క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
“అవగాహనా శక్తుల విషయంలో పూర్తిగా ఎదగండి” అనేదే 2001 ఫిబ్రవరిలో ప్రారంభం కాబోయే ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం యొక్క అంశం. (1 కొరిం. 14:20) దానికి హాజరవ్వడం మనకెందుకు విలువైనదౌతుంది? చెడుతో నిండివున్న ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. దాన్ని నివారించేందుకు, మన ఆధ్యాత్మిక అవగాహనా శక్తులను మనం పెంపొందించుకోవాలి. అప్పుడు మనం చెడును మంచితో జయించగల్గుతాం. అలా చేసేందుకే ఈ ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం మనకు సహాయం చేస్తుంది.
ప్రారంభ కార్యక్రమంలో “బైబిల్ని అవగాహన చేసుకోవడంలో పూర్తిగా ఎదిగినవారయ్యేందుకు సహాయకాలు” అనే అంశాన్ని ప్రాంతీయ పై విచారణ కర్త చర్చిస్తారు. క్రైస్తవ విశ్వాసంలో ఎలా స్థిరంగా తయారవ్వాలో మనకు చూపిస్తారు. “మీ వివేచనా శక్తులకు శిక్షణనివ్వడం ద్వారా మీ ఆధ్యాత్మికతను కాపాడుకోండి” అనే అంశంపై అతిథి ప్రసంగీకుడు మాట్లాడుతూ సునిశిత గ్రహణశక్తిని పెంపొందించుకోవడంలో, బైబిలు సూత్రాలను వాస్తవ జీవితంలో ఉపయోగించుకోవడం అంటే అన్వయించుకోవడం ఏ విధంగా ప్రాముఖ్యమన్న విషయాన్ని ఉన్నతపరుస్తారు.
అవగాహనా శక్తులను యౌవనులు కూడా పెంపొందించుకోవాలి. ఈ విషయం “దుష్టత్వం విషయమై శిశువులుగా ఎందుకుండాలి,” “అవగాహనను ఇప్పుడే సంపాదించుకుంటున్న యౌవనులు” అనే ఈ రెండు భాగాలలోనూ చర్చించబడుతుంది. లోకపు దుష్ట కార్యకలాపాలను గూర్చిన ఎలాంటి కుతూహలాన్నైనా సరే అదుపు చేసుకొని ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్త వహించేలా యౌవనులు తమను తాము ఆధ్యాత్మికంగా బలపరుచుకొనేందుకు ఏమి చేస్తారో వారు చెప్తుండగా వినండి.
జీవితంలో గొప్ప ఆనందాన్ని మనం ఎలా కనుగొంటాం? దాన్ని, “అవగాహనాశక్తిని ఉపయోగించి బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందండి” అనే ముగింపు ప్రసంగంలో అతిథి ప్రసంగీకుడు వివరిస్తాడు. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడమనేది సమస్యలతో వ్యవహరించడానికీ, నిర్ణయాలు తీసుకోవడానికీ, యెహోవా మనకు బోధిస్తున్న వాటి నుండి నిజంగా ప్రయోజనం పొందడానికీ సహాయపడుతుందని చూపించేందుకు ఆయన మనకు ఉదాహరణలను ఇస్తాడు.
దేవునికి తాము చేసుకున్న సమర్పణను సమావేశంలో నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేయాలనుకుంటున్న వారు, సాధ్యమైనంత త్వరలో సంఘ పై విచారణ కర్తకు దాన్ని గురించి తెలియజేయాలి. ప్రత్యేక సమావేశ దినాన్ని గూర్చి ప్రకటించగానే మీ క్యాలెండరులో దాన్ని మార్క్ చేసుకోండి, ఈ శ్రేష్ఠమైన కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందేలా ఖచ్చితమైన ప్రణాళికలను వేసుకోండి. ప్రత్యేక సమావేశ దినపు ఏ కార్యక్రమాన్నీ తప్పిపోవద్దు! ఇది, ఈ దుష్ట విధానాన్ని సహిస్తూ యెహోవాపట్ల విశ్వసనీయులుగా నిలిచివుండేలా మిమ్మల్ని శక్తిమంతులను చేస్తుంది.