ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
“కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి” కరపత్రం అన్ని కుటుంబాలకు నచ్చుతుంది. దాన్ని ఇవ్వడానికి మీరు ఇలా చెప్పవచ్చు:
“నేడు కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి కదా. కుటుంబ బంధాలు బలపడాలంటే ఏమి చేయాలంటారు?” ఆ వ్యక్తి జవాబు చెప్పిన తర్వాత, దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు చూపించవచ్చేమో అడగండి. ఆయన ఇష్టపడితే 6వ పేజీలోని మొదటి పేరాలో ఉన్న అంశాలు చూపించండి. కరపత్రంలోని 4, 5 పేజీల్లో ఉల్లేఖించిన ఏదైనా ఒక లేఖనాన్ని చదివి, దాని అర్థాన్ని వివరించండి. ఆ తర్వాత ఉచిత బైబిలు అధ్యయనం గురించి చెప్పండి.