పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త
1 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త ఆధ్యాత్మికంగా పెద్దవాడైన వ్యక్తి. ఆయన ప్రసంగించేందుకూ, బోధించేందుకు బాగా ప్రయాసపడతాడు. ఆయన మన గౌరవానికి సహకరణకు పాత్రుడు. (1 తిమో. 5:17) ఆయన బాధ్యతలేమిటి?
2 రాజ్య మందిరంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయం ఈయన అజమాయిషీలో ఉంటుంది. ఈ పాఠశాల జాబితాలో పేరు చేర్చుకునేందుకు యోగ్యులైనవారినందరినీ ప్రోత్సహించడంలో ఆయన శ్రద్ధాసక్తులను కలిగి ఉంటాడు. ప్రతి పాఠశాల సెషన్‌కు కనీసం మూడువారాల ముందే అసైన్మెంట్లను క్రమబద్ధమైన పద్ధతిలో ఇవ్వగల్గేందుకు ఒక కచ్చితమైన రికార్డు ఉండేలా చూస్తాడు. ఆయన ప్రతి విద్యార్థినీ, అతని సామర్థ్యాలను తన మనస్సులో ఉంచుకుని, సంఘాన్ని బాగా తెలిసికొని ఉండవలసిన అవసరం ఉంది. పాఠశాల పట్టికను తయారు చేయడంలో ఆయనకు సహాయపడేందుకు మరొక సహోదరుడు ఉన్నప్పటికీ, పాఠశాల భాగాలను సరైన విధంగా అసైన్ చేయడంలో ఈ పైవిచారణకర్త యొక్క వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం.
3 పాఠశాలలో ఫలకరంగా బోధించేందుకు, పైవిచారణకర్త ప్రతివారం, తప్పకుండా అసైన్చేయబడిన సమాచారాన్ని బాగా పఠిస్తూ, శ్రద్ధాపూర్వకంగా తయారు కావాలి. ఇలా చేయడం, ఆయన ఈ పాఠశాల కార్యక్రమంలో సంఘం ఉత్సాహం చూపించేదిగా ఉంచగల్గేలా, అసైన్ చేసిన సమాచారం ఖచ్చితంగా చర్చించబడుతుందా లేదా అని నిర్ణయించుకోగల్గేలా, వ్రాతపూర్వక పునఃసమీక్షల్లో రాగల ముఖ్యమైన పాయింట్లను ఉన్నతపర్చగల్గేలా చేస్తుంది.
4 ప్రతి విద్యార్థి ప్రసంగం తర్వాత, పైవిచారణకర్త విద్యార్థిని ప్రశంసించి, నిర్దిష్ట ప్రసంగ లక్షణం ఎందువల్ల చక్కగా ఉందో లేదా ఎందువల్ల అందులో మెరుగుదల అవసరమో వివరిస్తాడు. తన పాఠశాల అసైన్మెంట్లకు సిద్ధమవ్వడంలో ఎవరికైనా అదనపు శిక్షణ అవసరముంటే, ఈ పైవిచారణకర్త లేదా ఈయన నియమించిన మరొకరు ఆ విద్యార్థికి వ్యక్తిగత సహాయాన్ని అందించగలరు.
5 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్తా, ఆయన నిర్దేశం క్రింద సేవచేసే అదనపు ఉపదేశకులైవరైనా ఉంటే వాళ్ళూ తీసుకునే ప్రయాస నుండి మనం పూర్తిగా ప్రయోజనం పొందేందుకు, మనం ఈ పాఠశాలకు క్రమంగా హాజరు కావాలి. మనం మన అసైన్మెంట్లన్నింటినీ చేయాలి, మనకూ అలాగే ఇతర విద్యార్థులకూ ఇచ్చిన ఉపదేశాలను మనం పాటించాలి. ఈ విధంగా, రాజ్య సువార్తను బహిరంగంగా, ఇంటింటా సమర్పించడంలో మన సామర్థ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటాం.—అపొ. 20:20; 1 తిమో. 4:13, 15.