మీ నిరీక్షణ విషయమై బహిరంగంగా ఒప్పుకొన్నదానిని నిశ్చలముగా దృఢంగా పట్టుకోండి
1 కావలికోట పఠనం అనే ప్రాథమిక పద్ధతిలో ఈనాడు దేవుని ప్రజలకు ‘తగినవేళ ఆత్మీయ ఆహారం’ అందించబడుతుంది. (మత్త. 24:45) రెండు ముఖ్య ఉద్దేశాలతో మనం ఈ ప్రాముఖ్యమైన కూటానికి హాజరౌతాము: ఆత్మీయంగా కట్టబడడానికి, ఆలాగే యితరులకు మన నిరీక్షణనుగూర్చి బహిరంగంగా ప్రకటించడానికి.—హెబ్రీ. 10:23-25.
2 మనకై మనం ప్రయోజనం పొందుట: దాదాపు అన్ని సంఘాల్లోని ప్రేక్షకులలో కేవలం మూడోవంతు మంది మాత్రమే పాఠాన్ని ముందుగా సిద్ధపడతారని అంచనా వేయబడింది. దాదాపు అంతమందే వ్యాఖ్యానించడంలో భాగం వహిస్తారు. కావలికోటలో అందించబడే బలమైన ఆత్మీయాహారాన్ని కేవలం కూటంలోనే పూర్తిగా జీర్ణింపజేసుకోవడం వీలుకాదు. ఆ అంశాన్ని ముందుగా పఠనం చేయడానికి మీరు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
3 పఠనానికి సిద్ధపడేటప్పుడు, మొదటిగా శీర్షిక చివరలో యివ్వబడ్డ బాక్స్‌లోని ప్రశ్నలను చదివి, వాటినిగూర్చి ఆలోచించడం సహాయకరంగా ఉన్నట్లుగా మీరు కనుగొనవచ్చును. ఇవి పాఠంలో పరిశీలించాల్సిన ముఖ్యాంశాలపై మీ అవధానాన్ని కేంద్రీకరించేలా సహాయపడగలవు.
4 పఠనం జరిగే సమయంలో చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. ఆరంభంలో నిర్వాహకుడు చేసే వ్యాఖ్యానాలపై అవధానముంచండి; ఈ వ్యాఖ్యానాలు పఠనానికి ఒక ఆధారాన్నిస్తాయి. జవాబు చెప్పాల్సిన మూడు లేదా నాలుగు ప్రశ్నలను ఆయన అడుగవచ్చు, లేదా ఒకవేళ ఈ వారం పాఠం గత వారం పఠనం చేసినదానితో సంబంధమున్నదైతే, గత వారపు పఠనంలోని కొన్ని ఉన్నతాంశాలను ఆయన పునర్విమర్శ చేయవచ్చు. లేఖన నియమానికి లేదా బైబిలు ప్రవచనానికి సంబంధించి మనం అర్థంచేసుకొన్నదానిలో ఏదైనా దిద్దుబాటు ఉన్నట్లయితే, ఆయన మన అవధానాన్ని దానిపైన మళ్లిస్తాడు. అవును, నిరీక్షణను గూర్చి వ్యక్తంచేయడానికి సంఘానికి అవకాశమివ్వడం పఠనంయొక్క ఒక ఉద్దేశం గనుక, నిర్వాహకుడు చేసే వ్యాఖ్యానాలు క్లుప్తంగా ఉండాలి. తాము నేర్చుకొన్నవాటిపై యితరులు వ్యాఖ్యానిస్తుండగా జాగ్రత్తగా ఆలకించండి; ఇది మీ విశ్వాసాన్ని దృఢపర్చగలదు.
5 మీ నిరీక్షణను ప్రకటించండి: పఠనం జరిగే సమయాల్లో మీరు ఎప్పుడూ వ్యాఖ్యానం చేస్తుంటారా? క్లుప్తంగా, సూటిగా చేసే వ్యాఖ్యానాలు కోరబడతాయి. (లూకా 21:1-4 పోల్చండి.) హృదయంలోనుండి వచ్చే సరళమైన వ్యాఖ్యానం అందరిచే మెచ్చుకోబడుతుంది. సాధారణంగా ఒక ప్రశ్నకు మొట్టమొదట చేసే వ్యాఖ్యానం క్లుప్తంగాను, సూటిగాను ఉండాలి. తద్వారా యితరులు లేఖనాన్ని వివరించడానికి లేదా పేరాలోని వివరణపై అవధానాన్ని మళ్లించడానికి ఇది వీలుకల్గిస్తుంది. ఈ విధంగా అనేకమంది తమ నిరీక్షణను బహిరంగంగా ప్రకటించగలరు. వ్యాఖ్యానాలు ఎల్లప్పుడూ అనుకూలంగాను నిర్మాణాత్మకమైనవిగాను ఉండాలి.
6 ఇప్పుడే మీరు పఠనానికి హాజరవ్వడం ప్రారంభించితే లేదా వ్యాఖ్యానించడానికి భయపడుతుంటే, సహాయం కొరకు మీరు నిర్వాహకుని అడుగవచ్చును. ఏదైనా ఒక ప్రత్యేకమైన పేరా పరిశీలించబడుతున్నప్పుడు మీరు చేయి ఎత్తితే చూడమని చెప్పండి. బహుశ మీరు అక్కడ యివ్వబడ్డ లేఖనాన్ని చదివి మీకైమీరు క్లుప్తంగా ఆ లేఖన భావం యొక్క అన్వయింపును వ్యాఖ్యానించవచ్చు. మీరు వ్యాఖ్యానం చేసేటప్పుడు మీరు చెప్పాలనుకున్నదాన్ని గుర్తుచేసుకొనేందుకు సహాయపడడానికి మీరొకవేళ కొన్ని నోట్లను మార్జిన్లో వ్రాసుకోవచ్చును. మీరొకవేళ యువకులైనా, మీ వ్యాఖ్యానాలు ఆహ్వానించబడుతున్నవని అవి మెచ్చుకోబడతాయని గుర్తుంచుకోండి.—మత్త. 21:16.
7 మన విశ్వాసాన్ని మనం వ్యక్తం చేయడం చాలా ప్రాముఖ్యం, మరి ఆ విధంగా చేయడానికి కావలికోట పఠనం మంచి అవకాశాన్ని అందిస్తుంది. దానిని క్వాలిఫైడ్ టు బి మినిస్టర్స్ అనే పుస్తకం ఈ విధంగా వివరించింది: “సమస్య యేదైనప్పటికీ, దాన్ని అధిగమించి, కనీసం ఒక్కసారైనా వ్యాఖ్యానించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు కూటానికి సహకరిస్తారు, అలా చేయడంవల్ల మీరు చాలా సంతోషపడతారు.” (పేజి 99) కాబట్టి వచ్చే కావలికోట పఠనంలో కనీసం ఒక వ్యాఖ్యానం చేయడానికైనా ఎందుకు యోచన చేయకూడదు?—సామె. 15:23.