కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/95 పేజీ 1
  • “మెలకువగా ఉండుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మెలకువగా ఉండుడి”
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • “మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • “అప్రమత్తంగా ఉండండి”—తీర్పు తీర్చే గడియ వచ్చింది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 7/95 పేజీ 1

“మెలకువగా ఉండుడి”

1 మత్తయి 26:38-41 నందు వ్రాయబడిన మాటలను యేసు చెప్పినప్పుడు, ఆయన తన మానవ ఉనికి యొక్క అత్యంత క్లిష్టమైన సమయాన్ని చేరుకోబోతున్నాడు. అది మానవ చరిత్రంతటిలోకెల్లా అత్యంత ప్రాముఖ్యమైన సమయంగా రుజువౌతుంది. మానవజాతంతటి రక్షణ వివాదంలో ఉంది. యేసు శిష్యులు “మెలకువగా ఉండ”వల్సిన అవసరముంది.

2 విమోచకునిగా, తీర్పును అమలుచేయు వానిగా యేసు ద్వంద్వ పాత్రలోని ఆయన ఆగమన సమయంలో నేడు మనం జీవిస్తున్నాము. మనం జీవిస్తున్నది అత్యవసర సమయమని గ్రహించిన, మెలకువగల క్రైస్తవులుగా, మనం విడుదల కొరకు వేచిచూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోము. మనం అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని మనకు తెలుసు. యెహోవాకు మనం చేసే సేవలో “ప్రయాసముతో పాటుపడుచు” ఉండాల్సిన అవసరం మనకుంది. (1 తిమో. 4:10) అయితే వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరి విషయమేమై ఉంది? మనం మెలకువగా ఉన్నామా?

3 మనల్నిమనం పరిశీలించుకోవడం: యేసు ఇలా కూడా హెచ్చరించాడు: “మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34, 35) మనం “మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులునుగా” ఉంటున్నామని నిశ్చయపర్చుకోడానికి, మనపట్ల మనం శ్రద్ధవహించాలి. (ఫిలి. 2:14, 15) మనం యేసును అనుకరిస్తూ, దేవుని వాక్యంలో చూపబడిన సూత్రాలకు అనుగుణంగా నడుస్తూ, అనుదినం క్రైస్తవులుగా జీవిస్తున్నామా? “దుష్టునియందున్న” లోకంలో వ్యాపించి ఉన్న క్రైస్తవవిరుద్ధ ప్రవర్తనను మనం విసర్జించాలి. (1 యోహా. 5:19; రోమా. 13:11-14) లేఖనాల వెలుగులో మనల్నిమనం పరిశీలించుకున్నప్పుడు, యేసు ఉపదేశించినట్లు మనం వాస్తవంగా మెలకువగా ఉన్నామా?

4 పెద్దలు తాము మందను ఎలా పరిరక్షిస్తున్నామన్న విషయమై లెక్క ఒప్పజెప్పాలన్న విషయాన్ని గ్రహిస్తూ, సంఘంలోని తమ నియామకాలను సరిగ్గా నిర్వహించేందుకు పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. (హెబ్రీ. 13:17) తమ ఇంటివారిని యెహోవా మార్గాలలో నడిపించాల్సిన ప్రత్యేక బాధ్యత కుటుంబ యజమానులకు ఉంది. (ఆది. 18:19; యెహో. 24:15; 1 తిమో. 3:4, 5 పోల్చండి.) అంతేకాకుండా, ఒకరినొకరం ప్రేమించాలన్న లేఖనాధార ఆజ్ఞను మనందరం పాటించడం కూడా ఎంతో ప్రాముఖ్యం! అది నిజ క్రైస్తవత్వానికి సూచన.—యోహా. 13:35.

5 ఇతరులను హెచ్చరించడానికి అప్రమత్తంగా ఉండండి: మెలకువగా ఉండటంలో మనపట్ల మనం శ్రద్ధవహించడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. ఇతరులను శిష్యులుగా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. (మత్త. 28:19, 20) ఈ లోకం ఎదుర్కోబోతున్న నాశనాన్ని ఇతరులు తప్పించుకునేలా మనం వారిని హెచ్చరించడానికి పొరుగువారి ఎడల ప్రేమ మనల్ని పురికొల్పాలి. ఇది క్రైస్తవులు అందరి పై ఉన్న బాధ్యత. అది మన ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగం. (రోమా. 10:9, 10; 1 కొరిం. 9:16) జీవాన్ని కాపాడే ఈ పనిపట్ల మనం తరచూ ఉదాసీనతను లేక పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటాము. మన హెచ్చరికను అత్యధికులు అలక్ష్యం చేసినా ఎడతెగక కొనసాగవలసిన బాధ్యత మనకుంది. (యెహె. 33:8, 9) దేవుని ఎడల, పొరుగువాని ఎడలగల యథార్థమైన ప్రేమ, మనం ఎడతెగక కొనసాగేలా చేస్తుంది.

6 ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు. అనుదిన జీవిత చింతలు మనకు పరధ్యానం కల్గించనివ్వకూడదు మనం అలాగే ఈ విధానపు ఆనందాలు మనకు ఉరులయ్యేంతగా వాటిలో ఇమిడిపోకూడదు. (లూకా 21:34, 35) అత్యవసర భావంతో ఉండాల్సిన అవసరత మరే ఇతర సమయం కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది. ఈ దుష్ట విధానానికి విరుద్ధంగా యేసుక్రీస్తు తీర్పుతీర్చవలసిన సమయం ఆసన్నమైంది. జాగరూకంగా, చురుకుగా మరియు మెలుకువగా ఉండేవారే తప్పించుకోగలరు. మనం యేసు ఉపదేశాలకు లోబడి, “జరుగబోవు వీటినెల్లను తప్పించుకొన”గల్గితే, మనమెంత కృతజ్ఞత కలిగి ఉంటామోగదా!—లూకా 21:36.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి