‘ఇదియే నిత్యజీవము’
1 యోహాను 17:3 నందున్న యేసు మాటలను గంభీరంగా తీసుకోవాలి. దేవున్ని క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము అని ఆయన సరిగ్గానే చెప్పాడు! అయితే కేవలం యెహోవాను యేసును గూర్చిన మన జ్ఞానంవల్లనే మనకు నిత్యజీవం అనుగ్రహించబడుతుందా? లేదు. యెహోవా వారి దేవుడని ఇశ్రాయేలీయులకు తెలుసు, కానీ వారి జీవిత విధానం ఆ నమ్మకాన్ని ప్రతిబింబించలేదు. తత్ఫలితంగా వారు ఆయన అనుగ్రహాన్ని పోగొట్టుకున్నారు. (హూషే. 4:1, 2, 6) నేడు లక్షలాది మంది ‘ఆసక్తిగలవారే, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.’ (రోమా. 10:2) వారు “అద్వితీయ సత్యదేవు”డైన యెహోవాను తెలుసుకోవాలి మరియు ఆయనను సరైన విధంగా ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. అందుచేత, నవంబరు నెలలో మనం నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని అందిస్తాము. జ్ఞానము అనే పుస్తకాన్ని అందించినప్పుడు మొదట మీరు ఎలా ప్రారంభిస్తారు? మీకు సహాయపడగల సలహాలు కొన్ని ఇక్కడున్నాయి.
2 మీ ప్రాంతంలో అనేకమందితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించేందుకు ఇష్టపడే ఓ అందింపు ఇక్కడుంది:
◼ “లోకంలో ఇన్ని విభిన్న మతాలు ఎందుకు ఉన్నాయి అన్న దాని గురించి మేము మా పొరుగువారితో సంభాషిస్తున్నాము. ఈ దేశంలోనే అనేక రకాల మత విధానాలున్నాయి, మరియు ప్రపంచవ్యాప్తంగా 10,000 మత విభాగాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ప్రకారం, ఇన్నిరకాల మతాలు ఎందుకున్నాయంటారు? [జవాబు చెప్పనివ్వండి. జ్ఞానము పుస్తకాన్ని 5వ అధ్యాయానికి త్రిప్పి మొదటి పేరా చదవండి.] ఈ అధ్యాయాన్ని చదవడం ద్వారా ఈ ప్రశ్నలకు తృప్తికరమైన జవాబులను మీరు పొందుతారు. మీరు పరిశీలించగల్గితే దాన్ని మీకు ఇచ్చివెళ్లడానికి నేను సంతోషిస్తాను.” దాన్ని అంగీకరించినట్లైతే, తిరిగి వెళ్లేందుకు కచ్చితమైన ఏర్పాట్లను చేసుకుని, “నేను ఈసారి వచ్చినప్పుడు, మతాలన్నీ ఒకే ప్రాంతానికి నడిపే వివిధ మార్గాలేనా అన్న విషయాన్ని చర్చించుకోవచ్చు” అని చెప్పండి.
3 ఇన్ని మతాలు ఎందుకున్నాయి అన్న విషయంపై చర్చ కొనసాగించేందుకు మీరు మరలా వెళ్లినప్పుడు ఇలా చెప్పవచ్చు:
◼ “క్రితంసారి మీతో మాట్లాడినప్పుడు, అన్ని మతాలు ఒకే ప్రాంతానికి నడిపే వివిధ మార్గాలేనా అన్న ప్రశ్నను లేవదీశాను. దాని గూర్చి మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] ఈ విషయమై యేసు ఏమి చెప్పాడో ఈ పుస్తకంనుండి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. [జ్ఞానము పుస్తకాన్ని 5వ అధ్యాయానికి తెరచి, మత్తయి 7:21-23 తో సహా 6-7 పేరాలను చదవండి.] దేవుని చిత్తమేమిటో మీరు కచ్చితంగా తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమని మీరు ఆలోచించవచ్చు. తర్వాతి పేరాలు ఎంతో సమాచారాన్నందిస్తున్నాయని మీరు గమనిస్తారు. ఈ అధ్యాయంలోని జ్ఞాపికను చదవండి. ఈసారి నేను వచ్చినప్పుడు, ఆరాధనా విషయాల్లో కచ్చితమైన జ్ఞానాన్ని కల్గివుండడం యొక్క విలువేమిటో మీకు చూపించేందుకు నేను ఆనందిస్తాను.”
4 అనేక నామకార్థ క్రైస్తవులకు సహితం భూమిపై నిరంతరం జీవించడం అన్న ఆలోచన క్రొత్తది కనుక, ఈ ఉపోద్ఘాతం వారి శ్రద్ధను ఆకట్టుకోవచ్చు:
◼ “మా పొరుగువారిని మేము ఓ ప్రశ్న అడుగుతున్నాము. ఇలాంటి లోకంలో జీవించేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తే, మీరు ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తారా? [జ్ఞానము పుస్తకంలోని 4-5 పేజీల్లో ఉన్న ఆ చిత్రాన్ని చూపించండి. జవాబు చెప్పనివ్వండి.] నిజంగా ఇది మీ జీవితంలో ఆనందమయ అనుభవం కావచ్చు. అయితే, మీకు అది వాస్తవమయ్యేందుకు మీరేం చేయవల్సివుంటుందని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] యోహాను 17:3 ప్రకారం ఏ చర్య తీసుకోవడం అవసరమో గమనించండి. [చదవండి.] ఈ పుస్తకం ప్రత్యేక విధమైన జ్ఞానాన్ని సంపాదించేందుకు అనేకులకు సహాయపడుతోంది. మీరు మీ కొరకు ఒక పుస్తకాన్ని చదవడానికి ఉంచుకోవాలని ఇష్టపడతారా. [జవాబు చెప్పనివ్వండి.] నేను ఈసారి వచ్చినప్పుడు, ఈ భూమ్మీదే నిత్యజీవాన్ని అనుభవించగలమనే నమ్మకాన్ని కల్గివుండడం ఎందుకు సమంజసమో చర్చించుకుందాం.”
5 మీరు యోహాను 17:3 గూర్చి చర్చించినవారిని పునర్దర్శించినప్పుడు మీరు ప్రారంభవాచకంగా ఇలా చెప్పవచ్చు:
◼ “పోయినసారి నేను వచ్చినప్పుడు, దేవున్ని గూర్చీ మరియు తనను గూర్చి జ్ఞానాన్ని సంపాదించడమే నిత్యజీవం అన్న అభయాన్నిస్తూ యోహాను 17:3లో యేసు చెప్పిన అద్భుతమైన మాటలను నేను మీకు చదివి వినిపించాను. అయితే మంచి జీవితాన్ని పరలోకంలోనే పొందడం సాధ్యమని అనేకమంది విశ్వసిస్తున్నారు. దాని గూర్చి మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] నేను మీకిచ్చిన పుస్తకం అందుబాటులో ఉంటే, పరదైసు భూమ్మీద పునఃస్థాపించబడుతుందని నిరూపించే కొన్ని బైబిలు వచనాలను నేను మీకు చూపించేందుకు ఇష్టపడతాను. [జ్ఞానము పుస్తకంలోని 9-10 పేజీల్లోని 11-16 పేరాలను చర్చించండి.] నేను ఈసారి వచ్చినప్పుడు, బైబిలులో ఉన్న ఈ వాగ్దానాలను మీరు ఎందుకు నమ్మగలరో నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ఈ మధ్యకాలంలో బహుశ మీ పుస్తకంలోనే 2వ అధ్యాయాన్ని మీరు చదువుకోవచ్చు.”
6 బైబిలు నందు కొంత విశ్వాసమున్న వ్యక్తులతో బైబిలు పఠనం ప్రారంభించేందుకు నేరుగా మాట్లాడడం తరచూ ఫలిస్తుంది. “తర్కించుట” (ఆంగ్లం) అనే పుస్తకంలో 12వ పేజీలో కనిపించే ఉపోద్ఘాతం ఇక్కడ ఉంది:
◼ “మీకు ఉచిత బైబిలు కోర్సును అందించేందుకు నేను మీ ఇంటికి వచ్చాను. మీరనుమతిస్తే, కుటుంబాలుగా సుమారు 200 దేశాల్లోని ప్రజలు ఇంటివద్ద బైబిలును ఎలా చర్చిస్తారో ప్రదర్శించేందుకు కొద్ది నిమిషాలు తీసుకుంటాను. చర్చ కొరకు మనం వీటిలోని ఏ అంశాన్నైనా ఉపయోగించవచ్చు. [జ్ఞానము పుస్తకంలోని విషయసూచికను చూపించండి.] మీకు ఆసక్తి గల విషయం ఏది?” ఆ వ్యక్తి ఎంచుకునేంతవరకు ఆగండి. ఎన్నుకున్న అధ్యాయానికి త్రిప్పి, మొదటి పేరానుండి పఠనాన్ని ప్రారంభించండి.
7 బైబిలుతో పరిచయంలేని ప్రజలతో మీరు పఠనాన్ని ప్రారంభించేందుకు మీరు ప్రయత్నించగల ఫలవంతమైన సూటైన పద్ధతి ఇక్కడుంది:
◼ “అనేమంది ప్రజలు బైబిలు, ఎంతో వివేకంగల మాటలున్న పరిశుద్ధ గ్రంథమని విశ్వసిస్తున్నప్పటికీ, దాని నుండి కొంతైనా నేర్చుకునే అవకాశం వారికి లభించలేదు. నేను బైబిలు పఠనాలను ఉచితంగా ఇస్తాను, అలాగే ఇంకా ఎక్కువమంది విద్యార్థుల కొరకు కూడా నేను సమయమివ్వగలను. ఈ బైబిలు పఠన సహాయకాన్ని మేము ఉపయోగిస్తాము. [జ్ఞానము పుస్తకాన్ని చూపించండి.] ఈ కోర్సు కొన్ని నెలలవరకు మాత్రమే ఉంటుంది. దేవుడు బాధను ఎందుకు అనుమతించాడు? మనం ఎందుకు వృద్ధులమై మరణిస్తాము? మరణించిన మన ప్రియమైన వారికి ఏమౌతుంది? ఇటువంటి ప్రశ్నలకు బైబిలు ఎలా జవాబునిస్తుందో అది చూపుతుంది. పఠనం ఎలా చేస్తామో నన్ను మీకు చూపించమంటారా?” పఠనం కొరకు మీరు చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లైతే, జ్ఞానము పుస్తకాన్ని అందించి ఆ వ్యక్తినే స్వంతగా చదువుకోమని ప్రోత్సహించండి.
8 దేవుడు మరియు క్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని కల్గివున్న ప్రతి ఒక్కరికీ ఆ జ్ఞానం ఎంత విలువైనదో కదా! దాన్ని గైకొనడమంటే నిజంగానే పరిపూర్ణ పరిస్థితుల్లో నిత్యజీవమనే. నవంబరులో, నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడంలో మనకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందాం.