ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
డిసెంబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“భూమి విషయంలో దేవుని సంకల్పం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] సృష్టికర్త ఏమి చేయాలనుకుంటున్నాడో తెలిపే లేఖనాన్ని మీకు చూపించవచ్చా?” ఇంటివారు ఆసక్తి చూపిస్తే కీర్తన 37:11 చదివి, 16వ పేజీలోని ఆర్టికల్ చూపించండి. మొదటి అంశాన్ని చర్చించి, మిగతా ఆర్టికల్ గురించి మాట్లాడడానికి మళ్ళీ వస్తానని చెప్పండి.
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“యేసుక్రీస్తు గురించి ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. యేసు గురించి మీరేమి అనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] క్రీస్తు మనుష్యులందరి కోసం చనిపోయాడని చాలామంది అంటారు. అయితే మీకు ఆసక్తి ఉంటే, క్రీస్తు ప్రాణత్యాగం చేయడం వల్ల మానవజాతికి ఎలా మేలు జరిగిందో వివరించే లేఖనాన్ని చూపిస్తాను. [ఇంటివారికి ఆసక్తి ఉందని మీరు గమనిస్తే ప్రకటన 21:3, 4 చదవండి.] క్రీస్తు నిజంగా ఎవరో ఈ పత్రికలో సవివరంగా ఉంది.”