ప్రశ్నాభాగము
◼ ఒక క్రమ పయినీర్ సంఘమునకు మారినప్పుడు సంఘ కార్యదర్శి ఏమిచేయాలి?
సంఘ రిపోర్టు (ఎస్-1) కార్డు వెనుక ఇవ్వబడిన స్థలాన్ని ఉపయోగిస్తూ కార్యదర్శి ఆ విషయాన్ని సొసైటికి తెలియజేయాలి. దీనికి ప్రత్యేక కాలమ్‌లేదు అయినా, ఆ పయినీర్ ఎక్కడనుండి వచ్చాడో ఆ సంఘం పేరుకూడా తెలియజేయాలి. ఆలాగే కార్యదర్శి పయినీర్ వచ్చిన సంఘపు కార్యదర్శికి వెంటనే ఉత్తరం వ్రాసి ఫైల్‌నందు ఈ పయినీర్‌కు చెందిన పబ్లిషర్ కార్డులను (ఎస్-21), ఆ సంఘ సేవాకమిటీనుండి పరిచయ లేఖను రప్పించుకోవాలి.
పరిస్థితుల్నిబట్టి ఒక పయినీర్ ఇక్కడికే కదిలివస్తే, స్థిరపడటానికి, సేవకొరకు ఒక నియమిత పద్ధతి నేర్పరచుకోవడానికి తరచు అతను కొంత ఇబ్బంది పడాల్సివస్తుంది. ఈ క్రొత్త సంఘానికి అతని రాక సాధ్యమైనంత మేరకు సాఫీగా ఉండేలా పెద్దలు ప్రేమపూర్వకంగా అందించే సహాయాన్ని ఆ పయినీర్ ఎంతో ప్రశంసిస్తాడు.
గమనిక: ఒక క్రమ పయినీర్ కదిలివెళితే ఆ కదిలివెళ్లిన సంఘ కార్యదర్శి ఎస్-1 కార్డుమీద ఏమి వ్రాయకూడదు. పయినీర్ ఎక్కడికి వెళతాడో ఆ సంఘపు కార్యదర్శి మాత్రమే ఆ కార్డుపై వ్రాయాల్సివుంటుంది. అదేవిధంగా, ఒక పయినీర్ సహోదరి వివాహం చేసుకొని మరో సంఘానికి వెళితే, ఆ సహోదరి అంతకుముందున్న సంఘ కార్యదర్శి వ్రాయనవసరం లేదుగాని, ఆ పయినీర్ వచ్చిన సంఘపు కార్యదర్శి ఆ పయినీర్ పాత, క్రొత్త పేర్లను సూచిస్తూ, ఆమె మారిన పేరును, ఆమె పూర్వమున్న, ప్రస్తుతమున్న సంఘాల పేర్లను సొసైటికి తెలియజేయాలి.
పూర్తికాల సేవనుండి ఒక క్రమ పయినీర్ విరమించుకొన్నప్పుడు లేదా ఏదైనా కారణంచేత తొలగింపబడినప్పుడు కూడ ఎస్-1 కార్డు వెనుక ఏమియు వ్రాయకూడదు. పయినీర్ సేవచేస్తున్న సంఘ కార్యదర్శి నోటిఫికేషన్ ఫర్ డిస్‌కంటిన్యూయింగ్ రెగ్యులర్ పయినీర్ సర్వీస్ (ఎస్-206) ఫారమ్‌ను సొసైటికి పంపాలి. అట్టి రెండు ఫారాలు ప్రతి సంఘానికి పంపబడ్డాయి. వాటి అసలు కాపీలను సంఘ పర్మనెంటు ఫైలునందు ఉంచి, అవసరం వచ్చినప్పుడు వాటి ఫొటో కాపీలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ ఫారమ్ మీవద్ద లేనట్లయిన, మీరు అవసరమైన కాపీలు తయారుచేసుకోవడానికి వీలుగా మీ ఫైలు కొరకు రెండు ఫారాలు పంపమని సొసైటికి మీరు వ్రాయవచ్చును.
మానివేయడాన్ని గూర్చి సొసైటికి వ్రాసేటప్పుడు, ఆ ఫారంలోని విషయాలన్నీ జాగ్రత్తగా చదివి అన్ని కాలమ్స్‌ను పూర్తిచేయాలి. మానివేయడాన్ని తెలియజేసే అన్ని సమయాల్లో పయినీర్‌కు ఇవ్వబడిన గుర్తింపు కార్డును కూడ జతచేయాలి. పయినీర్ ఒకవేళ తన గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే, అది కూడ ఆ ఫారమ్‌లో వ్రాయాలి.
ఒక క్రమ పయినీర్ సేవకు సంబంధించి ఏ మార్పులను గూర్చి అయినా సొసైటికి వ్రాసేటప్పుడు దయచేసి సత్వరమే, సరైన అన్ని వివరాలు తెల్పండి. కొన్నిసార్లు ‘మా సంఘంలో పయినీర్ సేవ మానుకున్నాడని’ మాకు ఉత్తరం వస్తుంది, గాని అందులో అతని పేరుండదు. అప్పుడప్పుడు మాకు ఒక పయినీర్ క్రొత్త సంఘానికి మారి, తన పయినీర్ సేవలో కొనసాగుతున్నా ఎస్-206 ఫారాలు అందుతున్నాయి. ఒక పయినీర్ మీ సంఘాన్నుండి మారి మరో సంఘంలో ఇంకనూ క్రమ పయినీర్‌గా సేవచేస్తుంటే ఎస్-206 ఫారమ్ పంపవద్దు. పయినీర్‌యొక్క క్రొత్త సంఘపు కార్యదర్శి సంఘ మార్పును గూర్చి, ఒకవేళ వర్తిస్తే పేరు మార్పును గూర్చి మాకు తెలియజేస్తాడు. అంతేకాకుండ కాంగ్రిగేషన్ రిపోర్టు (ఎస్-1) కార్డుపై దయచేసి ప్రత్యేక పయినీర్ సేవను వ్రాయవద్దు. కేవలం సంఘ ప్రచారకుల, సహాయ పయినీర్ల, క్రమ పయినీర్ల సేవను రిపోర్టు చేయడానికే ఈ కార్డు నుపయోగించాలి. ప్రత్యేక పయినీర్లు తమ రిపోర్టులను నేరుగా సొసైటికే పంపిస్తారు.
ఈ విషయాలపై మీరు ధ్యానముంచడం మేము మా రికార్డులు నిర్వహించుటకు మాకెంతో సహాయం చేస్తుంది, ఆలాగే యెహోవాకు మహిమతెచ్చే ప్రగతిశీల కార్యాసక్తులన్నింటిలో ప్రాంతీయ అవసరతలయెడల మరిశ్రేష్ఠముగా సేవచేయడానికది మాకు దోహదపడుతుంది.