కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/03 పేజీ 1
  • ‘దాన్ని అంగీకరించండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘దాన్ని అంగీకరించండి’
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • అవివాహిత జీవితం ఒక బహుమానమైనప్పుడు
    తేజరిల్లు!—1995
  • అవివాహిత స్థితి—పరధ్యానంలేని కార్యకలాపానికి మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అవివాహితులుగా ఉన్నా యెహోవా సేవలో సంతృప్తిగా ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 4/03 పేజీ 1

‘దాన్ని అంగీకరించండి’

1 ఒకసారి యేసు తన శిష్యులతో వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు, అవివాహితులుగా ఉండడమంటే ‘అనుగ్రహము నొందడం’ అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు: “(ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక.” (మత్త. 19:10-12) కొన్ని సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు అవివాహితులుగా ఉండడంలోని ప్రయోజనాల గురించి వ్రాసి, వివాహం చేసుకోకుండా ఉండడంలో తన మాదిరిని అనుకరించమని ఇతరులను ప్రోత్సహించాడు. (1 కొరిం. 7:6, 7, 38) నేడు అనేకులు అవివాహితులుగా ఉండడాన్ని ‘అంగీకరించి’ దాని వల్ల కలిగే ప్రయోజనాలను పొందుతున్నారు. ఆ ప్రయోజనాల్లో కొన్ని ఏమిటి?

2 “తొందర యేమియు లేక” సేవ చేయడం: పౌలు తాను అవివాహితునిగా ఉండడం వల్ల “తొందర యేమియు లేక” యెహోవా సేవ చేసే అవకాశం ఉందని అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా నేడు అవివాహితుడైన ఒక సహోదరుడు మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూలులో చేరేందుకు సిద్ధం కావచ్చు. సాధారణంగా ఇతరుల కంటే అవివాహితులకు పయినీరు సేవ ప్రారంభించడం, మరో భాష నేర్చుకోవడం, అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళడం, బేతేలులో సేవ చేయడం లేదా ప్రత్యేక సేవాధిక్యతల కోసం ముందుకు రావడం సులభంగా ఉంటుంది. వ్యక్తిగతంగా లోతైన అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి, హృదయపూర్వకంగా ప్రార్థించడం ద్వారా యెహోవాతో సన్నిహితంగా మాట్లాడడానికి వారికి ఎక్కువ సమయం, అవకాశాలు ఉండవచ్చు. అవివాహితుడు ఇతరులకు సహాయం చేయడానికి సాధారణంగా ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతాడు. ఇలాంటి కార్యకలాపాలన్నీ వారి “ప్రయోజనము నిమిత్తమే.”—1 కొరిం. 7:32-35; అపొ. 20:35.

3 ఇలా తొందరేమి లేకుండా దేవునికి సేవ చేయడం వల్ల గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయి. కెన్యాలో 27 సంవత్సరాలు గడిపిన ఒక అవివాహిత సహోదరి ఇలా వ్రాసింది: “నాకు ఎంతోమంది స్నేహితులు ఉండేవారు, చేయడానికి ఎంతో పని ఉండేది! మేము కలిసి పనులు చేసేవాళ్ళం, ఒకరినొకరం సందర్శించుకునేవాళ్ళం. . . . అవివాహితగా ఉండడంవల్ల లభించే అదనపు స్వేచ్ఛను పరిచర్యలో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ఉపయోగించుకోగలిగాను, అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంవత్సరాలన్నింటిలో యెహోవాతో నా సంబంధం మరింత బలపడింది” అని ఆమె చెబుతోంది.

4 దాన్ని అంగీకరించడం: “పరలోక రాజ్యము నిమిత్తము” అవివాహితులుగా ఉండడమనే వరాన్ని అంగీకరించాలని యేసు చెప్పాడు. (మత్త. 19:12) ఇతర వరాల్లాగే, అవివాహితులుగా ఉండడం అనే వరం నుండి ఆనందం, ప్రయోజనం పొందడానికి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవివాహితులుగా ఉండడం వల్ల వచ్చే అవకాశాలను చేజిక్కించుకోవడం ద్వారా, పరిజ్ఞానము మరియు శక్తి కోసం యెహోవాపై ఆధారపడడం ద్వారా అనేకమంది అవివాహితులు ఆ వరాన్ని అంగీకరించడంలోని విలువను అర్థం చేసుకున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి