కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/95 పేజీ 1
  • మీరెలాంటి వ్యక్తులై ఉండాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెలాంటి వ్యక్తులై ఉండాలి?
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘కనిపెట్టుకొని’ ఉండే స్వభావం మీకుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యేసుయొక్క దైవభక్తి మాదిరిని అనుసరించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మీ సహనానికి భక్తిని అమర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 8/95 పేజీ 1

మీరెలాంటి వ్యక్తులై ఉండాలి?

1 మానవజాతియంతా లెక్కఒప్పజెప్పవలసిన సమయం దగ్గరపడింది. బైబిలు దానిని “యెహోవా దినం” అని పిలుస్తుంది. దుష్టులకు వ్యతిరేకంగా దైవిక తీర్పు విధించబడే సమయం ఇదే; నీతిమంతులను విడుదల చేసే సమయం కూడా ఇదే. అప్పుడు జీవించి ఉన్నవారందరూ తాము తమ జీవితాలను ఎలా ఉపయోగించారనేదానికి లెక్కఒప్పజెప్పడానికి పిలువబడతారు. దానిని మనస్సులో ఉంచుకొని పేతురు లోతుగా విచారింపజేసే ఈ ప్రశ్నను అడిగాడు: “మీరెలాంటి వ్యక్తులై ఉండాలి”? ‘పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను యెహోవా దినమును గూర్చి ఎంతో జాగ్రత్తగలవారమై ఉండాలి’ అనే దాని ప్రాముఖ్యతను గూర్చి, అలాగే ‘నిష్కళంకులుగాను, నిందారహితులుగాను సమాధానముతోను’ ఉండవలసిన అవసరాన్ని గూర్చి కూడా ఆయన నొక్కి చెబుతున్నాడు.—2 పేతు. 3:11-14 (NW).

2 పరిశుద్ధమైన ప్రవర్తనలు మరియు దైవభక్తితో కూడిన క్రియలు: పరిశుద్ధ ప్రవర్తనయందు బైబిలు సూత్రాలయెడల గౌరవాన్ని చూపించే మాదిరికరమైన పనులు ఇమిడి ఉన్నాయి. (తీతు 2:7, 8) స్వార్థపూరితమైన, శారీరక కోరికలచే ప్రేరేపించబడిన లోక నడవడిని క్రైస్తవుడు వర్జించాలి.—రోమా. 13:11, 14.

3 “దైవభక్తి” అనేది “దేవుని ఆకర్షణీయమైన గుణాల ఎడల ప్రగాఢమైన మెప్పుదలతో ప్రేరేపించబడిన హృదయం నుండి ఆయన ఎడల కలిగిన వ్యక్తిగతమైన అనురాగమని” వర్ణించబడింది. పరిచర్యలో మన ఆసక్తి మనం ఈ గుణాన్ని చూపించే ముఖ్యమైన మార్గము. ప్రకటనా పని చేయడంలోని మన ఉద్దేశం కేవలం కర్తవ్యాన్ని నిర్వహించడం కాదు గాని; యెహోవా ఎడల మనకు గల ప్రగాఢమైన ప్రేమ వల్లనే మనం ఆ పని చేస్తాము. (మార్కు 12:29, 30) ఇలాంటి ప్రేమతో ప్రేరేపించబడి, మనం మన పరిచర్యను మనకున్న దైవభక్తిని అర్థవంతంగా వ్యక్తంచేయడమని దృష్టిస్తాము. మన భక్తి నిరంతరమూ ఉండాలి గనుక, ప్రకటనా పనిలో మనం క్రమంగా భాగం వహించాలి. ఇది మన వార కార్యక్రమ పట్టికలో ముఖ్యమైన భాగమై ఉండాలి.—హెబ్రీ. 13:5.

4 యెహోవా దినాన్ని “మనస్సులో” ఉంచుకోవడం అంటే దాన్ని మన దైనందిన తలంపుల్లో ప్రధానమైనదిగా ఉంచుకోవాలని భావం. దాన్ని జీవితంలో అంత ప్రాముఖ్యత లేనిదిగా ఎన్నడూ త్రోసిపుచ్చకూడదు. మన జీవితాల్లో రాజ్యాసక్తులను ముందుంచాలని దాని భావము.—మత్త. 6:33.

5 నిష్కళంకంగా, నిందారహితంగా, మరియు సమాధానంగా: గొప్ప సమూహంలో భాగంగా మనం ‘గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నాం.’ (ప్రక. 7:14) “నిష్కళంకము”గా ఉండడమంటే మనం శుద్ధమైన సమర్పించుకున్న జీవితాలను లోక మాలిన్యాలు అంటకుండా ఎప్పుడూ కాపాడుకోవాలి. భక్తిహీనమైన వస్తుసంపద కొరకైన అన్వేషణలు మన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని పాడు చేయడాన్ని మనం నిరాకరించడం ద్వారా మనల్ని “నిందారహితులను”గా ఉంచుకుంటాం. (యాకో. 1:27; 1 యోహాను 2:15-17) ఇతరులతో గల మన వ్యవహారాలన్నింటిలో మనం ‘దేవుని సమాధానాన్ని’ ప్రతిబింబించడం ద్వారా మనం ‘సమాధానమందు’ జీవిస్తున్నామని మనం కనబరుస్తాము.—ఫిలి. 4:7; రోమా. 12:18; 14:19.

6 మనం విజయవంతంగా లోకమాలిన్యానికి వ్యతిరేకంగా జాగ్రత్తపడితే, మనమెన్నడూ యెహోవా నిందించే ‘ఈ లోక మర్యాదను అనుసరించము.’ బదులుగా, మన మంచి పనులు “దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” ఇతరులు తెలుసుకోవడానికి వారికి సహాయపడతాయి.—రోమా. 12:2; మలా. 3:18.

7 యెహోవా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా నవోత్తేజాన్ని కలిగించే ఆత్మీయాహారాన్ని ఎడతెగక ఇస్తూనే ఉన్నాడు, అది మన దైవభక్తిని కనబరచాలనే కోరికను తీవ్రం చేస్తుంది. ఎందరో క్రొత్తవారు ఈ కోరికను పంచుకుంటారు. ఆగష్టు నెలలో ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడానికి వారికి సహాయపడడం ద్వారా మనం ఆశీర్వాదకరంగా ఉండగలము.

8 మనం మనఃపూర్వకంగా “సత్‌క్రియలను” చేస్తున్నప్పుడు యెహోవా నామము స్తుతించబడుతుంది, సంఘం బలపరచబడుతుంది, ఇతరులు ప్రయోజనం పొందుతారు. (1 పేతు. 2:12) మనమెల్లప్పుడూ అలాంటి వ్యక్తులుగా ఉందుము గాక.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి