జ్ఞాపకార్థ కూటానికి వారు ఆహ్వానించబడ్డారని భావించేలా చేయండి
1 గత కొన్ని సంవత్సరాలలో, జ్ఞాపకార్థ కూటానికి హాజరైన ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒక్కరు మాత్రమే సువార్త ప్రచారకులైయుండెను. చాలావరకు, ఈ సంవత్సరంలో కూడ అది నిజమౌతుంది. మరొక నగరమందు నివసిస్తున్న ఒక బంధువు లేదా పరిచయస్తుడు ఆసక్తితో ప్రోత్సహించడంవల్ల కొందరు, మరికొందరైతే స్థానికంగావున్న ప్రచారకులు ఆహ్వానించడంవల్ల హాజరుకావచ్చు. హాజరైనవారిలో మరికొందరైతే, బాప్తిస్మము పొందినా, పరిచర్యయందు చురుకుగా లేనివారైయుండవచ్చు. “నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి” అనే యేసు ఆజ్ఞకు గౌరవము చూపువారందరిని మనం యథార్థంగా ఆహ్వానిస్తాము.—1 కొరిం. 11:24; రోమా. 15:7.
2 రాజ్యమందిరంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రాముఖ్యంగా క్రొత్తవారిని ఆహ్వానించడానికి, నియమించబడిన అటెండెంట్లు చురుకుగా ఉండాలి. అయినను, జ్ఞాపకార్థదిన కూటమందు ఆతిధ్యమిచ్చుటలో మనందరము భాగం వహించవచ్చు. (రోమా. 12:13) దీనిని మనమెలా చేయవచ్చు?
3 ఆసక్తిగల ప్రజలకు ఆ రోజు సాయంకాలం రవాణా సౌకర్యాన్ని అందించడంలో కొంతమంది ప్రచారకులు పనిరద్దీలో ఉంటారు. ఇతరులు, తమంతట తాముగా వచ్చే సందర్శకులను అభివందించడానికి ముందుగా రాగల్గుతారు. ఒక క్రొత్త వ్యక్తి మందిరములో ప్రవేశించినప్పుడు, అతన్ని ఆప్యాయంగా అభివందించి, సంభాషణను ప్రారంభించండి. ఆయనకు స్థానిక సహోదరులెవరైనా తెలుసేమో అడగండి. అతనికి తెలిసినట్లయితే, ఆ వ్యక్తి వచ్చేంతవరకు అతనిని జాగ్రత్తగా చూడండి. (లూకా 10:35 పోల్చండి.) అతనికి వ్యక్తిగతంగా తెలిసినవారెవరూ లేకపోతే, కూటం జరిగే సమయంలో మీతోపాటు కూర్చోడానికి మీరెందుకు అతన్ని ఆహ్వానించకూడదు? కార్యక్రమంలో రొట్టె, ద్రాక్షారసము ఎలా ఉపయోగించ బడతాయో వివరించండి. ప్రసంగీకుడు చెప్పే లేఖనాలను చూడడానికి ఆయనకు మీ సహాయమవసరమై యుండవచ్చును.
4 జ్ఞాపకార్థ దిన ఆచరణ ముగింపు నందు, అతను వచ్చినందుకు మీరెంతో ఆనందించారని తెలియజేయండి. మన పనిని గురించి మీరు జవాబివ్వగలిగే ప్రశ్నలను ఆయన కల్గియుండవచ్చు. రాజ్యమందిరంలోనైనా లేదా మరెక్కడైనా, ఏదైనా బైబిలు అంశంపై చర్చించడానికి మీ వ్యక్తిగత ఆసక్తి నడిపించవచ్చు. ఈలాంటి మెచ్చుకోదగిన చొరవ తీసికొనుటలో చురుకుగావున్న సహోదరులచే మంచి పఠనాలు ఆరంభమయ్యాయి. ఆయన రాజ్యమందిరాన్ని విడిచిపోక మునుపే, ఆయనను ఇతరులకు పరిచయం చేసి, మరలా వచ్చుటకు ఆప్యాయతతో కూడిన ఆహ్వానాన్నివ్వండి.
5 కూటములకు క్రమంగా హాజరుకాని లేదా కొంతకాలంగా పరిచర్యలో చురుకుగాలేని మన ప్రియ సహోదర సహోదరీలను ఆహ్వానించడానికి మనం ఎంతగా సంతోషిస్తాము! వారెందుకు కూటాలకు హాజరుకావడం లేదని ప్రశ్నలను అడిగే బదులు, వారక్కడ వున్నందుకు మీ సంతోషాన్ని వ్యక్తంచేయండి. యెహోవాతో వారికున్న సమర్పిత సంబంధాన్ని తిరిగి ఉన్నతం చేసుకోడానికి బహుశ జ్ఞాపకార్థ ప్రసంగ సమయంలో వారు విన్నదేదైనా వారిని పురికొల్పవచ్చు. ఆప్యాయతతో మనమిచ్చే ఆహ్వానమూ మనం ప్రదర్శించే యథార్థమైన శ్రద్ధ వారి హృదయాలను తాకవచ్చు. వారిని మరలా చూడడానికి మీరు సంతోషంతో ఎదురు చూస్తున్నారని వారికి తెల్పండి.—రోమా. 1:11, 12.
6 “నిజమైన మతం మానవ సమాజ అవసరతలను తీరుస్తుంది.” అనే అంశంపై ఏప్రిల్ 10 వ తేదీన అనేక సంఘాల్లో ఒక ప్రత్యేక బహిరంగ ప్రసంగం యివ్వబడుతుంది. జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరయ్యే వారందరూ ఆహ్వానించబడి, హాజరవ్వడానికి సహాయపడేటట్లు చూడండి. ఆహ్వానించబడ్డామనీ, యెహోవా ప్రజల మధ్యనున్న ఆప్యాయతతో కూడిన సహవాస స్ఫూర్తిని అనుభవించామని ఈ ప్రత్యేక కూటాలకు హాజరయ్యే వారందరు భావిస్తారనేదే మన నిరీక్షణ.—కీర్త. 133:1.