికలు రాజ్యాన్ని ప్రకటిస్తున్నాయి
    మన రాజ్య పరిచర్య—1998
  • పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 7/93 పేజీలు 1-2

కావలికోట మరియు అవేక్‌!లను సరిగా ఉపయోగించుట

1 ఈనాడు ప్రజలు చదువగల అత్యంత విలువైన, ప్రయోజనకరమైన పత్రికలు కావలికోట మరియు అవేక్‌! ఎందుకు? ఎందుకంటే, ప్రజల జీవితాలపై మంచి, నిరంతర ప్రభావాన్ని చూపగల ఆత్మీయ సత్యాలు వాటిలో వున్నాయి. అయిననూ చాలామంది తమ ఆత్మీయ అవసరతను గూర్చి శ్రద్ధ కలిగిలేరు, లేక దాన్ని తృప్తి పరచుకొనుటకు ఎటు చూడాలో వారికి తెలియదు. ఆత్మీయంగా వారి కన్నులు తెరుచుకొనుటకు వారికి సహాయం చేయుటలో అపొస్తలుడైన పౌలును అనుకరించడం మన ఆధిక్యత.—మత్త. 5:3; అపొ. 26:18.

2 అనుకూల దృక్పథాన్ని కలిగివుండి, బాగా సిద్ధపడండి: సత్యానికి ప్రతిస్పందించే గొర్రెవంటి ప్రజలు మీ ప్రాంతంలో వుండవచ్చు. పత్రికలను చదవటానికి కొందరికి కేవలం దయాపూర్వక ప్రోత్సాహం అవసరమై యుండవచ్చు. గనుక, కావలికోట మరియు అవేక్‌! పత్రికలను అందజేసేటప్పుడు అనుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా వుండండి. చేతిలో తగినన్ని పత్రికలను వుంచుకుని, వాటిని పంచిపెట్టుటకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతర ప్రచురణలను అందజేసేటప్పుడు కూడా వాటిని ఇవ్వవచ్చును.

3 పత్రికలను పంచిపెట్టుటలో ఏది మనం ఎక్కువ ప్రభావవంతంగా వుండునట్లు చేస్తుంది? మొట్టమొదట, వాటి విలువను వ్యక్తిగతంగా మనం అభినందించాలి. మనం అందజేస్తున్న పత్రికలలోని విషయాలు మనకు బాగా తెలిసి వుండాలి, ఇది మన నమ్మకాన్ని, అందజేయాలనే ఆసక్తిని అధికం చేస్తుంది. మీరు మొదట వాటిని చదివేటప్పుడు ఈ ఆలోచనను మనస్సులో వుంచుకోండి. పరిచర్యలో ఉన్నతపరచుటకు విషయాలను ఎంపిక చేసుకోవటానికి సిద్ధంగా వుండండి. మిమ్మును మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ప్రాముఖ్యంగా ఈ శీర్షిక ఎవరికి వర్తిస్తుంది? ఒక గృహిణి, ఒక యౌవనస్థుడు, లేక బహుశ ఒక వ్యాపారి దాన్ని మెచ్చుకుంటాడా? ఒక విద్యార్థికి, ఒక వివాహిత వ్యక్తికి, వాతావరణాన్ని గూర్చి శ్రద్ధగల వ్యక్తికి ఈ విషయం ఆసక్తిని రేకెత్తించేదై వుంటుందా?’ నిజంగా ప్రభావవంతంగా వుండాలంటే, మన వ్యక్తిగత జ్ఞానంపై, వాటి సమయోచిత విషయాలను ఆనందించడంపై ఆధారపడి మనం వాటిని సిఫారసు చేయగలగాలి.

4 పాత సంచికలను మంచిగా ఉపయోగించండి: కావలికోట మరియు అవేక్‌!లు వాటి ప్రచురణ తేదీ నుండి ఒకటి లేక రెండు నెలల్లో అందజేయబడక పోయినప్పటికీ వాటి విలువ తగ్గిపోదని గుర్తుంచుకోండి. సమయం గడవడంతో వాటిలోని సమాచారం యొక్క ప్రాముఖ్యత తక్కువ కాదు, పాత సంచికలు మంచి స్థితిలో వుంటే, వాటిని అందజేయుటకు వెనుకాడకండి. పాత పత్రికలన్నీ పేరుకుపోయేలా చేసి వాటిని ఎప్పటికీ ఉపయోగించకపోతే ఆ విలువైన పరికరాల యెడల మెప్పులేనట్లే అవుతుంది. ఆత్మీయాకలిని పెంపొందించి, దానిని తీర్చే సామర్థ్యత గల సత్యాలను ప్రతి పత్రిక కలిగివుంది. పాత సంచికలను ప్రక్కన పెట్టి వాటి గురించి మరచి పోవటానికి బదులు, ఆసక్తిగలవారికి వాటిని అందజేయుటకు ప్రత్యేక ప్రయత్నం చేయడం లేక ఇంటి వద్ద మనుష్యులు లేనప్పుడు ఇతరులకు కనిపించని స్థలాలలో వాటిని విడిచి పెట్టడం మంచిది కాదా?

5 మునుపు ఆత్మీయ విషయాల యెడల ఆసక్తిలేని వారు తమ ఆత్మీయ అవసరతలను గూర్చి శ్రద్ధకలిగి వుండుటకు అవేక్‌! పత్రిక అనేకులకు సహాయం చేసింది. యెహోవా ప్రజల ఆత్మీయపోషణపనిలో కావలికోట కీలక పరికరంగా వుంది. ఈ పత్రికలు ఒకదానితో ఒకటి మంచి అనుబంధాన్ని కలిగివుంటాయి, సువార్త ప్రకటింపబడుటలో అవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.

6 పత్రికలను అందజేయుటకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, గొర్రెవంటి వారి ఆత్మీయ అవసరతలను తీర్చగల వాటి సమర్థతపై మనం పూర్తి నమ్మకాన్ని కలిగివుండవచ్చు. మనం అనుకూల దృక్పథాన్ని కలిగి వుండి, బాగా సిద్ధపడి, పరిచర్యలో క్రమంగా పాల్గొనాలి. సువార్త ప్రచారకులుగా మనమందరం కావలికోట మరియు అవేక్‌! పత్రికలను క్రమంగా మంచిగా ఉపయోగిద్దాము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి