మీ అభివృద్ధిని తేటపర్చండి
1 మీరు మొదటిసారిగా రాజ్య సువార్తను విన్నప్పటి సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరళమైన సత్యాలు, జ్ఞానాన్ని అవగాహననూ పొందాలన్న మీ కోరికను రేపాయి. మీ జీవిత విధానం కంటే యెహోవా విధానాలు ఎంతో ఉన్నతమైనవి కనుక మీరు సర్దుబాటు చేసుకునేందుకు గల అవసరతను మీరు త్వరలోనే గుర్తించగలిగారు. (యెష. 55:8, 9) మీరు అభివృద్ధి చెంది, మీ జీవితాన్ని సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారు.
2 కొంతమేరకు ఆత్మీయ పురోగతి చెందిన తర్వాత కూడా, అధిగమించాల్సిన బలహీనతలనేకం ఉంటాయి. (రోమా. 12:2) బహుశ ప్రాంతీయ సేవలో పాల్గొనేందుకు మీరు వెనుకాడేలా చేసిన, మనుష్య భయం మీకు ఉండివుండవచ్చు. లేక బహుశ దేవుని ఆత్మఫలాన్ని ఫలించలేకపోవచ్చు. వెనుకంజవేసే బదులు, మీ కొరకు దైవపరిపాలనా గమ్యాలను ఏర్పర్చుకుని మీరు పురోగమించేందుకు నిర్ణయించుకున్నారు.
3 మీరు సమర్పించుకుని అనేక సంవత్సరాలు గడిచివుండవచ్చు. వెనక్కు తిరిగి చూసినప్పుడు మీలో మీరు ఏ అభివృద్ధిని చూడగలరు? మీరు మీ గమ్యాల్లో కొన్నింటిని చేరుకున్నారా? మీకు “మొదట” ఉన్న అదే ఆసక్తి ఉందా? (హెబ్రీ. 3:14) “నీ అభివృద్ధి అందరికి కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము” అని పౌలు తిమోతికి ఉద్బోధించినప్పటికే ఆయన అనేక సంవత్సరాల అనుభవంతో పరిపక్వతకెదిగిన క్రైస్తవునిగా ఉన్నాడు.—1 తిమో. 4:15.
4 వ్యక్తిగత పరిశీలన అవసరం: మనం మన గత జీవిత విధానాన్ని గూర్చి ఆలోచించినప్పుడు, సత్యం నేర్చుకోవడం ప్రారంభించినప్పుడున్న బలహీనతలు ఇంకా మనలో ఉన్నట్లుగా మనం కనుగొన్నామా? మనం ఏర్పర్చుకున్న కొన్ని గమ్యాలను మనం చేరుకోవడంలో మనం విఫలులమయ్యామా? అయినట్లైతే, ఎందుకు? మనకు మంచి ఉద్దేశాలున్నప్పటికీ, వాటిని వాయిదా వేసివుంటాము. బహుశ జీవిత చింతలు లేక ఈ విధానపు ఒత్తిళ్లు మనలను వెనక్కు లాగేందుకు మనం అనుమతించి ఉంటాము.—లూకా 17:28-30.
5 జరిగిపోయిన దాని విషయంలో మనం ఏమీ చేయలేకపోయినప్పటికీ, భవిష్యత్తును గూర్చి మనం ఏమైనా చేయవచ్చు. మనలను గూర్చి మనం యథార్థంగా అంచనా వేసుకుని, ఏ విషయంలో మనం కొరవడుతున్నాము అన్న దాన్ని తేల్చుకుని, అభివృద్ధి చేసుకునేందుకు ఏకాగ్రతతో కృషి చేయవచ్చు. దేవుని ఆత్మ ఫలాలైన, ఆశానిగ్రహం, సాత్వికం, లేక దీర్ఘశాంతం వంటి వాటిని కనపర్చడంలో బహుశ మనం మరింత కృషి చేయవల్సి ఉండవచ్చు. (గల. 5:22) ఇతరులతో మనం మంచి సంబంధాలను కల్గివుండడంలో లేక పెద్దలతో సహకరించడం మనకు కష్టంగా ఉంటే, మనం నమ్రతను మరియు వినయమైన మనస్సును అలవర్చుకోవడం ప్రాముఖ్యం.—ఫిలి. 2:2, 3.
6 సేవాధిక్యతలను పొందేందుకు కృషిచేయడం ద్వారా మన అభివృద్ధిని మనం కనబర్చగలము? ప్రత్యేక ప్రయత్నాలు చేయడం ద్వారా సహోదరులు పరిచారకులుగా పెద్దలుగా అయ్యే అర్హతను పొందగలుగుతారు. మనలో కొందరం క్రమపయినీర్లుగా పనిచేయవచ్చు. మరి అనేకులకు సహాయ పయినీరింగు సులభంగా చేరుకోగల గమ్యంగా ఉండవచ్చు. ఇతరులు వ్యక్తిగత పఠన అలవాట్లను మెరుగుపర్చుకునేందుకు, సంఘంలో మరింత చురుకుగా పాల్గొనేందుకు లేక సంఘ ప్రచారకులుగా మరింత ఫలవంతంగా ఉండేందుకు కృషి చేయగలరు.
7 నిస్సందేహంగా, ఎక్కడ అభివృద్ధి చెందాలన్న విషయాన్ని మనమే నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒకరిపై ఉంది. మనం “సంపూర్ణులమగుటకు సాగిపోదము” మనం చేసే యథార్థమైన ప్రయత్నం మన ఆనందాన్ని అధికం చేస్తుందని మరియు సంఘంలో మనలను మరింత ఫలవంతమైన సభ్యులనుగా చేస్తుందన్న నిశ్చయాన్ని మనం కల్గివుండవచ్చు.—హెబ్రీ. 6:1.