కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/13 పేజీలు 2-3
  • వాళ్లను ఆహ్వానించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లను ఆహ్వానించండి!
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • గొప్ప సాక్ష్యం ఇవ్వబడుతుంది
    మన రాజ్య పరిచర్య—2011
  • కొత్తవాళ్లకు స్వాగతం చెప్దాం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి మనమెలా సహాయం చేయవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2008
  • జ్ఞాపకార్థ కూటానికి వారు ఆహ్వానించబడ్డారని భావించేలా చేయండి
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2013
km 3/13 పేజీలు 2-3

వాళ్లను ఆహ్వానించండి!

1. సాక్ష్యమివ్వడానికి ఏది మంచి సందర్భం? ఎందుకు?

1 సాక్ష్యమివ్వడానికి, ప్రతీ సంవత్సరం జరిగే జ్ఞాపకార్థ ఆచరణ కంటే మంచి అవకాశం ఇంకొకటి లేదు. ఈసారి జ్ఞాపకార్థ ఆచరణకు ఒక కోటి కన్నా ఎక్కువమంది కొత్తవాళ్లు హాజరౌతారని ఆశిస్తున్నాం. వాళ్లకు, విమోచన క్రయధనం ద్వారా యెహోవా, యేసుక్రీస్తు చూపించిన అసాధారణ ప్రేమ గురించి వినే సదవకాశం దొరుకుతుంది. (యోహా. 3:16; 15:13) యెహోవా ఇచ్చిన ఆ బహుమానం నుండి తామెలా ప్రయోజనం పొందవచ్చో కూడా వాళ్లు తెలుసుకుంటారు. (యెష. 65:21-23) అయితే, ఆ సందర్భంలో సాక్ష్యమిచ్చేది ప్రసంగీకుడు మాత్రమే కాదు. ఆచరణకు వచ్చే కొత్తవాళ్లను సాదరంగా ఆహ్వానిస్తూ హాజరైన వాళ్లందరూ శక్తివంతమైన సాక్ష్యమివ్వవచ్చు.—రోమా. 15:7.

2. కొత్తవాళ్లను ఎలా సాదరంగా ఆహ్వానించవచ్చు?

2 మీరు మీ సీట్లో కూర్చొని, కార్యక్రమం ఎప్పుడు మొదలౌతుందాని ఎదురుచూసే బదులు, మీకు దగ్గర్లో కూర్చున్న కొత్తవాళ్లను పరిచయం చేసుకుని వాళ్లతో మాట్లాడండి. కొత్తగా వచ్చిన వాళ్లకు అక్కడేమి జరుగుతుందో తెలియదు కాబట్టి కాస్త కంగారు పడుతుంటారు. మనం చిరునవ్వుతో పలకరించి మాట్లాడితే వాళ్ల కంగారు పోతుంది. ఎవరైనా కేవలం ఆహ్వానపత్రాన్ని అందుకొని వచ్చారేమో తెలుసుకోవడానికి, ‘మా కూటాలకు రావడం ఇదే మొదటిసారా?’ అని లేదా ‘మా సంఘంలో ఎవరైనా మీకు తెలుసా?’ అని అడగవచ్చు. వాళ్లని మీతోపాటు కూర్చోబెట్టుకొని మీ బైబిలును, పాటల పుస్తకాన్ని వాళ్లకు కూడా చూపించవచ్చు. ఒకవేళ ఆచరణను రాజ్యమందిరంలో జరుపుకుంటుంటే, కాసేపు రాజ్యమందిరంలోని ఆయా విషయాలను చూపిస్తూ, వాటి గురించి వివరించవచ్చు. ప్రసంగం తర్వాత వాళ్లకొచ్చే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పండి. మీ తర్వాత మరో సంఘం వాళ్లు ఆచరణ జరుపుకునేలా ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సివస్తే, ‘ఈ ఆచరణ మీకెలా అనిపించిందో తెలుసుకోవాలనుంది, మళ్లీ మీతో మాట్లాడాలంటే ఎలా?’ అని అడగవచ్చు. వాళ్లను మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోండి. ప్రచారకులు ఎవరైనా నిష్క్రియులుగా ఉంటే, వాళ్లను ప్రోత్సహించడానికి పెద్దలు ప్రత్యేకంగా కృషిచేస్తారు.

3. కొత్తవాళ్లను ఆహ్వానించడానికి చొరవ తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

3 ఆచరణకు వచ్చే వాళ్లలో చాలామంది, యెహోవా ప్రజల మధ్యవుండే సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను మొట్టమొదటిసారి అప్పుడే రుచిచూస్తారు. (కీర్త. 29:11; యెష. 11:6-9; 65:13, 14) వాళ్లు తమతోపాటు ఎలాంటి జ్ఞాపకాలు తీసుకువెళ్తారనేది, వాళ్లకు సహాయం చేయడానికి మనం చూపించే చొరవ పైనే ఎక్కువగా ఆధారపడివుంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి