పరిచర్యలో jw.org వెబ్సైట్ ఉపయోగించండి
రాజ్య సువార్తను “భూదిగంతముల వరకు” చేరవేయడానికి మన వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుంది. (అపొ. 1:8) jw.org వెబ్సైట్ గురించి చాలామందికి తెలీదు. కాబట్టి, మనమే దాని గురించి చెప్పాలి.
ఒక ప్రయాణ పర్యవేక్షకుడు బైబిలు ఎందుకు చదవాలి? వీడియోను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, అవకాశం దొరికినప్పుడల్లా ఇతరులకు చూపిస్తున్నాడు. ఉదాహరణకు, ఇంటింటి పరిచర్యలో ఆయన ఇలా అంటాడు: “ముఖ్యమైన మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేందుకు నేను అందరికీ సహాయం చేస్తున్నాను. అవేంటంటే, లోకంలో ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి? వాటిని దేవుడు ఎలా పరిష్కరిస్తాడు? అప్పటివరకు వాటిని మనమెలా తట్టుకోవచ్చు? జవాబులు ఈ చిన్న వీడియోలో ఉన్నాయి.” వీడియో ప్లే చేసి వాళ్లేమంటారో గమనిస్తాడు. ఆ వీడియో ఎంత బాగుంటుందంటే, చాలామంది దాన్ని చివరివరకు చూస్తారు. అప్పుడు ఆ సహోదరుడు ఇలా అంటాడు: “ఇంటర్నెట్లో బైబిలు అధ్యయనం కోసం అడగవచ్చని మీరు ఇప్పుడే విన్నారు కదా? ఆ అధ్యయనం ఎలా చేస్తారో నన్ను చూపించమంటారా?” ఇంటివాళ్లు ఒప్పుకుంటే, మంచివార్త బ్రోషురు ఉపయోగించి అధ్యయనం చేసి చూపిస్తాడు. ఇంటివాళ్లకు సమయం లేకపోతే మళ్లీ కలుసుకున్నప్పుడు చూపించేలా ఏర్పాట్లు చేసుకుంటాడు. పరిచర్య మధ్యలో కాఫీ తాగడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడున్న వాళ్లతో ముందు మామూలుగా మాట్లాడి, తర్వాత పై లాగే jw.org గురించి చెబుతాడు. మీరు కూడా పరిచర్యలో jw.org వెబ్సైట్ను ఉపయోగిస్తున్నారా?