విశ్వాస్యతకు ప్రతిఫలమివ్వబడుతుంది
1 దేవుడు “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” హెబ్రీయులు 11:6లో మనకు చెప్పబడుతుంది. ‘కొంచెములో నమ్మకముగా ఉన్న’ తన సమర్పిత సేవకులకు దేవుడు ప్రతిఫలమిచ్చే ఒక విధం ‘అనేకమైనవాటి మీద వారిని నియమించడమే.’ (మత్త. 25:23) మరో మాటలో చెప్పాలంటే, యెహోవా తరచూ తన నమ్మకస్థులైన సాక్షులకు అదనపు సేవాధిక్యతలను ఇవ్వడం ద్వారా మంచి పనికి ప్రతిఫలమిస్తాడు.
2 యూరోప్‌లోని అలాగే ఆసియా మైనర్‌లోని నగరాల్లోకీ గ్రామాల్లోకీ వెళ్ళి పరిచర్య చేయవలసిన నియామకాన్ని అపొస్తలుడైన పౌలు తన విశ్వాస్యతకు ప్రతిఫలంగా పొందాడు. (1 తిమో. 1:12) తన పరిచర్యను పూర్తిగా నెరవేర్చడంలో ఎంతో శ్రమ ఇమిడి ఉన్నప్పటికీ, తాను పొందిన ఆధిక్యతను పౌలు ఉన్నతంగా ఎంచాడు. (రోమా. 11:13, 14; కొలొ. 1:25) ప్రకటించే అవకాశాల కొరకు ఆతురతతో చూస్తూ ఆయన తన హృదయపూర్వక మెప్పుదలను చూపించాడు. ఉత్సాహంతో కూడిన తన క్రియాశీలత ద్వారా ఆయన తన విశ్వాసాన్ని స్పష్టంగా కనబరచాడు. మన సేవాధిక్యతలను విలువైనవిగా ఎంచేందుకు ఆయన ఉదాహరణ మనలను కదిలిస్తుంది.
3 యెహోవా మనకు ఒక పరిచర్యను ఇచ్చాడు: ఆధిక్యతతో కూడిన ఈ ప్రతిఫలం విషయంలో పౌలుకుండినటువంటి అదే దృక్పథాన్ని మనమెలా చూపిస్తాం? పరిచర్యలో మన భాగాన్ని పెంచుకునే మార్గాల కొరకు మనం చూస్తాం. అనియతంగానూ, అలాగే ఇంటింటా సాక్ష్యమిచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటాము. కలవని గృహస్థుల విషయంలో అవసరమైన చర్యలను గైకొంటాం. ఆసక్తిగలవారినందరినీ మళ్ళీ దర్శిస్తాం. గృహ బైబిలు పఠనాలను నిర్వహించడానికి వస్తామని చెప్పిన చోటకు వెళ్ళి చెప్పినట్లే చేస్తాం.
4 మన పరిచర్యను గూర్చి చెబుతూ, “ఈ విషయమై త్వరపడేవారై ఉండండి” అని పౌలు బోధించాడు. (2 తిమో. 4:2, NW) అత్యవసరమైన దానికి వెంటనే అవధానాన్నివ్వవలసి ఉంటుంది. మనం మన జీవితాల్లో పరిచర్యకు ప్రాధాన్యతనిస్తూ దానికోసం వేగిరపడతామా? ఉదాహరణకు, వారాంతాల్లో మనం పరిచర్య కొరకు వెచ్చించి తీరవలసిన సమయంలో మన వినోద కార్యకలాపాలూ మన ఇతర వ్యక్తిగత లక్ష్యాలూ జొరబడడాన్ని ఇష్టపడము. ఈ విధానాంతం అతి త్వరగా సమీపిస్తున్నదని మనం ఒప్పింపబడ్డాము గనుక, మనం చేయగల అతి ప్రాముఖ్యమైన పని రాజ్యసువార్తను ప్రకటించడమేనని కూడా మనం ఒప్పించబడ్డాము.
5 దేవుని ఎడల మనం సత్యసంధతగలవారమై, నమ్మకస్థులమై ఉండడం ద్వారా, ఆయన మనకు నియమించిన పనిని ఎడతెగక చేసేవారమై ఉండడం ద్వారా దేవుని ఎడల మన విశ్వాస్యత సూచించబడుతుంది. యెహోవా మన విశ్వాస్యతకు పెద్ద మొత్తంలో ప్రతిఫలమిచ్చేలా మనం మన పరిచర్యను పూర్తిగా నెరవేర్చుదము గాక.