పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—బైబిలు బోధిస్తోంది పుస్తకం, మంచివార్త బ్రోషురుతో ఎలా నేర్పిస్తామో చూపించండి
ఎందుకు ప్రాముఖ్యం? మనం ఉచిత గృహ బైబిలు అధ్యయనాలు చేస్తామని చెప్పినప్పుడు చాలామందికి అర్థంకాకపోవచ్చు. అధ్యయనం అంటే, అందరితో కలిసి కూర్చుని చదవడం, పరీక్షలు రాసి సర్టిఫికెట్ సంపాదించడం అనుకోవచ్చు. కాబట్టి బైబిలు అధ్యయనం చేస్తామని చెప్పే బదులు, ఎలా చేస్తామో చూపిస్తే బావుంటుంది! బైబిలు అధ్యయనం ఎంత సులువుగా అర్థమయ్యేలా ఉంటుందో కొన్ని నిమిషాల్లో, తలుపు దగ్గరే చూపించవచ్చు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
కొత్తగా ఒకరికి బైబిలు నేర్పించేందుకు మీరు చేసే ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థించండి.—ఫిలి. 2:13.
బైబిలు బోధిస్తోంది పుస్తకం లేదా మంచివార్త బ్రోషురుతో బైబిలు ఎలా నేర్పిస్తామో చూపించడానికి ప్రయత్నించండి. పరిచర్యలో కనీసం ఒక్కసారైనా బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి.