ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
అక్టోబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“దుష్టత్వాన్ని, బాధలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడని మీకెప్పుడైనా అనిపించిందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] దీని గురించి ఆసక్తికరమైన ఒక విషయాన్ని మీకు చూపించమంటారా?” గృహస్థుడు ఆసక్తి చూపిస్తే కావలికోట, అక్టోబరు - డిసెంబరు సంచిక 18వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని, అందులో చదవండి అనివున్న లేఖనాల్లో ఒకదాన్ని కలిసి చదవండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“యేసు గురించి చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] యేసు పాత్ర గురించి బైబిలు ఏమి చెబుతుందో చూపించమంటారా? [గృహస్థుడు ఒప్పుకుంటే యోహాను 17:3 చదవండి.] యేసు గురించిన సత్యాన్ని అంటే ఆయన ఎక్కడ నుండి వచ్చాడు, ఎలా జీవించాడు, ఎందుకు చనిపోయాడు అనే విషయాలను ఈ పత్రిక వివరిస్తుంది.”