కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/97 పేజీ 2
  • మార్చిలోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చిలోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఉపశీర్షికలు
  • మార్చి 3తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 10తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 17తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 24తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 31తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1997
km 3/97 పేజీ 2

మార్చిలోని సేవా కూటాలు

మార్చి 3తో ప్రారంభమయ్యే వారం

పాట 53 (8)

10 నిమి: స్థానిక ప్రకటనలు. సాహిత్య ప్రతిపాదనలను, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకున్న ప్రకటనలను తెలియజేయండి. మార్చి 23వ తారీఖున జరిగే జ్ఞాపకార్థదిన ఆచరణకు ఆసక్తివున్న వ్యక్తులను ఆహ్వానించనారంభించమని అందరినీ ప్రోత్సహించండి. జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రిక ప్రతిని ప్రదర్శించండి. వాటిని తీసుకొని ఈవారంలో పంచిపెట్టడం ప్రారంభించమని అందరినీ ఉద్బోధించండి.

15 నిమి: “మీ కుటుంబాన్ని బలపర్చుకోండి.” ప్రశ్నాజవాబులు. 1995 వార్షిక పుస్తకం, పేజీ 228 నుండి అనుభవాల్ని చేర్చండి.

20 నిమి: “శాశ్వతమైన భవిష్యత్తును పొందేందుకు కుటుంబాలకు సహాయపడడం.” (1-5 పేరాలు) మొదటి పేరాపై క్లుప్తంగా వ్యాఖ్యానించిన తర్వాత, కుటుంబ సంతోషం పుస్తకంలోని అధ్యాయాల పేర్లనూ, వర్ణభరితమైన చిత్రాలనూ, పునఃసమీక్షా బాక్సులనూ ఉపయోగించడంద్వారా దానియందు ఆసక్తిని ఎలా పెంపొందించవచ్చో చర్చించండి. సమర్థులైన ప్రచారకులతో 2-5 పేరాలలోని అందింపులను ప్రదర్శించండి. ఇంతకు మునుపే ఆసక్తిని చూపించిన కుటుంబాలకు పుస్తకాన్ని అందించడానికి ప్రత్యేకమైన కృషిని చేయమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 71 (17), ముగింపు ప్రార్థన.

మార్చి 10తో ప్రారంభమయ్యే వారం

పాట 56 (12)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు. ప్రతిదినము లేఖనములను పరిశీలించుటలో మార్చి 18-23 తారీఖుల కొరకు ఇవ్వబడిన జ్ఞాపకార్థ బైబిలు పఠన షెడ్యూల్‌ను అనుసరించాలని అందరికీ జ్ఞాపకం చేయండి.

20 నిమి: “కృతజ్ఞులై యుండుడి.” ప్రశ్నా జవాబులు. బైబిలు విద్యార్థుల్నీ, ఆసక్తివున్న వ్యక్తుల్నీ, సుముఖతను చూపించే కుటుంబ సభ్యుల్నీ, మరి సంఘంతో చురుకుగా సహవసించని సహోదర సహోదరీలు ఎవరైనా ఉంటే వారినీ, జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరవ్వమని ఆహ్వానించేందుకు అందరూ తీవ్రంగా కృషి చెయ్యాలి. జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికను ఉపయోగిస్తూ ఓ ప్రచారకుడు ఆసక్తివున్న వ్యక్తిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడాన్ని సంక్షిప్తంగా ప్రదర్శిస్తాడు. జూలై 1, 1988 కావలికోట (ఆంగ్లం) పేజీ 11, పేరాలు 16-17లపై అదనపు వ్యాఖ్యానాల్ని చేయండి. ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీరు సేవ చేయగలిగే వారిని ప్రోత్సహించండి.

15 నిమి: “శాశ్వతమైన భవిష్యత్తును పొందేందుకు కుటుంబాలకు సహాయపడడం.” (పేరాలు 6-8) ఉద్యోగ స్థలాల్లోనూ, పాఠశాలల్లోనూ, పార్కుల్లోనూ లేక ప్రయాణించేటప్పుడూ అలాగే బంధువుల్ని చూడ్డానికి వెళ్లినప్పుడూ అనియత సాక్ష్యం ఇస్తుండగా కుటుంబ సంతోషం పుస్తకాన్ని ఎలా అందించవచ్చో చూపించే కొన్ని సలహాల్ని ఇవ్వండి. 6, 7 పేరాల ఆధారంగా సమర్థుడైన ఓ ప్రచారకుడు అందింపుల్ని ప్రదర్శించేటట్లు ఏర్పాటు చేయండి. పునర్దర్శనంలో చేసే చర్చ, బైబిల్ని పఠించడం కుటుంబ బాంధవ్యాల్ని ఎలా పటిష్ఠపర్చగలదో ఆ వ్యక్తి గ్రహించేందుకు సహాయపడాలి. బైబిలు పఠనాన్ని జ్ఞానము పుస్తకానికి మార్చే గమ్యంతో దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు నుండి బైబిలు పఠనాలు నిర్వహించాలి. లేదా జ్ఞానము పుస్తకంలో నుండే పఠనాల్ని ప్రారంభించవచ్చు.

పాట 72 (3), ముగింపు ప్రార్థన.

మార్చి 17తో ప్రారంభమయ్యే వారం

పాట 63 (25)

15 నిమి: స్థానిక ప్రకటనలు. “జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు” పునఃసమీక్షించండి, అలాగే జ్ఞాపకార్థ దినం కొరకు చేసిన స్థానిక ఏర్పాట్లను తెలియజేయండి. బైబిలు విద్యార్థులూ, ఆసక్తికల్గిన వ్యక్తులూ హాజరయ్యేలా సహాయపడేందుకు అందరూ తమ తమ ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలి.

15 నిమి: స్థానిక ప్రకటనలు. లేక సెప్టెంబరు 15, 1996 కావలికోట 22-24 పేజీల్లోనుండి “మీరు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా?” అనే శీర్షికపై ఓ పెద్ద ఇచ్చే ప్రసంగం.

15 నిమి: యెహోవాసాక్షుల 1997 వార్షిక పుస్తకమును బాగా ఉపయోగించండి. 3-9 పేజీల్లో ఉన్న ఉన్నతాంశాల్ని తండ్రి తన కుటుంబంతో పునఃసమీక్షిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దైవపరిపాలనా పురోభివృద్ధిని చూసి మనం ఎందుకు ఆనందిస్తామో చూపిస్తాడు. ఈ సంవత్సరం, ప్రతి దినమూ భోజన వేళల్లో వార్షిక పుస్తకము నుండి చదవడానికీ అలాగే దినవచనాన్ని పరిశీలించడానికి తాము కొన్ని నిమిషాల్ని ఎలా వెచ్చించాలో తండ్రి వివరిస్తాడు.

పాట 75 (22), ముగింపు ప్రార్థన.

మార్చి 24తో ప్రారంభమయ్యే వారం

పాట 67 (26)

9 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ నెలలో సహాయ పయినీరు సేవ చేసేందుకు దరఖాస్తును పెట్టుకోవడానికి సమయం ఇంకా మించిపోలేదని వివరించండి. దరఖాస్తు పెట్టుకోమని అందర్నీ ప్రోత్సహించండి. ఆ నెలలో సేవ కొరకైన కూటాలకు స్థానికంగా చేసిన అదనపు ఏర్పాట్లను గూర్చి క్లుప్తంగా చెప్పండి.

24 నిమి: “పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి.” (పేరాలు 1-20) ప్రశ్నా జవాబులు. 16వ పేరాను సంక్షిప్తంగా ప్రదర్శించండి.

12 నిమి: బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ఓ కొత్త ప్రచారకునికి సహాయపడడం. జూన్‌ 1996 మన రాజ్య పరిచర్యలోని ఇన్‌సర్ట్‌లోని 19వ పేరాను పునఃసమీక్షించండి. బాప్తిస్మం పొందని ప్రచారకునిగా పెద్దలు అంగీకరించిన ఓ బైబిలు విద్యార్థిని, సమర్థుడైన ఓ ప్రచారకుడు ఎలా సిద్ధపరుస్తాడో ప్రదర్శించండి. వారిరువురూ కలిసి మన పరిచర్య పుస్తకంలోని పేజీ 111, పేరా 2ను పునఃసమీక్షిస్తారు. అనుభవంగల ప్రచారకుడు ఇంటింటి సాక్ష్యంలో భాగం వహించినప్పుడు ఎదుర్కొనబోయే వాటిని సూచించి, అనేకమంది అనుకూలంగా ప్రతిస్పందించకపోయినా నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తాడు. వినడానికి ఇష్టపడే యథార్థవంతుడైన వ్యక్తిని కనుగొన్నప్పుడు వచ్చే ఆనందాన్ని తెలియజేసే ప్రోత్సహకరమైన అనుభవాన్ని ప్రచారకుడు తెలియజేస్తాడు. వారిద్దరూ కలిసి క్లుప్తమైన, సరళమైన పత్రికా అందింపును సిద్ధపడతారు, అటుతర్వాత దాన్ని అభ్యసిస్తారు. ప్రోత్సాహకరంగా మెచ్చుకొని, ఈ వారంలో ప్రాంతీయసేవలో అందరూ పాల్గొనేందుకు కచ్చితమైన ఏర్పాట్లను చేయండి.

పాట 89 (9), ముగింపు ప్రార్థన.

మార్చి 31తో ప్రారంభమయ్యే వారం

పాట 70 (4)

15 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ 6వ తారీఖున ఇవ్వబోయే ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి హాజరయ్యేందుకు ఆసక్తివున్న వారందరినీ ఆహ్వానించండి. తమ తమ మార్చి నెల ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. ఏప్రిల్‌ నెలలో సహాయ పయినీరు సేవ చేసే వారి పేర్లను ప్రకటించండి. ప్రశ్నా భాగాన్ని పునఃసమీక్షించండి.

20 నిమి: “పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి.” (పేరాలు 21-35) ప్రశ్నా జవాబులు. 3వ పేజీలోవున్న బాక్సును పునఃసమీక్షించండి. తమ ప్రాంతీయ సేవను రిపోర్టు చేస్తున్నప్పుడు ఆ నెలలో తాము చేసిన ప్రతీ పునర్దర్శనాన్ని లెక్కించమని అందర్నీ ప్రోత్సహించండి.

10 నిమి: ఏప్రిల్‌ కొరకైన సాహిత్య ప్రతిపాదనల్ని పునఃసమీక్షించండి. కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందాలను ప్రతిపాదించండి. అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్యలో 8వ పేజీనందున్న 3, 4, 8 పేరాల్లో ఇవ్వబడిన పత్రికా అందిపుల్ని ఎలా సిద్ధపడాలనే విషయాన్ని గూర్చిన సలహాల్ని క్లుప్తంగా తెలియజేయండి. ఇద్దరు ప్రచారకులు ఒకటో రెండో అందింపుల్ని ప్రదర్శిస్తారు. చందా కట్టడానికి ఇష్టపడకపోతే, విడి పత్రికా ప్రతుల్ని రెండింటినిగాని లేక అంతకన్నా ఎక్కువ ప్రతుల్ని గాని ప్రతిపాదించాలి. చందాను స్వీకరించక పత్రికల్ని అంగీకరించిన వారిని గూర్చిన రికార్డును ప్రచారకులు ఉంచుకోవాలి. తమ పత్రికా మార్గంలో వారి పేర్లను చేర్చుకోవాలి.

పాట 92 (7), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి