నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించేందుకు ఇతరులకు సహాయపడండి
1 ‘మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనన్నది దేవుని ఇచ్ఛయై’ ఉన్నది అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 తిమో. 2:4) ఆ జ్ఞానాన్ని సంపాదించేందుకు ఇతరులకు మనమెలా సహాయపడగలం? నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం ద్వారా ఆసక్తి రేకెత్తించబడిన వ్యక్తులను పునర్దర్శించడం ఒక మార్గం. ఈ ప్రచురణ స్పష్టమైన సరళమైన, చక్కగా ఎంచుకున్న పదాల్లో బైబిలు సత్యాన్ని అందిస్తుంది. దీన్ని పఠించడం ద్వారా అన్ని తరహాల ప్రజలు జీవానికి నడిపించబడగలరు. మనతో దానిని పఠించేందుకు ఇతరులను ప్రోత్సహించేందుకు మనమేమి చెప్పగలం?
2 ఒక ఆచరణాత్మక మార్గదర్శి అని ఎవరికైతే మీరు బైబిలును పరిచయం చేశారో, వారితో పఠనాన్ని ప్రతిపాదించడానికి మీరు తిరిగి వెళ్ళి బహుశ ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “నేను క్రితం వచ్చినప్పుడు, ఆచరణాత్మక నడిపింపుకు బైబిలు మూలమని మనమెలా నమ్మగలమో మనం చర్చించాం. బైబిలు దైవ ప్రేరేపితమని చెప్పుకుంటోంది, అందువల్ల దాని లేఖికులలో ఒకరు చెప్పినట్లు, అది ఓదార్పుకు నిరీక్షణకు కచ్చితమైన మూలం. [రోమీయులు 15:4 చదవండి.] క్రితం మన మధ్య జరిగిన సంభాషణ చివరిలో, బైబిలులో ఉన్న జ్ఞానం నుండి వ్యక్తిగతంగా మనమెలా ప్రయోజనం పొందవచ్చు? అనే ఒక ప్రశ్నను నేనడిగాను.” జ్ఞానము అనే పుస్తకం 11వ పేజీలోని 18వ పేరాను చదవండి. నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించేందుకు అన్నిచోట్ల ఉన్న ప్రజలకు సహాయపడుతూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల బైబిలు పఠనాలను యెహోవాసాక్షులు నిర్వహిస్తున్నారని తెలియజేయండి. 1వ అధ్యాయంలోని మొదటి ఐదు పేరాలను ఉపయోగిస్తూ పఠనాన్ని ఎలా నిర్వహిస్తారనేదానికి క్లుప్త ప్రదర్శనను ఏర్పాటు చేయండి.
3 మీరు ఒకరితో మొదట చర్చించిన విషయం ప్రార్థన అయినట్లయితే, ఒక పఠనాన్ని ఆరంభించే ప్రయత్నంలో మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం నుండి మనం చర్చించిన ప్రార్థనను గూర్చిన సమాచారాన్నిబట్టి మీరు ఆనందించి ఉంటారని నేను ఆశిస్తున్నాను. దేవునికి ప్రార్థించేవారు ఆయన చెప్పే వాటిని ఎలా వింటారు అనే దానిని గురించి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతానని నేను మీకు మాటిచ్చాను. 158వ పేజీలో చెప్పబడినదానిని గమనించండి. [18 పేరాను చదవండి.] అలా, బైబిలును వ్యక్తిగతంగా చదవడం ద్వారా దేవుడు మనకు చెప్పనున్న విషయాలను మనం వింటాం. అలా చేయడం మనల్ని ఆయనకు సన్నిహితులనుగా చేస్తుంది, దైనందిన సమస్యలైన వేటి కొరకు మనం ప్రార్థిస్తున్నామో వాటితో వ్యవహరించేందుకు మనకు సహాయపడుతుంది. మీతో బైబిలు పఠించడానికి నేను సంతోషిస్తాను.” ఆ వ్యక్తి ఇష్టపడుతున్నట్లయితే, జ్ఞానము అనే పుస్తకం మొదటి అధ్యాయంతో ఆరంభించండి.
4 పఠనాన్ని ఆరంభించేందుకు మీరు సూటైన పద్ధతిని ఉపయోగించినట్లయితే మొదటి చర్చను కొనసాగించేందుకు మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “మిమ్మల్ని మళ్ళీ సందర్శించేందుకు నేను ప్రత్యేక ప్రయత్నాన్ని చేశాను, ఎందుకంటే మా ఉచిత బైబిలు పఠనాన్ని గూర్చి మీకు మరెక్కువగా చెప్పాలని అనుకున్నాను. పఠన సహాయకంగా మేము ఉపయోగించే నిత్యజీవానికి నడిపే జ్ఞానము అనే ఈ పుస్తకం యొక్క ప్రతిని నేను మీకిచ్చి వెళ్ళాను. దేవుని వాక్యాన్ని పరిశీలించేందుకు అది మనల్నెలా ప్రోత్సహిస్తుందో గమనించండి. [22వ పేజీలోని 23వ పేరాను చదవండి.] మీ పుస్తక ప్రతిని తెచ్చుకోవడానికి మీరు ఇష్టపడినట్లయితే, మనం క్రితం ఆపిన దగ్గిర నుండి పఠనాన్ని బహుశ కొనసాగించవచ్చు.” మొదటి దర్శనంలో పఠనం ఆరంభించనట్లయితే, “మేము బైబిలును ఎలా పఠిస్తామో ప్రదర్శించేందుకు బహుశ ఇది చక్కని సమయం కావచ్చు” అని మీరనవచ్చు. కొన్ని పేరాలను పరిశీలించిన పిదప, తరువాతి పఠనం కొరకు కచ్చితమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోండి.
5 జ్ఞానము అనే పుస్తకాన్ని ఫలవంతంగా ఉపయోగించడం ఇతరుల ఆశీర్వాదం కొరకు కచ్చితమైన జ్ఞానాన్ని వ్యాపింపజేయడానికి మనలను సమర్థులను చేస్తుంది. (సామె. 15:7) నీతి హృదయం గల వారికి అలాంటి జ్ఞానం సంతోషాన్ని తెస్తుంది, యెహోవా నీతికి అనుగుణంగా జీవించేందుకు అది వారికి శక్తివంతమైన ప్రేరణగా ఉండి, చివరికి నిత్య జీవానికి నడిపిస్తుంది.