2010 ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
1. (ఎ) ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమ లేఖనాంశాలేమిటి? (బి) గతంలో జరిగిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాల ముఖ్యాంశాలు ఏవైనా పరిచర్యలో వ్యక్తిగతంగా మీకు సహాయం చేశాయా?
1 “శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి,” “ఒక మందగా స్థిరముగా నిలబడుట,” “సత్యమునుగూర్చి సాక్ష్యమిస్తూ ఉండండి,” “మనం జిగటమన్ను – యెహోవా మన కుమ్మరి.” (ఫిలి. 1:9, 10, 27; యోహా. 18:37; యెష. 64:8) గతంలో జరిగిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో చర్చించబడిన అనేక అంశాల్లో ఇవి కొన్ని. 2010 సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమానికి హాజరవ్వాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నారా? ఈ సమావేశ అంశం: “కాలము సంకుచితమై యున్నది,” ఇది 1 కొరింథీయులు 7:29 నుండి తీసుకోబడింది.
2. సమావేశం కోసం మన ఉత్సాహాన్ని ఎలా పెంచుకోవచ్చు?
2 ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమ తేదీని సంఘంలో ప్రకటించిన వెంటనే దాని గురించి ఉత్సాహంగా మాట్లాడుకోండి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు సమావేశం కోసం ఎదురుచూసేలా చేయడానికి సమావేశ తేదీని కాలెండరు మీద రాసిపెట్టి, సమావేశానికి ఇంకా ఎన్ని రోజులున్నాయో లెక్కపెట్టడం మొదలుపెడతారు. సమావేశానికి తీసుకువెళ్ళాల్సిన వాటిని ఒక లిస్టు రాసిపెట్టుకుంటారు. మీరు కుటుంబ ఆరాధన చేసే రోజున, అంతకుముందు జరిగిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాల నోట్సును సమీక్షించవచ్చు. మీరు, మీ కుటుంబం ‘ఎలా వింటున్నారో చూసుకోవడానికి,’ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 13-16 పేజీలను సమీక్షించండి. అలా చేసి ఈ సమావేశం కోసం మీ హృదయాన్ని సిద్ధం చేసుకోవచ్చు.—లూకా 8:18.
3. సమావేశం నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు?
3 నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టండి: సమావేశం అయిపోయిన తర్వాత, “కార్యక్రమం చాలా బాగుంది కదా!” అని అందరూ ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. అది నిజమే, ఎందుకంటే యెహోవా చేసిన గొప్ప ఏర్పాట్లలో అదొకటి. (సామె. 10:22) సమాచారం నుండి ప్రయోజనం పొందాలంటే దాని గురించి ధ్యానించాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. (లూకా 8:15) సమావేశం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో మీ కుటుంబంతో, మీతో ప్రయాణించే తోటి సహోదరులతో కార్యక్రమం గురించి మాట్లాడండి. మీ లక్ష్యాల గురించి, పరిచర్యలో సహాయంచేసే అంశాల గురించి ఒకరితో ఒకరు చర్చించుకోండి. అలా చేస్తే సమావేశం అయిపోయిన చాలా రోజుల వరకూ సమాచారాన్ని గుర్తుంచుకోగల్గుతారు.—యాకో. 1:25.
4. ఈ సమావేశం మనకెందుకు ప్రత్యేకమైనది?
4 ఎవరైనా మనకు సరిగ్గా అవసరమైన వస్తువును బహుమతిగా ఇస్తే మనమెంతో సంతోషిస్తాం. ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో యెహోవా మన కోసం ఏమి సిద్ధంచేసి పెట్టాడోనని మనం ఆత్రుతగా ఎదురుచూడవద్దా? ఆ కార్యక్రమం మనకు అన్నివిధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని మనం పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. మన పరలోక తండ్రియైన యెహోవా మనకు అప్పగించిన పనిని చేయడానికి కావాల్సిన ప్రోత్సాహం, శిక్షణ అనే సరైన బహుమానాలనే ఆయనిస్తాడని ఎదురుచూడవచ్చు.—2 తిమో. 4:2; యాకో. 1:17.