కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/11 పేజీ 1
  • గొప్ప సాక్ష్యం ఇవ్వబడుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గొప్ప సాక్ష్యం ఇవ్వబడుతుంది
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లను ఆహ్వానించండి!
    మన రాజ్య పరిచర్య—2013
  • జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి మనమెలా సహాయం చేయవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2008
  • కొత్తవాళ్లకు స్వాగతం చెప్దాం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • జ్ఞాపకార్థ కూటానికి వారు ఆహ్వానించబడ్డారని భావించేలా చేయండి
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 4/11 పేజీ 1

గొప్ప సాక్ష్యం ఇవ్వబడుతుంది

1. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వాళ్లు ప్రసంగం విని మాత్రమే కాకుండా ఇంకా ఏమి చూసి కూడా ముగ్ధులవుతారు? వివరించండి.

1 ఎప్పుడు? జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకునే రాత్రి. మనతో పాటు హాజరవడానికి చాలామందికి ఆహ్వానపత్రికలు ఇవ్వడానికి ఎంతో కృషి చేశాం. ఆ కార్యక్రమానికి హాజరైనవాళ్లు తాము వినేదాన్ని బట్టి మాత్రమే కాదు తాము చూసేదాన్ని బట్టి కూడా ముగ్ధులవుతారు. ఒకావిడ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన తర్వాత, ప్రత్యేకంగా అక్కడ చూసిన విషయాలు అంటే అక్కడ అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, ఆ కార్యక్రమం జరిగిన అందమైన, శుభ్రమైన భవనాన్ని స్వచ్ఛంద సేవకులు కట్టి, దాని బాగోగులు చూసుకోవడం తనను ఎంత ముగ్ధురాలిని చేశాయో చెప్పింది. కాబట్టి, సంవత్సరంలో జరిగే అతిప్రాముఖ్యమైన ఈ సందర్భంలో ప్రసంగీకుడు మాత్రమే కాదు, మనందరం సాక్ష్యమివ్వడంలో పాల్గొంటాం.—ఎఫె. 4:16.

2. కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు మనందరం ఎలా సాక్ష్యమివ్వవచ్చు?

2 వచ్చినవాళ్లను ఆప్యాయంగా పలకరించండి: వచ్చినవాళ్లను చూసి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వడమే కాదు మనం ఆప్యాయంగా పలకరిస్తే చక్కని సాక్ష్యం ఇచ్చినట్టే. (యోహా. 13:35) మీరు అందరితో మాట్లాడలేకపోయినా, మీకు దగ్గర్లో ఉన్నవాళ్లను ఆప్యాయంగా పలకరించి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. (హెబ్రీ. 13:1, 2) ఎవ్వరూ పరిచయంలేని కొత్తవాళ్లు ఎవరైనా ఉన్నారేమో గమనించండి. ఆహ్వాన పత్రికలను ఇచ్చే కార్యక్రమంలో వాళ్లకు కూడా ఒక ఆహ్వాన పత్రిక దొరికివుంటుంది. “మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా, లేకపోతే ఇదే మొదటిసారా?” అంటూ వాళ్లను పలకరించవచ్చు. మీతో కూర్చోమని అడగండి. వాళ్లకు ఏమైనా సందేహాలుంటే తీర్చండి. మీ తర్వాత మరో సంఘం ఆ రాజ్య మందిరాన్ని లేదా హాలును వాడుకోవడానికి వీలుగా మీరు త్వరగా అక్కడ నుండి వెళ్లాల్సివుంటే, “కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని మళ్లీ కలవాలంటే ఎలాగండీ?” అని అడగవచ్చు.

3. నిష్క్రియులను మనమెలా ఆహ్వానించవచ్చు?

3 నిష్క్రియులను ఆహ్వానించండి: నిష్క్రియులైన ప్రచారకులు కూడా జ్ఞాపకార్థ ఆచరణకు తప్పకుండా వస్తారు. వాళ్లల్లో కొంతమంది ప్రతీ సంవత్సరం కేవలం జ్ఞాపకార్థ ఆచరణకు మాత్రమే వస్తుండవచ్చు. వాళ్లను ఆహ్వానించండి, మీరు వాళ్లను చూసి నిజంగా సంతోషిస్తున్నారని వాళ్లకు అర్థమయ్యేలా చేయండి. (రోమా. 15:7) పెద్దలు త్వరలోనే వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లు మళ్లీ సంఘంతో సహవసించేలా వాళ్లను ప్రోత్సహించవచ్చు. వచ్చినవాళ్లలో చాలామంది తాము విన్నదాన్ని బట్టి మాత్రమే కాదు, ‘తాము చూసిన సత్క్రియలను’ బట్టి కూడా దేవుణ్ణి మహిమపర్చడానికి ముందుకొస్తారు.—1 పేతు. 2:12.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి