అంతర్దృష్టితో ప్రకటించండి
1 అంతర్దృష్టిని కల్గివుండేందుకు, మనం ఎవరికి ప్రకటిస్తామో ఆ ప్రజలను గురించి మనకు కొంత అవగాహన అవసరం. ఎందుకు? ఎందుకంటే ప్రజల హృదయాల్ని చేరుకోవడమందలి మన సాఫల్యం, వారిని ఆకట్టుకొనే రీతిలో రాజ్య వర్తమానాన్ని అందించే మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. జనవరి నెలలో, సంఘంలో మిగిలివున్న వివిధ బైబిలు పఠన పుస్తకాల్ని మనం అందించబోతున్నాం. అవి లేకపోతే, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని ప్రచారకులు ఉపయోగించవచ్చు, ఆ పుస్తకాన్ని తెలుగులో తప్ప ప్రత్యేకమైన ధరకు అందించకూడదు. ఈ క్రింది సలహాలు సహాయకరమైనవిగా ఉండవచ్చు.
2 “నిన్ను సంతోషపరచు సువార్త”అనే పుస్తకాన్ని అందించడానికి మీరు ఎంపిక చేసుకుంటే 4వ పేజీలోని చిత్రానికి త్రిప్పి మీరిలా చెప్పగలరు:
◼ “ఈ దృశ్యచిత్రీకరణ, భూమి ఎడల దేవునికిగల సంకల్పాన్ని గూర్చి బైబిలు చెబుతున్న దాని యొక్క ఊహా చిత్రమే. భూ పరదైసులో జీవించేందుకు మీకు, మీ కుటుంబానికి ఏమి అవసరమవుతుందని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] నిజమైన శాంతి భద్రతలు త్వరలోనే భూ వ్యాప్తంగా వాస్తవమై ఉంటాయని, పరదైసు పునఃస్థాపించబడ్తుందని బైబిలు తెలియజేస్తోంది. [కీర్తన 37:10, 11 చదవండి.] దేవుడు చేయబోయే దాని నుండి ప్రయోజనం పొందేందుకు మీరు చేయాల్సిన దానిని గురించి ఈ పుస్తకం తెలియజేయగలదు. ఈ పుస్తక ప్రతిని మీరు కల్గివుండాలని కోరుకుంటున్నాను.” తర్వాత, బహుశా ప్రత్యేకమైన ధరకు ప్రతిపాదించే మరో పుస్తకంతోపాటు ఈ పుస్తకాన్ని ప్రతిపాదించండి.
3 “జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?” అనే పుస్తకాన్ని మీరు చూపించినట్లైతే మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “ప్రపంచమంతటా ఉన్న లక్షలాదిమంది ప్రజలు సంతోషం కొరకు ఎదురు చూస్తున్నారు, దాన్ని పొందడానికి వారెన్ని ప్రయత్నాలు చేసినా పొందలేకపోతున్నట్లు కన్పిస్తుంది. అనేకులు జీవితాన్ని, కొన్ని సంవత్సరాలు జీవించి పిల్లల్ని పెంచి మరియు తాము మరణించక ముందు శ్రేష్ఠమైన దాని కొరకు ఎదురుచూసే ఓ విషయంగానే దృష్టిస్తారు.” తర్వాత 145వ పేజీ నందలి 2 నుండి 5 పేరాల్లోని కొన్ని అభిప్రాయాల్ని పంచుకొని, కీర్తన 37:11వ వచనాన్ని చదవండి మరియు 142వ పేజీలో వర్ణించబడినటువంటి పరదైసును అంటే ఓ క్రొత్త ప్రపంచాన్ని సృష్టించడమే దేవుని సంకల్పమని క్లుప్తంగా తెలియజేయండి. ఇలాంటి ఓ ప్రశ్నను అడగడం ద్వారా గృహస్థుని వ్యాఖ్యానాలను రాబట్టండి: “ఆ మనోగత దృశ్యాన్ని గురించి మీరెలా బావిస్తారు?” జవాబు చెప్పనివ్వండి, ఆ పుస్తకాన్ని రూ. 8.00లకు ప్రతిపాదించండి లేక ఏదొక పాత పుస్తకంతోపాటు దానిని రూ. 16.00 చందాకు ఇవ్వండి.
4 గృహస్థుడు బైబిలు గురించి తెలిసిన వాడైతే, పరిష్కరింపబడని ఓ సామాజిక సమస్యను గూర్చిన తాజా వార్తా సమాచారంతో ఆరంభించి ఈ క్రింది విధంగా అడుగుతూ “నీ రాజ్యము వచ్చుగాక” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని మీరు ఉపయోగించవచ్చు:
◼ “ఏదో ఒకనాటికి ప్రపంచ నాయకులు ఈ సమస్యను పరిష్కరించగలరని మీరు అనుకుంటున్నారా? [గృహస్థుని జవాబు చెప్పనిచ్చి, దాన్ని గుర్తించండి.] ఇలాంటి సమస్యలేని ప్రపంచంలో జీవించడాన్ని మనందరమూ అభినందిస్తాం. మనం ప్రార్థన చేస్తున్న దేవుని ప్రభుత్వ పాలన క్రింద ఇది వాస్తవమౌతుంది.” శాంతి భద్రతలు చివరకు ఎలా నెరవేరబోతాయో చూపించేందుకు యెషయా 32:17, 18 వచనాల్ని చదవండి. 5వ పేజీ ప్రారంభంలోని మొదటి పేరా కూడా చదివి, భూమిని గురించి దేవుడు చేసిన వాగ్దానం సమీప భవిష్యత్తులో నెరవేరుతుందనే లేఖనాధారిత రుజువును ఈ పుస్తకం ఇస్తుందని వివరించండి. ఆ ఒక్క పుస్తకాన్నే ప్రతిపాదించండి లేక సముచితమనిపిస్తే మరో పుస్తకంతో పాటూ ప్రతిపాదించండి.
5 “నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము” అనే పుస్తకాన్ని ఉపయోగించి ఓ క్లుప్తమైన అందింపును ఇచ్చేందుకు మీరు ఇష్టపడితే, ఆ పుస్తకంలోని 4వ పేజీని తెరచి మీరిలా అడగవచ్చు:
◼ “కుటుంబ విలువలపై జరుగుతున్న నేటి దాడుల నుండి ఆ ఏర్పాటు తప్పింపబడగలదా?” గృహస్థుని ప్రత్యుత్తరాన్ని గుర్తించి, తర్వాత 5వ పేజీలోని మొదటి పేరాను చదవండి. రూ. 15.00 చందాకు పుస్తకాన్ని ప్రతిపాదించండి. (తెలుగు ప్రతిని రూ. 8.00 ప్రత్యేకమైన ధరకు ప్రతిపాదించవచ్చు.)
6 మంచి అంతర్దృష్టి, మనం కలుసుకునే ప్రజల అవసరాల్ని ఆసక్తుల్ని వివేచించడాన్కి మనకు తోడ్పడ్తుంది. సామెతలు 16:23 దీనిని గురించి మనకు అభయాన్ని ఇస్తుంది, అదిలా చెబుతోంది: “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి [“అంతర్దృష్టి,” NW] కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.”