కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/07 పేజీ 1
  • మనకు అప్పగించబడిన ఐశ్వర్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకు అప్పగించబడిన ఐశ్వర్యం
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ప్రకటనా పనిని అమూల్యంగా ఎంచండి
    మన రాజ్య పరిచర్య—2011
  • కంటికి కనిపించని సంపదల పట్ల కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • మీ రాజ్యసేవా సంపత్తిని విస్తృతపర్చండి
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 2/07 పేజీ 1

మనకు అప్పగించబడిన ఐశ్వర్యం

1 అపొస్తలుడైన పౌలు, ప్రకటించమని దేవుడు తనకిచ్చిన నియామకాన్ని విలువైనదిగా ఎంచి, దానిని “ఐశ్వర్యం” అని పేర్కొన్నాడు. (2 కొరిం. 4:7) ఆ నియామకాన్ని నెరవేర్చడానికి ఆయన కష్టాలను, హింసను సహించాడు. ఆయన నిర్విరామంగా, తాను కలిసిన ప్రతీ ఒక్కరికీ ప్రకటించాడు. ఆయన నేలమీద, సముద్రంలో ఎంతో కష్టమైన, అపాయకరమైన పరిస్థితుల్లో ప్రయాణించాడు. మనం పౌలును అనుకరిస్తూ, మన పరిచర్యను విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించగలం? (రోమా. 11:14) మన పరిచర్యను సాటిలేని ఐశ్వర్యంగా చేసేదేమిటి?

2 శ్రేష్ఠమైన ఐశ్వర్యం: భూ సంబంధమైన ఐశ్వర్యం తరచూ హృదయవేదనను కలిగిస్తుంది, అది పరిమితమైన లేదా తాత్కాలికమైన ప్రయోజనాలను మాత్రమే తీసుకువస్తుంది. మరోవైపు, మన పరిచర్య మనకు, ఇతరులకు శాశ్వత ప్రయోజనాలను తీసుకువస్తుంది. (1 తిమో. 4:16) యథార్థవంతులు యెహోవా గురించి తెలుసుకోవడానికి, తమ జీవితాల్లో అవసరమైన మార్పులు చేసుకోవడానికి, నిరంతర జీవితమనే నిజమైన నిరీక్షణ పొందేందుకు అది వారికి సహాయం చేస్తుంది. (రోమా. 10:13-15) మన పరిచర్యను విలువైనదిగా ఎంచడం ద్వారా మనకు జీవితంలో సంతృప్తికరమైన సంకల్పం ఉంటుంది, మన నియామకాన్ని నెరవేర్చామనే ఆనందం ఎప్పటికీ ఉంటుంది, భవిష్యత్తు కొరకు ఉజ్వలమైన నిరీక్షణ ఉంటుంది.​—1 కొరిం. 15:58.

3 మీ ఐశ్వర్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నారని చూపించండి: మనం ఏదైనా ఒకదాని కోసం ఎంత త్యాగం చేస్తే దాన్ని అంత విలువైనదిగా ఎంచుతున్నామని అది చూపిస్తుంది. యెహోవాను స్తుతించడానికి మన సమయాన్ని, శక్తిని వెచ్చించడం ఎంతటి ఆధిక్యతో కదా! (ఎఫె. 5:15-17) మనం మన సమయాన్ని వెచ్చించే విధానం, మనం వస్తుసంపదను అన్వేషించడానికి కాక ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని చూపించాలి. మన దగ్గర ఇతరులకు తెలియజేయడానికి ఎంతో ప్రశస్తమైన సమాచారం ఉంది కాబట్టి దానిని మనం ఉత్సాహంగా ప్రకటించాలనుకుంటాము, అవకాశం దొరికినప్పుడెల్లా సువార్త ప్రకటించడానికి అప్రమత్తంగా ఉండాలనుకుంటాము.

4 సాధారణంగా అమూల్యమైన ఐశ్వర్యాలను దాచిపెట్టరు కానీ అందరికీ చూపిస్తారు. మనం మన పరిచర్యను ఒక ఐశ్వర్యంగా దృష్టిస్తే, అది మన జీవితంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. (మత్త. 5:14-16) మనం ఎల్లప్పుడూ హృదయపూర్వక ప్రశంసతో అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ, మన పరిచర్యను విలువైనదిగా ఎంచుతున్నామని, దానిని ఐశ్వర్యమన్నట్లుగా భావిస్తున్నామని చూపించేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి