కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/07 పేజీ 1
  • ‘బహుగా ఫలిస్తూ ఉండండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘బహుగా ఫలిస్తూ ఉండండి’
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘బహుగా ఫలించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • శిష్యులు ఫలించాలి, యేసుకు స్నేహితులుగా ఉండాలి
    యేసే మార్గం, సత్యం, జీవం
  • “ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము”!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 6/07 పేజీ 1

‘బహుగా ఫలిస్తూ ఉండండి’

1 యేసు సూచనార్థక పదాలను ఉపయోగిస్తూ తనను తాను నిజమైన ద్రాక్షావల్లితో, తన తండ్రిని వ్యవసాయదారునితో, తన ఆత్మాభిషిక్త అనుచరులను ఫలించే ద్రాక్షాతీగలతో పోల్చాడు. యేసు సూచనార్థక వ్యవసాయదారుని పనిని వర్ణిస్తున్నప్పుడు, తీగలు ద్రాక్షావల్లిని గట్టిగా అంటిపెట్టుకొని ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆయన నొక్కిచెబుతున్నాడు. (యోహా. 15:1-4) దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చంటే, యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివున్న ప్రతీఒక్కరూ “నిజమైన ద్రాక్షావల్లి” అయిన యేసుక్రీస్తుకు చెందిన ఫలించే తీగలా ఉండాలి. మనం ‘ఆత్మ ఫలాలను’ అలాగే రాజ్య ఫలాలను అధికంగా ఫలిస్తూ ఉండాలి.—గల. 5:22; మత్త. 24:14; 28:19, 20.

2 ఆత్మ ఫలాలు: ఆత్మ ఫలాలను మనం ఎంత చక్కగా కనబరుస్తామనే దానిని బట్టే, మన ఆధ్యాత్మిక అభివృద్ధిని అంచనా వేయవచ్చు. దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయడంద్వారా, ధ్యానించడంద్వారా దేవుని ఆత్మ ఫలాలను పెంపొందించుకోవడానికి మీరు కృషి చేస్తారా? (ఫిలి. 1:9-11) యెహోవాను మహిమపర్చే లక్షణాలను మీరు పెంపొందించుకోవడానికి, క్రమంగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి మనకు సహాయపడే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడానికి సంకోచించకండి.—లూకా 11:13; యోహా. 13:35.

3 ఆత్మ ఫలాల్ని పెంపొందించుకోవడం, మనం మరింత ఉత్సాహవంతమైన ప్రచారకులుగా తయారయ్యేందుకు కూడా మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మనకు తీరికలేనంతగా పనులున్నా పరిచర్యలో క్రమంగా పాల్గొనేందుకు సమయాన్ని కేటాయించేలా ప్రేమ, విశ్వాసం మనల్ని పురికొల్పుతాయి. సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి లక్షణాలు వ్యతిరేకించేవారితో మనం సరైనవిధంగా వ్యవహరించడానికి మనకు సహాయం చేస్తాయి. ప్రజలు సరిగా ప్రతిస్పందించకపోయినా మన పరిచర్య నుండి సంతృప్తిని పొందేలా సంతోషం మనకు సహాయం చేస్తుంది.

4 రాజ్య ఫలాలు: మనం రాజ్య ఫలాలను కూడా ఫలించాలని కోరుకుంటాం. దీనిలో ‘దేవునికి స్తుతియాగము చేయడం, అనగా [యెహోవా] నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలమును అర్పించడం’ ఇమిడివుంది. (హెబ్రీ. 13:15) మనం ఉత్సాహంగా, పట్టుదలతో సువార్తను ప్రకటించడంద్వారా దానిని అర్పిస్తాం. మీ వ్యక్తిగత పరిచర్యను మెరుగుపరుచుకోవడం ద్వారా మరిన్ని రాజ్య ఫలాలను ఫలించేందుకు మీరు కృషి చేస్తున్నారా?

5 తన నమ్మకమైన అనుచరులు వివిధ మొత్తాల్లో ఫలాలను ఫలిస్తారని యేసు సూచించాడు. (మత్త. 13:23) కాబట్టి, మనల్ని మనం ఇతరులతో పోల్చుకోకుండా, మనం యెహోవాకు ఇవ్వగలిగినదంతా ఇస్తాం. (గల. 6:4) దేవుని వాక్యం సహాయంతో మన వ్యక్తిగత పరిస్థితులను నిజాయితీగా పరిశీలించుకోవడం, మనం ‘బహుగా ఫలిస్తూ’ యెహోవాను మహిమపర్చడంలో కొనసాగేందుకు సహాయం చేస్తుంది.—యోహా. 15:8.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి