ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
అక్టోబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో దేవునికి ప్రార్థిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాస్తికులు కూడా ప్రార్థన చేశారు. మరి దేవుడు అన్ని ప్రార్థనలు వింటాడా, మీరేమంటారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఏమి చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?” ఒకవేళ గృహస్థులు ఆసక్తి చూపిస్తే, అక్టోబరు—డిసెంబరు పత్రికలోని చివరి పేజీ చూపించి అందులోని రెండవ ప్రశ్నను చర్చించండి. అలాగే, అక్కడ ఇచ్చిన లేఖనాల్లో కనీసం ఒకదాన్ని తీసి వివరించండి. పత్రిక ఇచ్చి, మరో ప్రశ్న చర్చించడానికి మళ్లీ వాళ్లను కలిసే ఏర్పాటు చేసుకోండి.
కావలికోట అక్టోబరు—డిసెంబరు
“మనుషులు ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడని చాలామంది అనుకుంటారు. మీకెప్పుడైనా అలా అనిపించిందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] దుఃఖం, వేదన లేని రోజులు వస్తాయని మన సృష్టికర్త ఇచ్చిన మాటను మీకు చూపించవచ్చా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే ప్రకటన 21:4 చదవండి.] మనుషులు ఇన్ని బాధలుపడడానికిగల ఐదు ముఖ్యమైన కారణాల్ని ఈ పత్రిక వివరిస్తోంది. అంతేకాక, దేవుడు ఈ బాధనంతటినీ ఎలా తీసేస్తాడని లేఖనాలు చెబుతున్నాయో ఇది తెలియజేస్తోంది.”