కొందరిని రక్షించేందుకు పునర్దర్శించండి
1 “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెన”నేది దేవుని చిత్తం. (1 తిమో. 2:4) సహాయం చేసేందుకు మనమేమి చెయ్యగలం? సత్యాన్ని బోధించాలనే ఉద్దేశంతో పునర్దర్శనాల్ని చేయండి. మీరేమి చెబుతారు? ఈ క్రింది సలహాలు మీకు సహాయపడవచ్చు.
2 “నిన్ను సంతోషపరచు సువార్త” అనే పుస్తకాన్ని తీసుకున్న వారిని పునర్దర్శించినప్పుడు 4వ పేజీలోని చిత్రాన్ని మరల చూపించి గృహస్థుని ఇలా అడగండి:
◼ “నేను మీకిచ్చిన పుస్తకాన్ని పరిశీలించాక, పరదైసు భూమిని గూర్చిన దేవుని వాగ్దానాన్ని ఆలోచించిన తర్వాత, మానవజాతి కొరకు దేవుడు వాగ్దానం చేసిన ఈ వాగ్దానాల్ని గురించి మీరెలా బావించారు?” గృహస్థుని ప్రత్యుత్తరాన్ని గుర్తించి, దానిపై క్లుప్తంగా వ్యాఖ్యానించిన తర్వాత, మీరు 2వ అధ్యాయంపై అవధానాన్ని నిలిపి ఈ వాగ్దానాలు ఎలా మనకు విశ్వసనీయంగా అందించబడ్డాయో తెలియజేయండి. మరలా దర్శించడానికి ఓ ఏర్పాటును చేసుకోండి.
3 “జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?” అనే పుస్తకాన్ని మీరు ఇచ్చినట్లైతే, ఇలా చెప్పడం ద్వారా సంబాషణను మీరు మరలా ప్రారంభించవచ్చు:
◼ “నేను ఇంతకుముందు వచ్చినప్పుడు, మరణం ఇక ఉండని ఓ శాంతియుతమైన క్రొత్త ప్రపంచాన్ని సృష్టించే దేవుని సంకల్పాన్ని గూర్చి మనం మాట్లాడాం. అలాంటి నిరీక్షణ, మన జీవితాలకు నిజమైన సంకల్పాన్ని అర్ధాన్ని ఎలా తేగలదో మనం పరిశీలించాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ఆశీర్వాదాల్ని పొందనర్హులయ్యేందుకు మనం ఏమి చేయాలి? అన్నదే. ఆ ప్రశ్నకు మీరేమని జవాబిస్తారు?” జవాబు చెప్పనివ్వండి. దేవుని వాక్య పఠనం ద్వారా బలమైన విశ్వాసాన్ని నిర్మించుకొనే అవసరతను నొక్కి చెబుతూ 189వ పేజీకి త్రిప్పి, 2వ పేరాలోని అభిప్రాయాల్ని చర్చించండి. మన బైబిలు పఠన కార్యక్రమం నుండి ప్రయోజనాన్ని పొందడం ద్వారా దీన్ని ఎలా చేయవచ్చో వివరించండి.
4 “నీ రాజ్యము వచ్చుగాక” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చినచోట మీరు వెళ్లి ఇలా చెప్పవచ్చు:
◼ “తన రాజ్యం ద్వారా ప్రపంచంలోని బాధ, దౌర్జన్యాలకు అంతాన్ని తీసుకువచ్చే దేవుని వాగ్దానాన్ని పరిశీలించమని మిమ్మల్ని ఆహ్వానించాను. నేడు మానవజాతి తీవ్రమైన బాధలకు కారణమైన మత, రాజకీయ సంస్థలకు అంతాన్ని దేవుడు తెస్తాడని మీరనుకుంటున్నారా? ‘అర్మగిద్దోనునందు రాజు యుద్ధం చేస్తాడు’ అనే 17వ అధ్యాయాన్ని బహుశా మీరు చదివి ఉండవచ్చు. ఆ అధ్యాయంలో కొన్ని లేఖనాల్ని మీతో కలిసి కొన్ని నిమిషాలపాటు పరిశీలించడానికి నేను ఇష్టపడ్తున్నాను.” ఆ వ్యక్తి అంగీకరించినట్లైతే, లేఖనాల్ని చదివి, 170-3 పేజీల్లో 17-24 పేరాల్లో పొందుపర్చబడిన సమాచారాన్ని మీరు చర్చించవచ్చు.
5 “నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము” అనే పుస్తకాన్ని ఇచ్చినచోట మీరు వెళ్లి ఇలా చెప్పవచ్చు:
◼ “నిరంతర భవిష్యత్తు కొరకు మీ కుటుంబాన్ని మీరెలా సిద్ధపర్చగలనే దానిని గురించి మీకు మరింత తెలియజేయడానికి నేను మరలా వచ్చాను.” 189వ పేజీలోని చిత్రం వైపు త్రిప్పి, 188వ పేజీలోని 15-17 పేరాల్ని చదవండి, తర్వాత ఈ వాగ్దానాన్ని దేవుని రాజ్యం ఎలా నెరవేరుస్తూందో క్లుప్తంగా వివరించండి. ఉచిత గృహ బైబిలు పఠనాన్ని ప్రతిపాదించండి.
6 పునర్దర్శనాలు చేయడం యొక్క లక్ష్యం బైబిలు పఠనాల్ని ఆరంభించడమేనని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం విశేషంగా బైబిలు పఠనాలు నిర్వహించడానికే రూపొందించబడింది. పాత పుస్తకాల్ని ఇచ్చినచోట మనం పునర్దర్శనం చేసి, ఓ బైబిలు పఠనాన్ని నిజంగా ఆరంభించినప్పుడు, ఈ పుస్తకం వైపుకి అవధానాన్ని మళ్లించడం మంచిదౌతుంది. పఠిస్తున్న వారు రక్షణ నిమిత్తం యెహోవా నామాన్నిబట్టి ప్రార్థించినప్పుడు మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం.—అపొ. 2:21.