కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/97 పేజీ 1
  • “కృతజ్ఞులై యుండుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “కృతజ్ఞులై యుండుడి”
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “కృతజ్ఞులై యుండుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కృతజ్ఞతా ప్రార్థన
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ‘కృతజ్ఞులై ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 3/97 పేజీ 1

“కృతజ్ఞులై యుండుడి”

1 మనలో అనేకులం “దయచేసి” అన్న పదాన్ని ఉపయోగించాలనీ, ఎవరైనా మనకు ఓ మంచి పని చేసినా దయనుచూపించినా మనం “కృతజ్ఞతలను” వ్యక్తపర్చాలనీ చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఎల్లప్పుడూ “కృతజ్ఞులై యుండుడి” అని పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు, మరి విశేషంగా మనం యెహోవాకు కృతజ్ఞులై ఉండాలి. (కొలొ. 3:15, 16) మన మహా గొప్ప సృష్టికర్తకు మన కృతజ్ఞతలను ఎలా వ్యక్తపర్చగలం? మరి మనం ఆయనకు కృతజ్ఞులమై ఉండేందుకు మనకు ఏ ప్రత్యేకమైన కారణాలున్నాయి?

2 అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికిస్తోత్రము కలుగును గాక.” (1 కొరిం. 15:57) నిరంతర జీవితానికిగల నిరీక్షణను మనకు ఇస్తున్న విమోచన క్రయధనాన్ని అందించడంలో దేవుడూ క్రీస్తూ ఇద్దరూ చూపిన అపారమైన ప్రేమను గూర్చి ప్రతి సంవత్సరమూ జ్ఞాపకార్థ సమయమందు మనకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. (యోహా. 3:16) ఇంచుమించు మనమందరమూ మన ప్రియమైనవారిని మరణమందు కోల్పోయివుంటాము కనుక, పునరుత్థానం చేస్తానని యేసు చేసిన వాగ్దానానికి మనం ఎంత కృతజ్ఞులమోకదా! మరణించకుండానే ఈ విధానాంతాన్ని తప్పించుకునే ఉత్తరాపేక్షను మనం తలపోసినప్పుడు మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉప్పొంగిపోతాయి. (యోహా. 11:25, 26) రాబోయే భూపరదైసులో యెహోవా నుండి మనం అనుభవించబోయే అద్భుతమైన ఆశీర్వాదాలకు కృజ్ఞతలు చెప్పేందుకు మాటలు చాలవు. (ప్రక. 21:4) దేవునికి ‘కృతజ్ఞతలు’ చెల్లించేందుకు ఇంతకన్నా మంచి కారణాలు ఎవరికైనా ఉంటాయా?

3 దేవునికి కృతజ్ఞతలను వ్యక్తపర్చే విధానం: యెహోవా చూపిన మంచితనానికి ప్రార్థనలో ఆయనకు కృతజ్ఞతలు వ్యక్తపర్చడం ఎల్లప్పుడూ సమంజసమే. (కీర్త. 136:1-3) అంతేకాకుండా, చక్కని ఇతర మార్గాల్లో ఆయనకు మన కృతజ్ఞతలను వ్యక్తపర్చేందుకు మనం కదిలించబడతాము. ఉదాహరణకు, మార్చి 23 ఆదివారంనాడు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి మనం తప్పకుండా హాజరౌతాము. స్థానిక సంఘానికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పనికీ అవసరమైన వస్తుదాయక విషయాల్లో సహాయపడేందుకు ఆనందంగా మనకున్న ‘అమూల్యమైన వాటిని ఇచ్చి యెహోవాను ఘనపరుస్తాము.’ (సామె. 3:9) పెద్దలకు మనం పూర్తి మద్దతునిచ్చి, వారితో సహకరిస్తాము. అలా వారి ద్వారా యెహోవా అందించే సహాయానికి మనం ఆయనకు మన కృతజ్ఞతలను తెలియజేస్తాము. (1 థెస్స. 5:12, 13) ప్రతి రోజూ, దేవుని నామాన్ని మహిమపర్చే నీతియుక్త ప్రవర్తనలో కొనసాగేందుకు మనం ప్రయత్నిస్తాము. (1 పేతు. 2:12) మనకు కృతజ్ఞత ఉందనేందుకు మనం కనపర్చే ఈ రుజువులు యెహోవాను ప్రీతిపరుస్తాయి.—1 థెస్స. 5:18.

4 మనం కృతజ్ఞతలను వ్యక్తపర్చే చక్కని మార్గం: రాజ్య ప్రచార పనిలో హృదయపూర్వకంగా పాల్గొనడం, యెహోవా నామాన్ని గౌరవించడం, ప్రార్థన ద్వారా కృతజ్ఞతలను వ్యక్తపర్చడం, అంతేకాకుండా సత్యం పక్షంగా నమ్మకంగా మాట్లాడడం వంటివి మన సృష్టికర్త మనకొరకు చేసిన వాటికన్నింటికీ మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలను వ్యక్తపర్చే చక్కని మార్గాలు. ‘మనుష్యులందరు రక్షణపొందాలనే’ తన చిత్తానికి మద్దతునివ్వడంలో తనకు మనం చెల్లించే పరిశుద్ధ సేవను చూసి యెహోవా ఆనందిస్తాడు. (1 తిమో. 2:3, 4) అందుకనే మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోగానీ లేక ఆ నెలల్లో ఏదైనా ఒక్కనెలలోగానీ సహాయ పయినీరు సేవను చేయమని ఫిబ్రవరి మన రాజ్య పరిచర్యలో ఇచ్చిన పిలుపుకు ఆ విధంగా ఏర్పాట్లు చేసుకొనగలిగే అవకాశమున్న అనేకమంది సువార్తికులు ప్రతిస్పందిస్తున్నారు. దేవునికి మన ‘కృతజ్ఞతలను వ్యక్తపర్చడంలో,’ పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించేందుకు ఎక్కువ కృషిచేయడం ఒక చక్కని మార్గం. మీరు ఏప్రిల్లోగానీ మేలోగానీ లేక ఆ రెండు నెలల్లోనూ పయినీర్ల శ్రేణిలో చేరగలరా?

5 మనం నిరంతరం జీవించగలమనే కచ్చితమైన ఓ నిరీక్షణ మనకు ఇవ్వడం జరిగింది. అది నెరవేరడం మనం చూసినప్పుడు, ప్రతి రోజూ యెహోవాకు ఆనందంగా కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉండేందుకు మనకు ఇంకా ఎన్నో కారణాలుంటాయి.—కీర్త. 79:13.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి