కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/94 పేజీలు 3-4
  • యెహోవాను పరధ్యానము లేకుండా సేవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను పరధ్యానము లేకుండా సేవించండి
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా సేవమీదే దృష్టిపెట్టండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మనం మెలకువగా ఉంటున్నామా అంటే పరధ్యానం కలుగజేసేవాటిని తప్పించుకొంటున్నామా?
    మన రాజ్య పరిచర్య—1995
  • “సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి”
    మన రాజ్య పరిచర్య—2003
  • ‘ఎడతెగక రాజ్యమును మొదట వెదకండి’
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1994
km 4/94 పేజీలు 3-4

యెహోవాను పరధ్యానము లేకుండా సేవించండి

1 “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.” (కీర్త. 144:15) రాజైన దావీదుయొక్క ఈ మాటలు, ఈ దుష్ట దినాలలో కూడ నిజమైనవేనా? (ఎఫె. 5:16) అవును! యెహోవాను సేవించడంలో క్రైస్తవులు ఇప్పటికి కూడా ఆనందాన్ని కనుగొంటున్నారు. మనకు పరిస్థితులు ఎప్పుడూ అనుకూలముగా ఉండవు. ఈ “అపాయకరమైన కాలముల” లో సాతాను మనకు కష్టాలను కలిగిస్తాడు, అయిననూ మనం కృంగిపోము. (2 తిమో. 3:1, 2) ఈ కుళ్లిపోతున్న పాత లోకాన్ని తుడిచి పారేసి దాని స్థానంలో ఒక శుభ్రమైన క్రొత్త లోకాన్ని తీసుకు రావటానికి దేవుని రాజ్యానికి సమయం ఆసన్నమైందని ఈ క్షీణిస్తున్న పరిస్థితులే ఇంకా ఎక్కువ రుజువుగా ఉన్నాయి. (2 పేతు. 3:13) ఈ ప్రపంచం యొక్క అంధకారం మన సంతోషకర నిరీక్షణయొక్క జ్వాలను కాంతిహీనం చేయలేదు లేక ఆర్పివేయలేదు; బదులుగా, మన రాజ్య నిరీక్షణ ఇంకా ఎక్కువ తేజోవంతంగా వెలుగుతుంది. ఈ అంధకార ప్రపంచంలో జ్యోతులవలె యెహోవాను సేవిస్తూ ఉండడానికి నీవు సంతోషించడం లేదా?—ఫిలి. 2:15.

2 వ్యక్తిగతముగా, మనము యెహోవాను ఎలా సేవిస్తున్నాము అనే విషయాన్ని ఎడతెగక గమనిస్తూ ఉండాలి. ఎందుకు? ఎందుకంటే సాతాను మన అవధానాన్ని ప్రక్కకు మళ్లించడంలో చాలా ప్రావీణ్యత గలవాడు. ఒక నిఘంటువు “పరధ్యానాన్ని,” “ప్రక్కకు మరలు,” “(ఒకరి అవధానాన్ని) అదే సమయంలో వేరే వస్తువు వైపు లేక వేరే దిక్కుకు మరల్చడం లేక నడిపించటం,” మరియు “సంఘర్షిస్తున్న భావోద్రేకాలు లేక ధ్యేయాలతో గల్లంతు చేయటం లేక గందరగోళపర్చటం” అని నిర్వచిస్తుంది. ఈ భూమికి త్రోసివేయబడినప్పటి నుండి, మానవజాతిని “మోసపుచ్చ” డంలో సాతాను విజయవంతుడు అయ్యాడు. మన దినంయొక్క నిజమైన వివాదాంశాల నుండి మానవుని అవధానాన్ని ప్రక్కకు త్రిప్పటానికి అతను అనేక ఉపకరణాలను ఉపయోగిస్తాడు. (ప్రక. 12:9) గత వంద సంవత్సరాలుగా రాజ్యవర్తమానాన్ని బోధించడంలో యెహోవాసాక్షులు ఎంతో కష్టపడిననూ, అన్నిటికంటే ప్రాముఖ్య వివాదాలైన, దేవుని రాజ్యంద్వారా ఆయన సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చడాన్ని మరియు దేవుని నామాన్ని పవిత్రపరచడాన్ని ఎంతమంది ప్రజలు గుణగ్రహిస్తున్నారు? చాలా కొద్దిమంది మాత్రమే. (1 యోహా. 5:19) సాతాను భూమిపైనున్న కోట్లాదిమంది ప్రజల ధ్యానాన్ని మళ్లించగల్గితే, ఎప్పుడూ ఉండే ప్రమాదమేమంటే, మనము యెహోవా సేవను వదిలిపెట్టేలా అతను మనల్ని మన ధ్యానాన్ని ప్రక్కకు మళ్లేలా చేయగలడు లేక మన అవధానాన్ని చూరగొనగలడు. దుఃఖకరంగా, కొంతమంది సహోదరులు సాతాను వలన కలిగే పరధ్యానాల చేత గందరగోళం చెందారు. వారు తమ మనస్సులను వేర్వేరు దిక్కులకు వెళ్లడానికి అనుమతించారు. ఈనాడు మన ధ్యానాన్ని ప్రక్కకు మళ్లించే సంగతులు అనేకం కలవు. వాటిలో కొన్నింటిని గమనించండి.

3 ఆర్థిక సమస్యలు మరియు వస్తుసంపద పట్ల ఆసక్తి: ప్రపంచంలోని అనేక దేశాల్లో, నిరుద్యోగం మరియు ఎక్కువగా ఉన్న జీవన వ్యయం చింతలను కలిగిస్తుంది. నిజమే, మనము మన కొరకు మన కుటుంబం కొరకు ఆహారాన్ని, బట్టలను, మరి గృహాన్ని సమకూర్చాలి. కానీ జీవిత అవసరాలను గురించి మనము మరీ ఎక్కువగా చింతిస్తూ ఉండడానికి మనల్ని మనం అనుమతించుకుంటే, ఆ చింతలు మన ఆలోచనా విధానాన్ని ఆక్రమించగలవు. రాజ్య విషయానికి మనము మద్దతు నివ్వటానికి బదులు మన భౌతిక మనుగడే జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం కాగలదు. హెబ్రీయులు 13:5, 6 నందు అపొస్తలుడైన పౌలు ఈ విషయంలో సలహా ఇచ్చాడు. రాజ్యాన్ని ముందు వెదకే వారు చింతించవలసిన అవసరంలేదని యేసుక్రీస్తు మనకు అభయాన్నిస్తున్నాడు; మనకు నిజంగా ఏది అవసరమో దానిని యెహోవా అందిస్తాడు. (మత్త. 6:25-34) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పయినీర్లు మరియు ఇతర పూర్తి కాల సేవకులు ఇది సత్యమని నొక్కి చెప్పగలరు.

4 సాతాను లోకం వస్తుసంపదపట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. లక్షలాదిమంది ప్రజల జీవితంలో ఎక్కువ సంపదను ఆర్జించటం లేక వాటిని భద్రపర్చటమే ముఖ్యాంశం. అవధానాన్ని ప్రక్కకు మళ్లించే ఈ విధమైన విషయాలు యేసు కాలంలో కూడ ఉండినవి. నిత్య జీవాన్ని పొందడానికి తానేమి చేయవలసిన అవసరం ఉందో ఒక యౌవన పరిపాలకుడు యేసును అడిగాడు. యేసు యిలా జవాబిచ్చాడు: “నీవు పరిపూర్ణుడవగుటకు [లేక, సంపూర్ణుడవగుటకు], కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము.” (మత్త. 19:16-23) బహుశా, ఈ యౌవనుడు దేవున్ని పూర్ణ మనస్సుతో సేవించడానికి అతను కలిగి ఉన్న విస్తారమైన వస్తు సంపదలు అతని ధ్యానాన్ని ప్రక్కకు మళ్లించి ఉంటాయి. అతని హృదయం అతని సంపదవైపు మరలింది. తన ధ్యానాన్ని ప్రక్కకు మళ్లించే విషయాలను తగ్గించుకుంటే అది అతనికే మంచిదని యేసుకు తెలిసి ఉండెను. దేవుని యెడల తాను చూపవలసిన భక్తి విషయంలో అతను పరిపూర్ణంగా ఉండటం నుండి అది అతన్ని అడ్డగించింది. మీ విషయమేమిటి? కేవలం మీరు అలవాటు పడిన జీవిత విధానాన్ని కొనసాగించడానికి మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారా? యెహోవాకు మీరు చేసే సేవను ఇది ప్రభావితం చేసిందా? మీ వస్తుసంపద రాజ్య ఆసక్తులకు తావు లేకుండా చేస్తుందా? (మత్త. 6:24) ఆత్మీయ ఆసక్తుల కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి మీరు మీ జీవితాన్ని సులభతరం చేసుకొనగలరా?

5 అను దిన జీవితంలోని సాధారణ విషయాలు: మనము జాగ్రత్తగా ఉండకపోతే, మనము జీవితంలోని సాధారణ విషయాల్లో ఎంతగా మునిగి పోగలమంటే, మనము ఆత్మీయ గమ్యాలను నిర్లక్ష్యం చేయటం మొదలుపెడతాము. నోవహు దినాల్లోని ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. సాంఘిక విషయాలు, తినటం మరియు త్రాగటం, పెళ్లిచేసుకోవటం మరి తమ పిల్లలను పెండ్లికి ఇచ్చుకోవటంలో వారు ఎంతగా మునిగిపోయి ఉండిరంటే, రాబోయే జలప్రళయాన్ని గురించిన నోవహు హెచ్చరికా వర్తమానాన్ని వారు ఎంతమాత్రం పట్టించుకోలేదు. వారు దానిని గుర్తించేలోపే, వరద వచ్చి వారినందరినీ తుడిచిపెట్టేసింది. వారి పరధ్యానం వారికి నాశనాన్ని తెచ్చింది. యేసు యిలా చెప్పాడు: “మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.” (మత్త. 24:37-39) వాస్తవానికి, ఈనాడు కూడ అనేకమంది ప్రజలు మనము వారి యొద్దకు తీసుకు వెళ్లే హెచ్చరికా వర్తమానానికి శ్రద్ధ చూపలేనంతగా వారు తమ స్వంత జీవితంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. వారు ఆత్మీయ విషయాలపట్ల చాలా ఎక్కువ ఉదాసీన వైఖరిని చూపిస్తారు.

6 ఆత్మీయ సంగతులకు మరీ కొద్దిపాటి అవధానాన్నే చూపగలుగునంతగా మీ జీవితం సాంఘిక కార్యకలాపాలతో క్రిక్కిరిసి ఉందా? ఒక సందర్భంలో, యేసు మార్తా, మరియల ఇంటికి అతిథిగా ఆహ్వానింపబడ్డాడు. ఆయనేమి చెబుతున్నాడో మరియ శ్రద్ధగా వింటూ ఉంది. ఇంకోవైపు, మార్త “విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడింది.” ఒక మంచి అతిథేయురాలిగా ఉండడానికి మార్త అవసరమైన దానికంటే ఎక్కువ పని పెట్టుకుంది. యేసు చెబుతున్నది వినడానికి సమయాన్ని ఇవ్వాల్సిన అవసరతను ఆమె గుణగ్రహించటంలో విఫలమైంది. విస్తారమైన ఏర్పాట్లు అవసరం లేదని ఆయన మార్తకు దయాపూర్వకంగా సూచించాడు; ఆత్మీయ విషయాలకు ఎక్కువ శ్రద్ధను ఇవ్వాలి. మీరు ఆ సలహా అన్వయించుకొనవలసిన అవసరం ఉందా? (లూకా 10:38-42) మన జ్ఞానేంద్రియాలు మందగించేంతగా మనము అతిగా తినటం, ఎక్కువగా త్రాగటం చేయకుండా ఉండటానికి మనపట్ల మనము శ్రద్ధను చూపాలని యేసు హెచ్చరించాడు. మానవ చరిత్రలోని ఈ అపాయకరమైన సమయంలో, మనము పూర్తిగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.—లూకా 21:34-36.

7 సుఖానుభవాన్ని వెదకటం: రాజ్య విషయం నుండి అవధానాన్ని ప్రక్కకు మళ్లించటానికి అపవాది ఉపయోగించేవైన అతి గొప్ప వాటిలో ఒకటి సుఖానుభవాన్ని వెదకటమే. క్రైస్తవమత సామ్రాజ్యంలోని లక్షలాదిమంది ప్రజలు దేవుని స్థానంలో తమ సుఖానుభవాన్ని ఉంచారు. దేవుని వాక్యంలో గంభీరమైన ఆసక్తిని కలిగి ఉండటానికి బదులు వారు ఏదో ప్రక్క దారులచేత ఆనందం పొందడానికి ఇష్టపడతారు. (2 తిమో. 3:4) అయితే, సరైన వినోదం మరియు ఉల్లాసం దానంతటదే తప్పేమి కాదు. కానీ దూరదర్శిని, సినిమాలు, వీడియోలు, క్రీడలు, బయటి పుస్తకాలు చదవటం, లేక సరదా పనులపై ప్రతి వారం ఎక్కువ సమయాన్ని వ్యయం చేయటం మనలను యెహోవా నుండి ప్రక్కకు తొలగించేందుకు తగిన దుష్ట హృదయాన్ని పెంపొందింపజేస్తుంది. (యిర్మీ. 17:9; హెబ్రీ. 3:12) అదెలా జరగగలదు? క్రైస్తవ కూటాలు జరిగేటప్పుడు, మీ మనస్సు ఎక్కడో విహరిస్తుందని మీరు కనుగొంటారు; మీరు సుఖానుభవాన్ని మళ్లీ వెదకుటకు వెళ్లటానికి కూటాలు త్వరగా ముగియాలని కూడ మీరు ఇష్టపడవచ్చు. త్వరలోనే, మీరు కూటాలకు హాజరవ్వటం లేక ప్రాంతీయ సేవలో పాల్గొనడానికి బదులు ఇంట్లో ఉండిపోడానికి కారణాలు వెదుకుతుంటారు. ఈ విధమైనవి మీ జీవితంలో ధ్యానాన్ని మళ్లించేవిగా తయారు అయ్యాయా అని విశదంగా నిర్ణయించవలసిన సమయం ఇదే. (లూకా 8:14) వినోదం కొరకు వ్యయమైన కొన్ని ప్రశస్తమైన గంటలు ఆత్మీయ అభివృద్ధి కొరకు శ్రేష్ఠమైన పద్ధతిలో ఉపయోగించబడవచ్చు కదా?

8 సమయాన్ని వ్యయం చేసే ప్రక్క విషయాలు: కొందరు ఆధునిక సమాజంలో తరచూ ఉండే సమస్యలను పరిష్కరించే ప్రయత్నాల్లో చిక్కుకు పోయారు. క్రైస్తవులు సాంఘిక వివాదాలను గురించిన ప్రపంచపు అంతంలేని వాదనల్లో లేక అన్యాయాన్ని చక్కదిద్దాలనే దాని నిష్ప్రయోజనమైన పోరాటాల్లో చిక్కుకొనకుండా ఉండవలసిన అవసరం ఉంది. (యోహా. 17:16) ఇదంతా కూడా బైబిలుయొక్క సలహా మరియు కేవలం దేవుని రాజ్యం మాత్రమే దీర్ఘకాల పరిష్కారమనే సిద్ధాంతపర వాస్తవం నుండి అవధానాన్ని ప్రక్కకు మరల్చడానికి సాతాను చేసే పన్నుగడయొక్క భాగమని మనం గుర్తుంచుకోవాలి. మనము వ్యక్తిగత గాయాన్ని లేక అన్యాయాన్ని సహించినట్లైతే, కక్ష తీర్చుకోవాలనే భావం కలగకుండా లేక మనము ఎవరమనే విషయాన్ని మర్చిపోయేంతగా భావోద్రేకంగా చలించిపోకుండా జాగ్రత్త పడాలి అనగా మనము యెహోవా యొక్క సాక్షులము. అన్నింటికన్నా మిన్నగా, యెహోవాయే తప్పుపట్టబడ్డాడు, మరి మనము ఆయన నామాన్ని ఉన్నతపరచవలసి ఉంది.—యెష. 43:10-12; మత్త. 6:9.

9 మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని అందరూ కోరుకున్నా, ఎన్నడూ అంతం కాని సిద్ధాంతాలకు, ఉపాయాలకు అవసరమైన దానికంటే ఎక్కువ అవధానాన్ని ఇవ్వటం ఒకరిని ఆరోగ్య విషయాలు పట్టిపీడించేలా చేస్తుంది. భౌతిక మరియు భావోద్రేక సమస్యలకు తగిన ఆహారం, చికిత్స, మరి ఉపచారాలు అనేకమైన వాటిని గురించి చెప్పే వారు ఇప్పుడు అనేకులు ఉన్నారు, కాని వాటిలో అనేకం ఒకదానితో ఇంకొకటి పొసగటం లేదు. అది బైబిలుతో విభేదంగా లేనంతవరకూ ఆరోగ్య విషయాలలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడు అనేది వ్యక్తిగతమైన విషయం. మానవజాతి రుగ్మతలన్నింటికి దేవుని రాజ్యమే నిజమైన పరిష్కారమని మనందరమూ ఎప్పుడూ పూర్ణనమ్మకాన్ని కలిగి ఉందాము.—యెష. 33:24; ప్రక. 21:3, 4.

10 స్థిరులును, కదలనివారునై ఉండండి: అంతము సమీపించే కొలది, యెహోవాకు మీరు చేసే సేవనుండి మీకు ధ్యానభంగం కలిగించాలనే తన ప్రయత్నాలను సాతాను ఎక్కువ చేస్తాడు. “విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.” (1 పేతు. 5:9) ఎలా? మిమ్మల్ని మీరు దేవుని ఆలోచనలతో పోషించుకోవాలి. (మత్త. 4:4) మీరు మరియు మీ కుటుంబం దేవుని వాక్యాన్ని ధ్యానించి, దానిని గురించి నిశ్చలంగా ఆలోచించవలసిన సమయాన్ని లోకంలోని అవరోధాలు అపహరించడానికి అనుమతించకండి. కుటుంబం భోజనం చేసేవేళ, నిర్మాణాత్మక అనుభవాలు మరియు ఇతర ఆత్మీయ విషయాలను కలిసి చర్చించండి. కూటాలకు సిద్ధపడటం మరియు వ్యక్తిగత పఠనంయొక్క పట్టికను తప్పకుండా పాటించండి.

11 చింతలు మీ మనస్సును అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తే, మీ భారాన్ని ప్రార్థనలో యెహోవాపై వేయండి. ఆయన మీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడని నిశ్చింతగా ఉండండి. (1 పేతు. 5:7) దేవుని సమాధానం మీ హృదయానికి, తలంపులకు కావలి కాయనివ్వండి. (ఫిలి. 4:6, 7) అవరోధాలు మీ ఆత్మీయ దృష్టిని అస్పష్టపరచ నివ్వకండి. యేసు చేసినట్లు, యెహోవాను ఎప్పుడూ మీ ముందు ఉంచుకోండి. (అపొ. 2:25) సామెతలు 4:25-27 ప్రోత్సహిస్తున్నట్లు, మీ దృష్టిని మీ గమ్యంపైనే కేంద్రీకరించి ఉంచండి: “నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.”

12 అన్ని కూటాలకు నమ్మకంగా హాజరౌతూ, దేవుని వాక్యం నుండి వస్తున్న ఉపదేశాలకు అవధానాన్ని ఇవ్వటానికి మిమ్మల్ని మీరే క్రమ శిక్షణలో ఉంచుకొనండి. (హెబ్రీ. 2:1; 10:24, 25) కుళ్లిపోతున్న ఈ లోకం అందించే సుఖానుభవాల కొరకు వెదకటం కంటే, ఫలభరితమైన సేవను కలిగి ఉండటం మీ గమ్యంగా చేసుకోండి. ఇదే నిత్య ఆనందాన్ని సంతృప్తిని తెస్తుంది. (1 థెస్స. 2:19, 20) చివరిగా, మిమ్మల్ని మీ పరిశుద్ధ పరిచర్య నుండి ఏదైనా లేక ఎవరైనా మీ ధ్యానాన్ని ప్రక్కకు మళ్లించ నివ్వకండి. “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”—1 కొరిం. 15:58.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి