కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w20 జూన్‌ పేజీ 17
  • పాఠకుల ప్రశ్న

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్న
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ‘ఆత్మానుసారంగా నడుచుకుంటూనే’ ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ‘బహుగా ఫలిస్తూ ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2007
  • బాప్తిస్మం తర్వాత కూడా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
w20 జూన్‌ పేజీ 17

పాఠకుల ప్రశ్న

గలతీయులు 5:22, 23 లో ఉన్నవి మాత్రమే పవిత్రశక్తి పుట్టించే లక్షణాలా?

  • ప్రేమ

  • సంతోషం

  • శాంతి

  • ఓర్పు

  • దయ

  • మంచితనం

  • విశ్వాసం

  • సౌమ్యత

  • ఆత్మనిగ్రహం

ఆ వచనాల్లో మొత్తం తొమ్మిది లక్షణాలు ఉన్నాయి. “పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు ఏమిటంటే: ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం.” అయితే పవిత్రశక్తి పుట్టించే మంచి లక్షణాలు ఇవి మాత్రమేనని మనం అనుకోకూడదు.

అంతకు ముందున్న వచనాల్లో పౌలు ఏమన్నాడో గమనించండి: ‘శరీర కార్యాలు ఏమిటంటే: లైంగిక పాపం, అపవిత్రత, లెక్కలేనితనం, విగ్రహపూజ, మంత్రవిద్య, శత్రుత్వం, గొడవలు, అసూయ, విపరీతమైన కోపం, విభేదాలు, విభజనలు, తెగలు, ఈర్ష్య, తాగుబోతుతనం, విచ్చలవిడి విందులు మొదలైనవి.’ (గల. 5:19-21) గమనించారా? పౌలు “మొదలైనవి” అనే మాటను ఉపయోగించాడే గానీ, కొలొస్సయులు 3:5 లో ఉన్నలాంటి పనుల్ని ఇక్కడ ప్రస్తావించలేదు. అదేవిధంగా, పవిత్రశక్తి పుట్టించే తొమ్మిది లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా, “ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేదీ లేదు” అని పౌలు అన్నాడు. కాబట్టి పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు కేవలం ఇవి మాత్రమే అని ఆయన చెప్పట్లేదు.

అదేవిధంగా, పౌలు తిమోతికి ఆరు మంచి లక్షణాల్ని, అంటే “నీతిని, దైవభక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, సౌమ్యతను” అలవర్చుకోమని చెప్పాడు. (1 తిమో. 6:11) అందులో మూడు మాత్రమే (విశ్వాసం, ప్రేమ, సౌమ్యత మాత్రమే) ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు.’ అయితే మిగతా మూడు లక్షణాలైన నీతిని, దైవభక్తిని, సహనాన్ని అలవర్చుకోవాలంటే కూడా తిమోతికి పవిత్రశక్తి సహాయం అవసరం.—కొలొ. 3:12; 2 పేతు. 1:5-7 తో పోల్చండి.

కాబట్టి గలతీయులు 5:22, 23 లో ఉన్నవి మాత్రమే పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు అని అనుకోకూడదు. ఆ తొమ్మిది లక్షణాల్ని అలవర్చుకోవడానికి పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. అయితే పరిణతిగల క్రైస్తవులం అవ్వాలన్నా, ‘నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలన్నా’ మనం అలవర్చుకోవాల్సిన లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి.—ఎఫె. 4:24.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి