కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/89 పేజీ 4
  • సువార్తనందించుట—పత్రికలతో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సువార్తనందించుట—పత్రికలతో
  • మన రాజ్య పరిచర్య—1989
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విలువైన పత్రికలు
  • కావలికోట మరియు అవేక్‌!లను సరిగా ఉపయోగించుట
    మన రాజ్య పరిచర్య—1993
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • మీరు మన పత్రికలను చదువుతారా?
    మన రాజ్య పరిచర్య—1998
  • పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1989
km 11/89 పేజీ 4

సువార్తనందించుట—పత్రికలతో

1 “పుస్తకములు అధికముగా రచింపబడును. దానికి అంతము లేదు” అని ప్రసంగి 12:12 తెలుపుచున్నది. చదువరుల దృష్టి ఒకదాన్ని మించి మరొకదానిపైన పడునట్లు అతి వేగముగా పనిచేయు ముద్రణా యంత్రములు కోట్లకొలదిగా ముద్రించబడిన పేజీలను అందించుచున్న మన దినములలో ఆ మాటలు ఎంతో నిజమైన పనిగా రుజువైనవి. ఈ విధంగా విస్తార సంఖ్యలో లభ్యమగుతున్న ముద్రిత సమాచారము రాజ్య సువార్తను ప్రకటించు ప్రచారకులకు ఒక సవాలును ముందుంచుచున్నది. అయితే నేడు ప్రచురించబడుచున్న అత్యంత యోగ్యమైన పత్రికలు వాచ్‌టవర్‌ మరియు అవేక్‌!లని మనమెట్లు వ్యక్తులను ఒప్పించగలము?

విలువైన పత్రికలు

2 వాచ్‌టవర్‌ మరియు అవేక్‌! పత్రికల యెడల మన వ్యక్తిగత స్వభావమును పరిశీలించుకొనుట మంచిది. ప్రతి క్రొత్త సంచికను మిక్కిలి ఆశతో ఎదురు చూచుచు, అవి ప్రశస్తమైన పత్రికలని వాటిని మీరు దృష్టించుచున్నారా? అందలి శీర్షికలన్నిటిని చదువుటకు మీరు నిర్ణయిత కాలపట్టికను కలిగియున్నారా? వ్యక్తిగతముగా వాటిని అభినందించినట్లయిన, మన నిజమైన ఉత్సాహము మరియు హృదయపూర్వక ఒప్పుదల వాటిని యితరులకు విజయవంతముగా అందించుటలో మనకు సహాయపడును.

3 మనకు ఎలా అవసరమో అలాగే మన ప్రాంతములోని ప్రజలకును ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌!లు కలిగియున్న విలువైన సమాచారము అవసరము. అబద్ధమత మతగురువులు దుష్టత్వమును స్పష్టముగా బట్టబయలుచేసి, మహాబబులోను పైకి వేగముగా సమీపించుచున్న నాశనమును గూర్చిన ప్రవచనపూర్వక హెచ్చరికలను వివరించిన శీర్షికలనుండి మనము ప్రయోజనము పొందాము. 1989 సెప్టెంబరు 15, వాచ్‌టవర్‌లోని “రక్షించబడుటకు మనమేమి చేయవలెన”ను అంశము మన ప్రవర్తన, జీవిత విధానమును గూర్చి ఆచరణ యోగ్యమైన ప్రోత్సాహమును యిచ్చినది. ఇటీవలి అవేక్‌! శీర్షికలు భూ పరిసరముల యెడల మానవుని చెడు నిర్వహణను, భూమిని తిరిగి పరదైసుగా తెచ్చుటకు దేవుడు చేసిన వాగ్దానములను ప్రత్యేకించి చూపినవి. ప్రజలు తమ ఆత్మీయ అవసరతల యెడల శ్రద్ధ కలిగియుండుటకు ఎంత విస్తారమైన ఆత్మీయ ఆహారమును ఈ పత్రికలు అందించుచున్నవి!

4 ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌! పత్రికలను చదువుట ద్వారా తాను ప్రయోజనము పొందునని ఒక వ్యక్తిని మనమెట్లు ఒప్పించగలము? అందుకు అత్యంత శ్రేష్టమైన మార్గమేమనగా బహుశా, తనకు సంబంధించిన మరియు ఆసక్తిదాయకమైన ఒక నిర్దిష్టమైన అంశమును చూపించుట, అయితే దానిని ప్రభావితముగా చేయుటకు మనము పత్రికలతో బాగా పరిచయము కలిగి ముందుగా సిద్ధపడుట అవసరము. పత్రికలను ప్రాంతములో ఉపయోగించుటకు ముందు మనము వాటిని వ్యక్తిగతంగా చదువుటతో ఆ సిద్ధపాటు ప్రారంభమగును. వాటిని చదువునప్పుడు పరిచర్యలో ఉపయోగించగల అంశములను గమనించుటలో మెలకువగా ఉండుము. వాటిని మీ వ్యక్తిగత ప్రతిలో గుర్తించి, ఆ సంచికతో మీరు ప్రాంతీయ సేవకు సిద్ధపడునప్పుడు వాటిని ఎందుకు పునఃసమీక్షించ కూడదు?

5 మీరు వ్యక్తిగతంగా ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌!లను చదువునప్పుడు, మీ ప్రాంతములో కొంతమంది ప్రజలకు అందులోని ఏ శీర్షికలు ప్రత్యేకమైన ఆసక్తిదాయకంగా ఉంటాయో ఆలోచించుటయు మంచిది. ప్రత్యేకంగా డాక్టర్లకు, లాయర్లకు లేక టీచర్లకు యిష్టకరంగా ఉండు శీర్షికలేమైన ఉన్నాయా? ఈ విషయంలో రాబోవు సంచికలలో వచ్చు శీర్షికలను తెలియజేయు దానిని చూచుటకు మరచిపోకుము. ఎందుకనగా తద్వారా ముందుగనే పథకము వేసుకొని మీకు అవసరమైనన్ని అదనపు ప్రతులను ఆర్డరు చేయవచ్చును. ఎవరికి ఈ పత్రికలను అందించాలని మీరు కోరుకుంటారో వారి పేర్లను వ్రాసుకొనుట చాలా సహాయకరము.

6 అనేక పుస్తకములు రచింపబడుటను గూర్చి మాట్లాడిన తరువాత, ప్రసంగి 12:12 యిలా చెప్పుచున్నది: “విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహామునకు ఆయాసకరము.” లోక సంబంధమైన సాహిత్యములను చదువుట ఆయాసకరమే, ఎందుకనగా అవి ఏ విధమైన ఆత్మీయ విశ్రాంతిని కలుగజేయవు. దానికి భిన్నముగా యెహోవాను ఘనపరస్తూ, ఆయన నామమును, రాజ్యమును ప్రకటించు వాచ్‌టవర్‌ మరియు అవేక్‌! పత్రికలను పంచుటలో పూర్తిభాగము కలిగియుండుటకు మనమెంత కృతజ్ఞులమై యుండగలము!​—సామె. 3:9.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి